Fun Bucket టైటిల్‌ను ఎక్క‌డా వాడ‌కండి! జీర్ణించుకోలేక‌పోతున్నాం!

Fun Bucket టైటిల్‌ను ఎక్క‌డా వాడ‌కండి! జీర్ణించుకోలేక‌పోతున్నాం!

Fun Bucket భార్గ‌వ్ గా ఇప్ప‌టి వ‌ర‌కు స‌మాజంలో చ‌లామ‌ణి అయిన టిక్‌టాక్ స్టార్ భార్గ‌వ్ ఇష్యూకు ఫ‌న్ బ‌కెట్‌కు ఎటువంటి సంబంధం లేద‌ని అస‌లైన Fun Bucket ఛాన‌ల్ టీం స‌భ్యులు అన్నారు. మూడు రోజుల క్రితం భార్గ‌వ్ విశాఖ‌ప‌ట్ట‌ణం కు చెందిన ఓ మైన‌ర్ బాలిక‌పై అత్యాచారం చేసిన ఘంట‌న‌లో జైలు పాలైన సంఘ‌ట‌న అంద‌రికీ తెలిసిందే. అయితే Fun Bucket భార్గ‌వ్ గా కొన్ని సంవ‌త్సరాల నుంచి సోష‌ల్‌మీడియా ప్లాట్‌ఫాం మీద త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న భార్గ‌వ్ చేసిన చెడ్డ ప‌ని వ‌ల్ల ఫ‌న్ బ‌కెట్ కు చెడ్డ పేరు వ‌స్తుంద‌ని ఆ టీం స‌భ్యులు ఆవేద‌న‌తో చెప్పారు. భార్గ‌వ్ ఫ‌న్ బ‌కెట్ నుండి వెళ్లిపోయి దాదాపు నాలుగు సంవ‌త్స‌రాలు అవుతుంద‌ని అన్నారు. అత‌ను వ్య‌క్తిగ‌తంగా సోష‌ల్‌మీడియాలో కొన్ని కార్య‌క్ర‌మాలు చేసుకుంటూ ఉంటున్నాడ‌ని, కానీ Fun Bucket భార్గ‌వ్ గా అంద‌రికీ ద‌గ్గ‌ర‌య్యాడ‌ని చెప్పారు. అత‌ను ఇంత చెడ్డ ప‌ని చేస్తాడ‌ని తాము ఊహించ‌లేద‌ని పేర్కొన్నారు. అత‌ను చేసిన ప‌ని వ‌ల్ల కొన్ని సోష‌ల్‌మీడియాల్లో, సామాజిక మాధ్యమాల్లో, పేప‌ర్ల‌లో ఫ‌న్ బ‌కెట్ అనే టైటిల్‌ను పెట్టి వార్త‌లు, క‌థ‌నాలు రాయ‌డం తాము జీర్ణించుకోలేక‌పోతున్నామ‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Fun Bucket team

ఫ‌న్ బ‌కెట్ అనేది ఎంతో మందికి జీవ‌నోపాధి ఇచ్చింద‌ని, తాము ఈ స్థాయిలో ఉన్నామంటే అది ఫ‌న్ బ‌కెట్ టైటిల్ ద్వారానే అని చెప్పారు. భార్గ‌వ్ చేసిన త‌ప్పిదానికి ఫ‌న్ బ‌కెట్‌కు ఎటువంటి సంబంధం లేద‌ని పేర్కొన్నారు. ఫ‌న్ బ‌కెట్ ద్వారా ఎంతో మందికి సేవ చేశామ‌ని, ఈ టైటిల్ ద్వారా చేసిన కార్య‌క్ర‌మాల‌తో ప్ర‌జ‌ల్లో ఒక స్ఫూర్తిదాయ‌కంగా తీసుకెళ్లామ‌ని చెప్పారు. ఫ‌న్ బకెట్ టైటిల్‌ను ద‌య‌చేసి ఇక నుంచి ఎవ్వ‌రూ భార్గ‌వ్ పేరుకు ముందు వాడ‌రాద‌ని సోష‌ల్‌మీడియాకు, ప‌త్రికా యాజ‌మాన్యాల‌కు, ఎల‌క్ట్రానిక్ ఛాన‌ళ్ల వారికి విజ్జ‌ప్తి చేశారు.

చ‌ద‌వండి :  wall Painting Ideas : ప్ర‌స్తుతం డిమాండ్ ఎక్కువుగా ఉన్న వాల్ పెయింటింగ్ గురించి తెలుసుకోండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *