Fridge: సాధారణంగా కాయగూరలు, పండ్లను ఫ్రిజ్ లలో నిల్వ ఉంచుతారు. ఇలా భద్ర పరిచి ఎక్కువ రోజులు వాడుకుంటుంటారు. అయితే, కూరగాయల్లో ఐదింటిని మాత్రం ఫ్రిజ్‌లో నిల్వ ఉంచరాదని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని Fridge లో నిల్వ ఉంచడం వల్ల వాటి సహజ గుణం, రుచిని కోల్పోతాయని చెబుతున్నారు. అలాంటి వాటిలో ఉల్లిపాయలు(onions), బంగాళదుంపలు(potatoes), టొమాటోలు(tomatoes), అరటిపండ్లు, ఆలీవ్ నూనెలు ఉన్నాయి.
ఉల్లిపాయలను ఫ్రిజ్(refrigerate)లో భద్రపరచడం వల్ల మృదువుగా మారిపోతాయి. పైగా నిమ్ము తగలడం వల్ల బూజుపట్టే అవకాశం ఉంది. అందువల్ల వీటిని చల్లని, పొడి వాతావరణంలో నిల్వ చేయాలి, అలాగే, కూరగాయల నుంచి వేరు చేయాలి. లేని పక్షంలో ఉల్లిపాయల వాసన కూరగాయలకు చేరుతుంది. దీనివల్ల కూరలు ఉల్లిపాయల వాసన వచ్చే అవకాశం ఉంది.
బంగాళదుంపలను Fridgeలో ఉంచడం వల్ల వాటి ప్లేవర్‌ను కోల్పోతాయి. పైగా ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం వల్ల దుంపల్లోని స్టార్చ్ (Starch) చక్కెరగా మారిపోయే అవకాశం ఉంది. అందువల్ల పేపర్ బ్యాగుల్లో ప్యాక్ చేసి గది టెంపరేచర్‌లోనే నిల్వ ఉంచాలి.
టొమాటోలు ఒక్కసారి ఫ్రిజ్ (Fridge)లో ఉంచిన పూర్తిగా రుచిని కోల్పోతాయి. అందువల్ల వీటిని ఉష్ణోగ్రతలోనే నిల్వ చేయాలి. ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సోకే ప్రమాదం ఉంది.


ఆలీవ్ ఆయిల్‌ను శీతలీకరణ యత్రంలో నిల్వ చేయడం వల్ల దాన్ని స్థిరత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఆలీవ్ నూనె ఒక చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. Fridge లో కాంతి, వేడి, గాలిలేని ప్రదేశంలో నిల్వ చేయడం వల్ల హానికారక క్రిములు తయారై ఆరోగ్యానికి హానికలిగించే అవకాశం ఉంది.