Gaalodu Trailer: ‘గాలోడు’గా వ‌స్తున్న Sudigali Sudeer ట్రైల‌ర్ మామూలుగా లేదుగా!

Gaalodu (2022)
Director: Rajasekhar Reddy Pulicherla
Stars: Sudigali Sudeer, Posani Krishna murali, Raj Bala
Genres: Romance/ Comedy
Language: Telugu
Release Year: 2022

Gaalodu Trailer: ప్ర‌ముఖ కామెడీ స్టార్‌, జ‌బ‌ర్‌ద‌స్త్ ఫేం సుడిగాలి సుధీర్ న‌టిస్తున్న చిత్రం గాలోడు. ఈ చిత్రం 2021లో డిసెంబ‌ర్ 31న గాలోడు సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద్వారా తెర‌కెక్కుతున్న ఈ సినిమా కామెడీతో పాటు రొమాంటిక్ కూడా ఉంటుంద‌ని చిత్ర బృందం తెలుపుతోంది.

“అదృష్టాన్ని న‌మ్ముకున్న‌వారు క‌ష్టాల పాలౌవుతారు. క‌ష్టాన్ని న‌మ్ముకున్న‌వారు అదృష్ట‌వంతుల‌వుతారు. కానీ నేను న‌న్నే న‌మ్మ‌కుంటాను.” అంటూ సుడిగాలి సుధీర్ చెప్పిన డైలాగ్ మామూలుగా లేదు. ట్రైల‌ర్(Gaalodu Trailer) చూస్తే సుడిగాలి సుధీర్ ఎంట్రీ అదిరిపోయింది. ఈ సినిమాలో సుధీర్ మాస్ హీరోగా క‌నిపించ‌నున్నారు. అంతేకాకుండా కొత్త లుక్‌తో సినిమాలో ఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. సినిమాలో ఫైట్లు పెద్ద హీరోల‌కు మించి తీసిన‌ట్టు ఉన్నాయి.

టివి రంగంలో త‌న కంటూ సొంత టాలెంట్‌తో కింది స్థాయి నుండి ఎదిగిన వారిలో సుడిగాలి సుధీర్ ఒక‌రు. అదే విధంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు హీరోగా క‌నిపించ‌నున్నారు. అలాగే టివి రంగంలో ఉన్న న‌టీన‌టుల‌కు ఎవ్వ‌రికీ లేనంత అభిమానులు సుడిగాలి సుధీర్‌కు ఉన్నారు. ఈ ట్రైల‌ర్ చూసిన అభిమానులు అన్న సూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్ట‌డానికి రెఢీగా ఉన్నాడ‌నే రేంజ్‌లో కామెంట్లు పెడుతూ సుడిగాలి సుధీర్‌కు ఆల్‌ది బెస్ట్ చెబుతున్నారు.

సుధీర్ అన్న‌కు ఈ సినిమా మంచి బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వాల‌ని ఎంత మంది కోరుకుంటున్నార‌ని ఒక అభిమాని కామెంట్‌లో అడ‌గ‌గా ల‌క్ష‌ల్లో లైక్‌లు వ‌చ్చాయి. అలాగే సుధీర్ ను బెంగాల్ టైగ‌ర్ వ‌చ్చాడంటూ ఇక మామూలుగా ఉండ‌దంటూ ట్రైల‌ర్ చూసిన వారు కామెంట్ చేస్తున్నారు. అయితే సుడిగాలి సుధీర్‌కు ఈ సినిమా సూప‌ర్ హిట్ అయితే మాత్రం తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌రో యువ హీరో కోసం ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు క్యూ క‌డ‌తారు. అందానికి అందం, డ్యాన్స్‌, కామెడీ, అభిమానం అన్నీ ఉన్న సుడిగాలి సుధీర్‌కు ఈ నూత‌న 2022 సంవ‌త్స‌రం ఎలా ఉండ‌బోతుంద‌నేది ఈ సినిమా విడుద‌లైన త‌ర్వాత తెలుస్తుంది.

Share link

Leave a Comment