Fruit Juice: మన శరీరం మీద మనకు కొంచెం శ్రద్ధ, ఆసక్తి ఉంటే ఆకర్షణీయమైన చర్మాన్ని మనం సొంతం చేసు కోవచ్చని చర్మ సౌందర్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా వివిధ రకాల జ్యూస్ (Fruit Juice) లలో ముఖానికి తేజస్సు సమకూర్చుకోవచ్చని వారు సలహా ఇస్తున్నారు.
Fruit Juice: పళ్ల రసాలు తాగుతున్నారా?
యాపిల్ జ్యూస్ తాగితే!
ప్రతిరోజూ ఓ గ్లాసుడు యాపిల్ జ్యూస్ (apple juice) తాగగలిగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. అలాగే క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి మహా మంచిదంటున్నారు. ఇది ముఖానికి తేజస్సును ఇవ్వడమే కాకుండా, కళ్లకు ఎంతో మంచిదని చెబుతున్నారు. అసిడిటిని సైతం తగ్గిస్తుందట. క్యారెట్లో విటమిన్ ఏ, సీ లు మాత్రమే కాకుండా మరెన్నో పోషక్ విలువలు ఉంటాయని వారు చెబుతున్నారు.
బీట్రూట్ జ్యూస్ (beetroot juice) తాగితే..
బీట్రూట్ జ్యూస్ తాగితే చర్మ సౌందర్యాన్ని కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. పైగా ఇది లివర్‌కు కూడా మంచిది. కిడ్నీలను శుద్ధి చేస్తుంది. రక్తంలో ఏమైనా మలినాలు ఉంటే బీట్రూట్ రసం తీసుకుంటే బయటకు పోతాయట. అన్నింటికంటే ముఖ్యంగా ఎర్రరక్త కణాల సమాఖ్య పెంచుతుందంటున్నారు. అలాగే, కడిగిన టామాటాలు నాలుగు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి, చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే ముఖానికి మంచి గ్లో (glowing) వస్తుందని చెబుతున్నారు.
అలోవేరా జ్యూస్ (aloe vera juice) తాగితే..
అలోవేరా జ్యూస్ తాగితే జాయింట్ పెయిన్ మరియు వాపులను తగ్గించటంలో బాగా సహాయ పడుతుంది. అలోవేరా జ్యూస్‌లో యాంటీ ఇన్ప్రమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి నొప్పులు తగ్గించండానికి సహాయ పడుతుంది. ముఖ్యంగా కీళ్ల అరుగుదల, కీళ్ల నొప్పులవంటివి తగ్గించి కీళ్లు బాగా పని చేసేలా చేస్తుంది. అలోవెరా జ్యూస్‌లో కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంది. గుండె కు సంబంధించిన సమస్యలను తగ్గించుకోవచ్చు. అలోవెరా జ్యూస్‌ను జీర్ణక్రియను మెరుగు పర్చడంలో దోహదపడుతుంది. శరీరం, చిన్నప్రేగులు, న్యూట్రిషియన్స్ గ్రహించేలా చేస్తుంది. జ్యూస్ తాగితే మలబద్దకం పోగొడుతుంది. డయోరియా వంటివి తగ్గుముఖం పడతాయి. అలోవెరా జ్యూస్ బరువు తగ్గడంలో కూడా సహాయ పడుతుంది.
తాజా అల్లం రసాన్ని ఏ రూపంలో తీసుకున్నా మంచి ఫలితాలు కనిపిస్తాయి. రోజూ తాగడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. జీవక్రియను చురుగ్గా ఉంచే మెగ్నీషియం, పొటాషియం వంటివి అల్లం నుంచి పుష్కలంగా లభిస్తాయి. అల్లాన్ని మజ్జిగతో కలిపి తీసుకుంటే మంచిది. ముఖంలో నిగారింపునీ, తాజాదనాన్ని కోరుకునే వారు యాపిల్ రసం తాగడం వల్ల ఫలితం ఉంటుంది. ముడతలను తగ్గించేందుకు యాపిల్ రసం చక్కని పరిష్కారం. నల్లద్రాక్ష రసం తాగడం వల్ల యాక్నె ఇబ్బంది నుండి బయట పడవచ్చు. బీటాకెరటిన్ ఎక్కువగా ఉండే క్యారెట్‌ని రసం రూపంలో తీసుకుంటే మృతకణాలు తొలిగి చర్మం కాంతితో మెరిసిపోతుంది.
ఇలా వద్దు ఇదీ పద్ధతి!
నగర ప్రజల్లో ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకునే వారు పెరుగుతున్నారు. దీంతో ఉదయాన్నే ఖాళీ కడుపుతో కషాయాలను తాగుతున్నారని నీరసించి పోతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఒకే రకమైన పండ్లు (Fruit juice), కూరగాయలు, ఆకుకూరలను రసంగా తయారు చేసుకుని సేవిస్తే ఒకే రకారిని చెందిన పోషకాలు, కేలరీలు, విటమిన్లు మాత్రమే శరీరానికి లభిస్తాయని అంటున్నారు. అటువంటి వాళ్లలో అధిక బరువు, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతోన్న యువత అధికంగా ఉందని చెబుతున్నారు. వీరిలో చాలా మందికి ముఖం పాలిపోతోంది. బరువు తగ్గక పోవడంతో పాటు ఇంకా నీరసానికి గురవుతున్నారు.
వేర్వేరు రకాలకు చెందిన పండ్లు, కూరగాయలు, ఆకు కూరలను ఒకే మిశ్రమంగా చేసుకుని యథాతథంగా సేవించాలనేది వైద్యుల సూచన. రుచితో సంబంధం లేకుండా ఆరోగ్యం కోసం తాగాలంటున్నారు. వడపోయాల్సిన అవసరమూ లేదని ఇలాంటి ప్రత్యేకమైన రసాలను తయారు చేస్తోన్నఓ సంస్థ అంటోంది. వేర్వేరు నగరాల్లో ఇప్పటికే ఇలాంటి రసాలను సేవించే సంస్కృతి పెరిగిందని అంటున్నారు.