Fungi Disease: మాన‌వుల్లో శిలింధ్రాలు వ‌ల్ల వ‌చ్చే వ్యాధులు

Fungi Disease | మాన‌వుల్లో శిలింధ్రాల వ‌ల్ల ప‌లు ర‌కాల వ్యాధులు వ‌స్తుంటాయి. వాటి ద్వారా తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంటుంది. ముఖ్య‌మంగా శిలింధ్రాల వ‌ల్ల తామ‌ర వ్యాధి వ‌స్తుంది. మైక్రోస్పోరియం ట్రైకోఫైట‌స్ అనే Fungi ఈ వ్యాధికి కార‌కంగా ప‌నిచేస్తుంది. అప‌రిశుభ్ర ప‌రిస‌రాలు, వ్యాధి సోకిన వాడిన వ‌స్తువ‌ల ద్వారా, పిల్లులు, కుక్క‌ల ద్వారా ఈ వ్యాధి సంక్ర‌మిస్తుంది. ఈ Disease వ‌ల్ల ఎర్ర‌గా, ఉబ్బెత్తుగా ఉండే పుండ్లు చిన్న‌విగా, గుండ్రంగా మొద‌ట శ‌రీరంపై ఏర్ప‌డి క్ర‌మేణా పెద్ద‌విగా మార్పు చెంది మ‌చ్చ‌లుగా ఏర్ప‌డ‌తాయి.

Fungi Disease: మాన‌వుల్లో శిలింధ్రాలు వ‌ల్ల వ‌చ్చే వ్యాధులు

దోబీఇచ్ అనే వ్యాధికి ప‌లు ర‌కాల Fungi కార‌కంగా ప‌నిచేస్తాయి. ఈ వ్యాధి సోకిన వ్య‌క్తి వాడిన వ‌స్తువుల్ని ఉప‌యోగించ‌డం ద్వారా ఈ వ్యాధి సంక్ర‌మిస్తుంది. ఈ వ్యాధి వ‌ల్ల తొడ‌లు, గ‌జ్జ‌ల‌పై దుర‌ద‌, ఎర్ర‌ని పొక్కులు ఏర్ప‌డ‌తాయి. మ‌దురాపాదం అనే వ్యాధి మిరెల్లా మైసిటోమీ అనే శిలీంధ్రం వ‌ల్ల సంక్ర‌మిస్తుంది. శ‌రీరంపై ఏదైనా గాయ‌మైన‌ప్పుడు గాయం ద్వారా ఈ శిలీంధ్రం మాన‌వుడిలోకి ప్ర‌వేశిస్తుంది. ఈ వ్యాధి పాదాల‌కు, మ‌డ‌మ‌ల‌కు సోకి లోతైన పుండ్లు ఏర్ప‌డ‌తాయి. కొన్ని సంద‌ర్భాల్లో అంగవైక‌ల్యానికి దారి తీసే ప‌రిస్థితులు కూడా త‌లెత్తుతాయి.

అథ్లెట్ పాదం అనే వ్యాధి ట్రైకోఫైటాస్ అనే శిలీంధ్రం వ‌ల్ల సంక్ర‌మిస్తుంది. ఈ వ్యాధి ఎక్కువుగా త‌డి ప్ర‌దేశాల్లో సంచ‌రించే వారికి వ‌స్తుంది. త‌డిగా ఉండే చ‌ర్మంపై ఈ శిలీంధ్రం త‌న ప్ర‌భావాన్ని చూపిస్తుంది. వ్యాధి సోకిన ప్రాంతంలో మంట పుట్ట‌డం, కాలి వేళ్ల మ‌ధ్య ప‌గిలి ర‌క్త‌స్రావం కావ‌డం జ‌రుగుతుంది. న్యూరైటిస్ అనే వ్యాధికి మ్యూకార్ ఫ్లూజిల్ల‌స్ అనే శిలీంధ్రం కార‌కంగా ప‌నిచేస్తుంది. బ్లాస్టోమైకోసిస్ వ్యాధికి బ్లాస్టోమైసిస్ డెర్మ‌టైడిస్ అనే శిలీంధ్రం కార‌క‌మ‌వుతుంది. డెర్మ‌టోమైసిన్‌, మొనిలియాసిస్‌, కాండిడియాసిస్ వ్యాధుల‌కు కాండిడా Albicans అనే శిలీంధ్రం కార‌క‌మ‌వుతుంది.

మెనెంజైటిస్ వ్యాధికి మైక్రోస్పోర‌మ్, ట్రైకో ఫైటాస్ అనే శిలాంద్రాలు కార‌ణ‌మ‌వుతాయి. హిస్టోప్లాస్మోసిస్ వ్యాధికి హిస్టోప్లాస్మా కాప్యులేట‌మ్ అనే శిలీంధ్రం కార‌ణం అవుతుంది. Cryptococcosis వ్యాధికి లైఫోమైసిస్ నియోపార్మాన్స్ అనే శిలీంధ్రం కార‌ణ‌మ‌వుతుంది. ఓటోమైసిన్ అనే వ్యాధికి కాండిడా ఆల్బికాన్స్‌, ఆస్ప‌ర్జిల్ల‌స్ శిలీంద్ర జాతులు కార‌ణ‌మ‌వుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *