etela rajender: హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో తన అనుచరులు, కార్యకర్తలపై ప్రభుత్వం ఎదురు దాడులు చేస్తూ, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అలాంటి వాటికి భయపడే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. శనివారం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ఫంక్షన్ హాలులో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యతిధిగా ఈటల హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వం చట్టాలను చుట్టాలుగా వాడుకునే నీచ సంస్కృతికి దిగజారిందని, బలహీనులు కాబట్టే చిల్లర రాజకీయాలు చేస్తూ అడ్డదారులు తొక్కుతు న్నారని ప్రభుత్వ తీరును తప్పు పట్టారు. ఆరిపోయే ముందు దీపానికి వెలుతురు ఎక్కువ అన్న చందంగా టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ జనాభా 17 శాతంగా ఉందని, కానీ రాష్ట్ర ప్రభుత్వంలో మాల, మాదిగలకు ఒక్కరికి మాత్రమే అవకాశం కల్పించారని ఆరోపించారు. 0.5 శాతం ఉన్న కులాల వారు ప్రభుత్వంలో ఎక్కువ శాతం ఉన్నారని చెప్పుకొచ్చారు.
తాను అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకున్నానని, ఉద్యమ సమయంలో సైతం శక్తి వంచన లేకుండా పని చేశానని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని పొగొట్టుకోలేరని పేర్కొన్నారు. సహజ న్యాయ సూత్రాలను పాటించే పార్టీ బీజేపీ అని, బీజేపీ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పాటిస్తుందని అందులో భాగంగానే 27 మంది ఓబీసీలకు మంత్రి వర్గంలో నరేంద్ర మోడీ అవకాశం కల్పించారని వివరించారు. అంతకముందు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!