Ramulu Naik

Ramulu Naik : ప్ర‌భుత్వ ఉద్యోగులు ఏమాత్ర‌మూ న‌మ్మ‌కండి!

తెలంగాణ‌

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి రాములు నాయ‌క్‌

Khammam: ‘రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్యోగస్తుల‌ను, టిఎన్‌జిఓస్ నాయ‌కుల‌ను పిలిచి ఫిట్మెంట్ ఇస్తాన‌ని అన్నారు. అది కూడా ఎన్నిక‌ల కోడ్ అమ‌లు సమ‌యంలో చెప్పారు. ఇది ప్ర‌భుత్వ ఉద్యోగులు ఏమాత్ర‌మూ న‌మ్మ‌వ‌ద్దు.’ అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్య‌ర్థి రాములు నాయ‌క్ అన్నారు. ఖ‌మ్మం కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో శుక్ర‌వారం రాములు నాయ‌క్ విలేక‌ర్ల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ధ‌నిక రాష్ట్రాన్ని దారిద్య్ర రాష్ట్రంగా మార్చేసిన ఘ‌న‌త ఈ ముఖ్య‌మంత్రికే చెందుతుంద‌ని విమ‌ర్శించారు. రెండు డీఏలు బ‌కాయిలు ఉన్నాయ‌ని, 7.5 శాతం ఫిట్మెంట్ ఇవ్వ‌లేని వాళ్లు 29 శాతం ఇస్తామ‌న‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. అబద్ధాల ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ పేరుగాంచాన్నారు. ‘ప‌ట్ట‌భ‌ద్రులారా ఒక్క‌సారి ఆలోచించండి. ఇలాంటి మోస‌పూరిత మాట‌లు చెప్పే ప్ర‌భుత్వాన్ని న‌మ్మ‌కండి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి శాన‌మండ‌లికి పంపించండి.’ అని రాములు నాయ‌క్ విన్న‌వించుకున్నారు.

విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడుతున్న రాములు నాయ‌క్‌

ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘించిన ముఖ్య‌మంత్రిపై ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ విచార‌ణ చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి ఎన్ని డ‌బ్బులు పంచినా ఎన్ని అస‌త్య ప్ర‌చారాలు చేసినా ఈ సారి గెలిచే పార్టీ కాంగ్రెస్సేన‌ని అన్నారు. నిరుద్యోగ భృతి ఏమైంద‌ని, జీతాలు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో ఉందా ఈ టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అంటూ విమ‌ర్శించారు. ఈ విలేక‌ర్ల స‌మావేశంలో ఖ‌మ్మం న‌గ‌ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కార్పొరేట‌ర్ నాగ‌ళ్ల దీప‌క్ చౌద‌రి, శ్రీ‌నివాస్ రెడ్డి, ర‌హెమాన్‌, పి.రాంమూర్తి త‌దిత‌రులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *