intermediat exams 2021 మచిలీపట్నం: ఇంటర్మీడియట్ పరీక్షలను పక్కగా నిర్వహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. గురువారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం సమావేశ మందిరంలో పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 15 నుంచి 23 వరకు జరిగే ఇంటర్మీడియట్ అడ్వాన్స్, సప్లమెంటరీ పరీక్షలు(intermediat exams 2021) కోవిడ్ నిబందనలకు అనుగుణంగా పక్కాగా నిర్వహించాలన్నారు.
జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 54,908 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, అందులో 90 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరు కావచ్చునని అన్నారు. అలాగే రెండోవ సంవత్సరం లో 59,951 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అందులో తక్కువ శాతం మంది మాత్రమే హాజరు కావచ్చునని అన్నారు.
కోవిడ్ కారణంగా ప్రభుత్వం విద్యార్థులందర్నీ గతంలో పాస్ చేసిందన్నారు. అయితే ఇంకా మెరుగ్గా మార్కులు రాలేదని విద్యార్థులు నిరుత్సాహపడకుండా అడ్వాన్స్, సప్లమెంటరీ పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. ఉదయం 9 గంటల నుండి 12 గంటలవ జరిగే తొలి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు జరిగే రెండవ సంవత్సరం పరీక్షల్లో విద్యార్థులకు 24 పేజీలు గల ఒక జవాబు పుస్తకాన్ని సరఫరా చేస్తారన్నారు.


అందులోనే విద్యార్థులు తమ పూర్తి జవాబులను రాయాలన్నారు. పరీక్ష నిర్వహిణకు ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ, హైపవర్ కమిటీలు జిల్లాలో ఏర్పాటు చేసిన 142 కేంద్రాలకు చీఫ్ సూపరిండెంట్లను నియమించాలన్నారు.
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?