Shaik Bhikari saheb | సామ్రాజ్య విస్తరణకు ఆంగ్లేయుడు జనరల్ డల్హౌసీ రూపొందించిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం పట్ల ఆగ్రహోగ్రుడుడై స్వదేశీ పాలకులకు అండగా, పరాయి పాలకుల మీద రణదుంధుబి మ్రోగించిన యోధుడు షేక్ బికారి సాహెబ్. బీహార్ రాష్ట్రంలో రాంచి జిల్లా బుడ్మూథానా పరిధిలోని హుస్టే గ్రామంలో ఆయన 1919 లో జన్మించారు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య తర్వాత సైనికునిగా ఉద్యోగంలో చేరారు. బడాకాఘడ్-జగన్నాధ్పూర్ పాలకుడు ఠాకూర్ విశ్వనాధ్ సహదేవ్ ఆహ్వానం మేరకు ఆయన సంస్థానంలో చేరి అచిరకాలంలోనే దివాన్ పదవి (freedom fighter Shaik Bhikari saheb)చేపట్టారు.
ఈస్ట్ ఇండియా కంపెనీ ఉన్నతాధికారి లార్డ్ డల్హౌసీ రాజ్య సంక్రమణ సిద్ధాంతం తెచ్చిపెట్టిన ప్రమాదాన్ని గ్రహించి ఆంగ్లేయులతో ఇక పోరాటం తప్పదన్న నిర్ణయానికి వచ్చారు. ఆంగ్లేయుల చర్యల పట్ల అసహనంతో ఉన్న స్వదేశీ పాలకులను సమైఖ్య పర్చేందుకు అమానత్ అలీ అన్సారి, కరామత్ అలీ అన్సారీ, షేక్ హోరే అన్సారి తదితరులను తన ప్రతినిధులుగా వివిధ ప్రాంతాలకు పంపారు.
ఒక వ్యూహం ప్రకారంగా ఆంగ్ల సైన్యంలోని రాం విజయసింగ్, నాదిర్ అలీల సహకారం రాబట్టి 1857 లో హజారీబాగ్ జిల్లా రాంఘడ్లోని ఆంగ్లేయుల సైనిక స్థావరం మీద దాడి చేసి తొలి విజయం సాధించారు. ఆ విజయం తెచ్చిపెట్టిన ఉత్సహాంతో షేక్ బిఖారి సాహెబ్ తన బలగాలతో సంతాల్ పరగణాలోకి ప్రవేశించారు. పరగణాలోని దుంకా వద్ద స్వదేశీ బలగాల రాక కోసం ఎదురు చూస్తు కూర్చున్న ఆంగ్లేయాధికారిని పరాజితుడ్ని చేశారు. ఈ పోరాటంలో అధికారి మృత్యువాత పడ్డారు. బిఖారి సాధిచిన ఈ ఘన విజయాలతో సంతసించిన ఠాగూర్ విశ్వనాథ్ సహదేవ్ విజయోత్సవాలు జరిపారు.
ప్రతీకారం లక్ష్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ బలగాలు దానాపూర్ స్థావరంలో పెద్ద ఎత్తున కేంద్రీకృతమైన విషయం తెలుసుకుని షేక్ బిఖారి, టికౌత్ ఉమ్రాన్ సింగ్ తన బలగాలతో రాంఘడ్ చేరుకున్నారు. అక్కడ ఇరుపక్షాల మధ్య భయానక పోరాటం సాగింది. ఆంగ్లేయుల భారీ బలగాలను ఎదుర్కోడానికి షేక్ బిఖారి సైనికుల వద్దనున్న ఆయుధ సంపత్తి చాల్లేదు.
చివరకు బాణాలు, వడిసెలు, రాళ్లు- రప్పలతో స్వదేశీ బలగాలు ఆంగ్లసైన్యంతో తలపడ్డాయి. ఆంగ్లేయాధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఈ పోరాటాలకు వ్యూహకర్త షేక్ బిఖారి, టికౌత్ ఉమ్రావ్ సింగ్లను నిర్భంధిం చారు. ఆ ఇరువురి మీద ఎటువంటి విచారణ జరపకుండా 1858 జనవరి 8న కమాండర్ మెక్డో నాల్డ్ షేక్ బికారి సాహెబ్ గురించి ప్రస్తావిస్తూ (among the rebels bikhari is the most hazardous and notorious) అని పేర్కొన్నాడంటే షేక్ బిఖారి సాహెబ్ ఆంగ్లేయులకు ఎంతగా హడలెత్తించారో తెలుస్తుంది.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ