Gadwal News | గద్వాల నియోజకవర్గం లో గద్వాల మండలం పరిధిలోని బస్రా చెరువు గ్రామం సమీపంలో దయ్యాల వాగుపై చెక్ డ్యాం నిర్మాణం రూ.196 కోట్ల వ్యయంతో చెక్ డ్యాం(check dam) నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(bandla krishna mohan reddy) చేతుల మీదుగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాతనే రైతులకు మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయని తెలిపారు.
దీంతో గద్వాల(Gadwal News) నియోజకవర్గంలో ఏటేటా పంటల సాగు పెరుగుతుందన్నారు. అదే విధంగా దయ్యాల వాగుపై రూ.1.96 కోట్లతో చెక్ డ్యాం నిర్మాణం చేపట్టామన్నారు. చెక్ డ్యాం వల్ల ఈ ప్రాంతంలో సుమారు రూ.2 వేల ఎకరాల వరకు, చివరి ఆయకట్టు వరకు రైతులకు నీరు అందించడం జరుగుతుందన్నారు. రైతులు నీటిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రామేశ్వరరావు, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, స్థానిక సర్పంచ్ హరిత, సర్పంచ్ మన్యం, గద్వాల టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి సాయి శ్యామ్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు రమేష్ నాయుడు, జయరాం రెడ్డి, నరసింహారెడ్డి, కురుమన్న, జిల్లా సమన్వయకర్త చక్రధర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ