Funny Letter: కొందరి లెటర్లు మనం చదువుతుంటే నవ్వు కూడా వస్తుంటుంది. ఈ కాలంలో Social media పుణ్యమా అని లెటర్లు రాసుకోవడం బంద్ అయ్యింది. కానీ 20 సంవత్స రాలు వెనక్కి వెళితే అందరూ ఉత్తరాల్లో మాత్రమే యోగక్షేమాలు తెలుసుకునేవారు. అయితే భార్య – భర్తల మధ్య ఉత్తరాలు ఎలా ఫన్నీగా ఉంటాయో ఇప్పుడు మీరు చదివితే నవ్వు ఆగదు. ఇక్కడ ఉన్న Funny Letter ను మీరు కూడా చదవండి.
Funny Letter: ప్రియమైన ఏమండీ!
ఒకావిడ భర్తకి లెటర్ రాసింది..! రాయడం తెలిసినా, ఫుల్ స్టాప్, కామాలు ఎక్కడ పెట్టాలో తెలీక, నచ్చిన చోట పెట్టేసి మరీ రాసేసింది.
ప్రియాతి ప్రియమైన ఏమండీ..!
మీరింత వరకు లెటర్ రాయలేదేందుకు నా ఫ్రెండ్ పంకజం కి. ఉద్యోగం దొరికింది
మన ఆవుకి. దూడ పుట్టింది తాత గారికి. ఈ మధ్య మందెక్కువయ్యింది నాకు.
మీరు లెటర్ రాయనందుకు బాగా కోపం వస్తోంది మన కుక్కకి. తిండి బాగా
ఎక్కువ అయింది ఇంట్లో సరుకులు. మీరొచ్చేటప్పుడు తీసుకురండి లలితతో.
ఈ మధ్య నాకు స్నేహం కుదిరింది పక్కింటాయనతో. చెప్తే మన మేకని. అమ్మేశాడు మార్కెట్లో అత్తగారికి. మీరు బాగా జ్ఞాపకం వస్తున్నారట ఎదురింటి అనిత కి. ఈ మధ్య బాగా గర్వం పెరిగింది మామయ్య గారికి. వచ్చేటప్పుడు మంచి కండువా తేడం మర్చిపోవద్దు.
Funny Letter: ముద్దుల జీతం!
ఒక భర్త తన భార్యకు ఉత్తరం రాశాడు. ఈ నెల జీతం బదులుగా
100 ముద్దులు పంపిస్తున్నాను.తీసుకో..!
భార్య నుంచి భర్తకు ఉత్తరం వచ్చింది!.
మీరు పంపిన 100 ముద్దులు అందాయి.
అందులో 2 ముద్దులు పాలవాడికి ఇచ్చాను.
కూరగాయలు తెచ్చేవాడికి 7 ముద్దులు ఇస్తాను అంటే వాడు ఒప్పుకోలేదు.
అందుకే, వాడికి 9 ముద్దులు ఇవ్వాల్సి వచ్చింది.
ఇంటి ఓనరు రోజూ 5 లేదా 6 ముద్దులు పట్టుకెళ్తున్నాడు.
ఐనా, కంగారు పడకండి.
నా వద్ద మీరు పంపిన 35 ముద్దులు మిగిలే ఉన్నాయి.
భర్త నుంచి వెంటనే Telegram వచ్చింది.
రేపే నా జీతం మనీ ఆర్డరు పంపిస్తున్నాను.
ముద్దులు ఇవ్వడం ఆపేయ్ వెంటనే.
రాబడీ రావే మా ఇంటికి!
పాలిష్ కొడితే పడిపోయే పడుచులున్న ఈ లోకంలో నీకు నెయిల్ (Nail) పాలిష్ కొట్టి నా ప్రేమ సంగతి విన్నవించా. నీ చేత నా నుదుటికి తిలకం దిద్దించుకోవాలని నీకు ఐటెక్స్ పల్లవి కుంకుం అందించా. నా డ్రీమ్ ప్లవర్ వికసించేలా నిన్ను నా love పాండ్లో దించాలని నీకు పాండ్స్ పౌడర్ కొనిచ్చా. నా గుండెలో ప్రేమ ఆశలు గలగలలాడాలని నీ చేతికి మట్టిగాజులు మోసుకొచ్చా.
నా గుండెలో నిన్ను బందించి నీ జడకి Dabur Amla తల నూనె బహుకరించా. అయినా నా నెత్తికి ప్రేమ తైలం రుద్దవెందుకు? ఏంటీ..తేలికపాటి కానుకలతో తెగ ట్రై చేస్తున్నానని నన్ను తేలికగా చూస్తున్నావా? తక్కువ రాబడితో ఎక్కువ ఆర్జించి అనతికాలంలోనే వారెన్ బఫెట్ కావాలనే నా ఆశయం నీతోనే శ్రీకారం చుట్టాలని నా ఆశ. నా ఆర్దిని అర్థం చేసుకొని నా అర్థాంగిగా అంగీకరిస్తే నా అదృష్టం డీమ్యాట్ ఖాతా (Demat account) తెరుచుకున్నట్టే.