
Full day schools start: ఇక ఫుల్ డే తరగతులు..వేసవి సెలవులు రద్దు!Amaravathi : ఆంధ్రప్రదేశ్లోని ఇక పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి రెండు పూటలా తరగతులు జరగనున్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అదే విధంగా ఇంటర్ ప్రథమ సంవత్సర తరగతులు కూడా సోమవారం నుంచే ప్రారంభం కానున్నాయి. 10వ తరగతి విద్యార్థులకు రోజుకు 8 పిరియడ్లు నిర్వహిస్తారు. ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4.20 గంటల వరకూ తరగతులు నిర్వహిస్తారు. ఆదివారం ఒక పూట ఒక సబ్జెక్టులో మాత్రమే తరగతులు జరుగుతాయి. అన్ని పాఠశాలల్లో సోమవారం నుంచి ఈ ప్రణాళికను అమలు చేయాలని డీఈఓ సుబ్బారావు ఆదేశించారు.
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6వ తరగతి క్లాసులు సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు డీఈఓ సుబ్బరావు తెలిపారు. వీరికి రోజు మార్చి రోజు తరగతులు నిర్వహించననున్నట్టు పేర్కొన్నారు.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్ధులకు సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతున్నాయి. అందుకు సంబంధించిన ఇంటర్ బోర్డు సవరించిన వార్షిక క్యాలెండర్ను ప్రకటించంది. ఆ విధంగా 106 పని దినాలు ఉంటాయి. మే 31 వరకూ తరగతులు జరుగుతాయి. రెండో శనివారం కూడా కళాశాలలు నడుస్తాయి. వేసవి సెలవులను కూడా రద్ధు చేశారు. 2021-22 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్ 3వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
ఇది చదవండి: ప్రముఖ నిర్మాత దొరస్వామి రాజు ఇక లేరు