Free Beautician Course

Free Beautician Course: ఖ‌మ్మంలో ఉచిత బ్యూటీష‌న్ కోర్సు శిక్ష‌ణ‌కు ఆహ్వానం

Telangana

Free Beautician Course | khammam ప‌ట్ట‌ణంలో వివేకానంద ఇన్ట్సిట్యూట్ ఆఫ్ హ్యూమ‌న్ ఎక్స్లెన్స్ ఆధ్వ‌ర్యంలో ఉచిత బ్యూటీషియ‌న్ కోర్సు (Free Beautician Course)శిక్ష‌ణా త‌ర‌గ‌తులు మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మార్చి 8వ తేదీ నుంచి ప్రారంభ‌మవుతాయ‌ని నిర్వ‌హాకులు గురువారం తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఉచిత బ్యూటీషియ‌న్ కోర్సు శిక్ష‌ణ గోడ ప‌త్రిక‌ను ఆవిష్క‌రించారు.

30 సంవ‌త్స‌రాల లోపు నిరుద్యోగ యువ‌త ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. ఖ‌మ్మం న‌గ‌రంలోని బైపాస్ రోడ్డు, గురు ద‌క్షిణ క్యాంప‌స్ పోలేప‌ల్లి నందు నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు. ఈ కోర్సులో శిక్ష‌ణ పొందాల‌నుకునే వారు 84660 56999 నెంబ‌ర్ ను సంప్ర‌దించాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో సౌభాగ్య‌, మంజుల‌, జ‌యంత్ ప‌టేల్‌, రాముడు, ప్ర‌ముఖ బ్యూటీషియ‌న్ మంజుల త‌దిత‌రులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న నిర్వాహ‌కులు
Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *