friendship story 2022

friendship story 2022: ప్రేమ చేయిచ్చింది! స్నేహం చేదోడైంది.(స్టోరీ)

Spread the love

friendship story 2022 ప‌రిచ‌యానికి ఫేస్‌బుక్‌, బాతాఖానీకి వాట్సాఫ్ బ‌య‌ట క‌లుసుకోవడానికి పార్కులు, రెస్టారెంట్లు, నేటి కుర్ర స్నేహాల‌కు కొల‌మానం ఇది. కానీ ఈ హైటెక్ యుగంలోనూ ఉత్త‌రాల‌తో చెలిమి చేసేవారుంటారా? కానీ మా స్నేహం అలాంటిదే – ఓ స్నేహితుడు

గాయ‌త్రి ఈ పేరు వింటేనే నాకు గొప్ప ఆప్యాయ‌త గుర్తొస్తుంది. మా అక్క వాళ్లింటి ద‌గ్గ‌రే త‌నుండేది. ‘ఆ అమ్మాయి చాలా ప‌ద్ధ‌తైన పిల్ల‌రా. పెద్ద‌లంటే గౌర‌వం’ అడ‌క్క ముందే ఆమె గురించి చాలా సార్లు చెప్పేది అక్క‌. ఆ మాట‌ల ప్ర‌భావ‌మేమో గాయ‌త్రిని చూడ‌కుండానే అభిమానం పెంచుకున్నా.

న‌చ్చిన అమ్మాయికి ద‌గ్గ‌ర‌వ్వాల‌నుకోవ‌డం స‌హ‌జ‌మే క‌దా! అక్కా బావ‌ల‌కు తెలియ‌కుండా గాయ‌త్రి కాలేజీకి వెళ్లా. దొంగ‌చాటుగా త‌న‌ని గ‌మ‌నించా. ప‌ర్వాలేదు అంద‌గ‌త్తె. న‌న్ను నేను ప‌రిచ‌యం చేసుకోవ‌డ‌మెలా? ఫేస్‌బుక్‌, వాట్సాఫ్‌, త‌న స్నేహితులు… చాలా దారులే క‌నిపించాయి. కానీ నేను అంద‌రిలాంటి వాడిని కాదు. భాష‌పై నాక్కొంచెం అభిమానం ఎక్కువ‌. పుస్త‌కాలు బాగా చ‌దువుతా. అందుకే త‌న‌తో ఎందుకు స్నేహం చేయాల‌నుకుంటున్నానో వివ‌రిస్తూ ఉత్త‌రం రాశా. ఒక‌టి..రెండు..ఐదు..నా అంత‌రంగ భావాల్ని అక్ష‌రాలుగా పేర్చి లేఖ‌లు(friendship story 2022) పంపా.

అవ‌త‌లి వైపు నుంచి స‌మాధానం లేదు. అయినా నా న‌మ్మ‌కం స‌డ‌ల‌లేదు. నా ఆలోచ‌న‌లు త‌న‌కు క‌చ్చితంగా న‌చ్చుతానిపించింది. కాస్త ఆల‌స్యంగానైనా నా అంచ‌నా నిజ‌మైంది. మీరెవ‌రో నాకు తెలియ‌దు. కానీ మీ అక్ష‌రంలో నిజాయ‌తీ ఉంది. మీ ఆలోచ‌న‌లు నాలాగే ఉన్నాయి. అంటూ జ‌వాబిచ్చింది. ఉత‌ర్త ప్ర‌త్యుత్త‌రాల వేగం పెరిగింది.

చేతి రాత‌ల్ని నోటి మాట‌లుగా మార్చాల‌నిపించింది. క‌లుద్ధాం అంటే ‘ఓస్ …దానికేం భాగ్యం’ అంది. గాయ‌త్రిని క‌లిసి మాట్లాడాక త‌న‌క‌న్నా త‌న ఆలోచ‌న‌లు, భావాలు మ‌రింత అందంగా ఉన్నాయ‌నిపించింది. ఖాళీ స‌మ‌యాల్లో పిల్ల‌ల‌కు ట్యూష‌న్లు చెబుతా. స్వ‌చ్ఛంద సంస్థ త‌ర‌పున ప‌నిచేస్తా.. అంటుంటే ఇలాంటి అమ్మాయి నా ఫ్రెండ్ అని చెప్పుకోవ‌డం గ‌ర్వంగా ఉండేది. మేం త‌రుచూ క‌లిసేవాళ్లం. చాలా విష‌యాలు చ‌ర్చింకునేవాళ్లం. అందులో వ్య‌క్తిగ‌త విష‌యాల‌కన్నా స‌మాజ ప్ర‌స్తావ‌నే ఎక్కువ‌. బాధ‌లు, క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు ఒక‌రికొక‌రం(friendship story 2022) ఓదార్చుకునేవాళ్లం.

మాది కేవ‌లం స్నేహ‌మే. అందులోనే అనిర్వ‌చ‌నీయ‌మైన ఆనందాన్ని వెతుక్కునేవాళ్లం. కానీ మా సాన్నిహిత్యాన్ని ఈ స‌మాజం మ‌రోలా అర్ధం చేసుకుంది. స‌న్నిహితులే మ‌మ్మ‌ల్ని ప్రేమ ప‌క్షులు అన్నారు. స్నేహం పేరుతో రొమాన్స్ చేస్తున్నార‌ని ఎగ‌తాళి చేశారు. మేమేంటో మాకు తెలుసు. ఎవ‌ర్నీ ప‌ట్టించుకోలేదు. రానురాను అపార్థం చేసుకున్న‌వాళ్లే నిజం తెలుసుకున్నారు.

కొన్నాళ్ల‌కు నాకింకో అమ్మాయి ప‌రిచ‌య‌మైంది. ప‌రిచ‌యం త్వ‌ర‌లోనే ప్రేమ బాట ప‌ట్టింది. ‘నీతో జీవితం పంచుకోవాల‌నుంది’ నా మ‌న‌సులో మాట త‌ను చెప్పింది. నా సంతోషానికి ప‌ట్ట‌ప‌గ్గాల్లేవు. ఇక ఆమెతోనే నా జీవితం అనుకున్నా. భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌లు వేసుకున్నా. ‘నాకు ఇంకో అబ్బాయి దొరికాడు. నువ్వు వేరే అమ్మాయిని చూసుకో’ ఓ రోజు బాంబు పేల్చింది. నా గుండె ప‌గిలింది. బాధ‌తో దాదాపు పిచ్చి వాడిన‌య్యా. అప్పుడు గాయ‌త్రే నాకు తోడుగా నిలిచింది. త‌న చ‌ల్ల‌ని మాట‌ల‌తో కుంగుబాటు నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చింది. జీవితాంతం తోడుంటాన‌న్న ప్రేమ అర్ధాంత‌రంగా న‌న్నొదిలి వెళ్లింది. మ‌ధ్య‌లో ప‌రిచ‌య‌మైన స్నేహం మాత్రం క‌డ‌దాకా తోడుంటానంటోంది. అందుకే నా దృష్టిలో ప్రేమ క‌న్నా స్నేహ‌మే గొప్ప‌ది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స్నేహాన్ని వ‌ద‌లొద్దు.

సేక‌ర‌ణ: పాత తెలుగు న్యూస్ పేప‌ర్‌

Sneham: మీ ఇద్ద‌రి స్నేహం నిజ‌మైన స్నేహ‌మేనా? Best Friend అంటే ఎలా ఉండాలి?

Sneham | ప‌దిమంది స్నేహితుల్లో ఒక‌రిని త‌నే నా Best Friend అని చెప్పు కోవ‌డం ఒక్క‌టే కాదు. త‌న‌తో మీ స్నేహం ప‌దిలంగా కొన‌సాగాలంటే తీసుకోవాల్సిన Read more

Love Proposal Survey:ప్రేమిస్తున్నాని చెప్ప‌డానికి 144 రోజులు ప‌ట్టింద‌ట.. ఆ క‌థేమిటో చ‌ద‌వండి!

Love Proposal Surveyకొంద‌రికి తొలిచూపులోనే తొలి ప్రేమ చిగురిస్తుంది. మ‌రికొంద‌రికి చూపులు త‌గిలి, చిలిపి న‌వ్వులు విరిసి, కొంటె సైగ‌లు క‌సిరి.. ఇలా సినిమాల్లో సీన్ల‌లా ప్రేమ Read more

driver love affair: మంత్రి కూతురితో ప్రేమాయాణం ప్రాణ‌హాని ఉంద‌ని డ్రైవ‌ర్ సెల్పీ వీడియో!

driver love affair: చెన్నై: ఇడియ‌ట్ సినిమా అంద‌రికీ గుర్తుంది క‌దా! అందులో ఒక డైలాగ్ ఉంటుంది. క‌మీష‌న‌ర్ కూతుళ్ల‌కు మొగుళ్లు రారా అని హీరో ర‌వితేజ Read more

Samantha divorce rumours: రూమ‌ర్ల‌కు చెక్ పెట్టిన యువ క‌పుల్స్‌!

టాలీవుడ్ బ్యూటిఫుల్ స్టార్ క‌పూల్స్‌ల‌లో అక్కినేని నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట ఒక‌టి. వీరిద్ద‌రి జోడీని అభిమానించేవారి సంఖ్య ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే Read more

Leave a Comment

Your email address will not be published.