New Political Party : మాజీ మంత్రి ఈటల రాజేందర్ టిఆర్ఎస్ పార్టీ పెట్టిన ఇబ్బందుల తర్వాత తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ వెళ్లారు. అక్కడ తన క్యాడర్‌ను కలుసుకొని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. తన నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తాననేది మీడియా ఎదుట తెలియజేశారు.
New Political Party : మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు సొంత పార్టీలో జరిగిన అన్యాయంపైన యావత్తు తెలంగాణ ప్రజలు, ప్రముఖులు, సామాజిక నాయకులు తీవ్రంగా ఖండించి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా తన సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌లో ఈ రెండురోజులు సొంత క్యాడర్‌తోనూ, సన్నిహితులతోనూ సమావేశాలు జరిపారు. ఈ సమావేశంలో ఈటల కు జరిగిన అన్యాయంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ వెన్నంటి ఉంటామని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గంలోని రెండ్రోజులు జరిగిన కార్యక్రమాల్లో వేలాది మంది ప్రజలు తనకు మద్దతుగా నిలిచారని అన్నారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ ఛైర్మన్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసలు, సింగిల్ విడో ఛైర్మన్లు, పాలక మండలి, గ్రామ కమిటీ అధ్యక్షులు తనతో మాట్లాడారన్నారు.
తెలంగాణ ఉద్యమ చరిత్రలో హుజూరాబాద్ ప్రజలకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఆనాడు హుజూరాబాద్ నుంచి మొదలైన ఉద్యమం జిల్లా వ్యాప్తంగా పాకిందని, హుజూరాబాద్ ఉద్యమ నాయకులు రాష్ట్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించారన్నారు. టిఆర్ఎస్ పార్టీ తనకు బీఫారం ఇచ్చి ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చినందుకు హుజూరాబాద్ ప్రజలు నన్ను గొప్పగా గెలిపించారన్నారు. తనకు ఉద్యమం మొదలు నేటి వరకు తన నియోజకవర్గంతో పాటు యావత్తు తెలంగాణ ప్రజలు అండగా ఉంటూ వస్తున్నారన్నారు. ఈ సమావేశాల్లో తన నియోజకవర్గ ప్రజలు రెండు విషయాలను ప్రస్తావించారన్నారు. అందులో ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువుగా ఉండటం వల్ల ప్రస్తుతం రాజకీయా అంశాలను ఇప్పుడు నిర్ణయం తీసుకోవద్దని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పారన్నారు. మరికొందరు తమపైనే నిర్ణయ భారం వేశారని తాను ఏ నిర్ణయం తీసుకున్నా తన వెంట నడిచి రావడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారన్నారు.


20 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో హుజూరాబాద్ ప్రజలు అనేక మిలిటెంట్ ఉద్యమాలు చేశారన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి ఢిల్లీలో పెద్దలను నిలదీసే స్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లామన్నారు. కానీ అప్పుడు అనుకున్న ఉద్యమ లక్ష్యం, రాష్ట్రం వచ్చిన తర్వాత నెరవేరలేదని పేర్కొన్నారు. అసలు తెలంగాణ ప్రజలు ఏమి కోరుకున్నారు? ఏమి సాధించారు? ప్రస్తుతం ఏమి అందిందో ? అనే ప్రశ్నలను తనకు చేసిన అన్యాయం విషయంలో ప్రశ్నిస్తున్నారన్నారు. ఒక మంత్రిగా ఉండి కూడా ఇంత అవమానానికి గురైతే మరి సామాన్యుడి పరిస్థితి ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారన్నారు. ఇతర దేశాలనుంచి అనగా అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, కెనడా నుంచి తెలంగాణ బిడ్డలు ఫోన్లు చేసి మాట్లాడారన్నారు. ప్రస్తుతం ఆత్మగౌరవం అనేది పెద్ద సమస్యగా మారిందన్నారు. ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత దుర్గార్మం చేస్తారా? అని ఆవేదన చెందారన్నారు.
తనకు జరిగిన అన్యాయంపై కరీంనగర్ కాకుండా మిగిలిన తొమ్మిది జిల్లాల ప్రజలు, ప్రముఖులు తనకు మద్దతు ప్రకటించారన్నారు. ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, మహబూబాబాద్ జిల్లాల నుంచి స్వయంగా కలిసేందుకు వచ్చారన్నారు. ఇప్పటికీ వేల ఫోన్లు చేసి మద్దతు ప్రకటిస్తున్నారన్నారు. తనకు అండగా నిలిచి తన పోరాటానికి మద్దతు తెలుపుతున్న యావత్తు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నారన్నారు. త్వరలో కొత్త పార్టీ పెట్టడంపైనా, మరేదైనా పార్టీలో చేరడంపైన నిర్ణయం మీడియాకు చెబుతానన్నారు. అప్పటి వరకు ఎలాంటి ఇంటర్వ్యూలూ వద్దని పేర్కొన్నారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!