Ratna Prabha IAS | Former IAS Ratna Prabha Contest in Tirupathi | తిరుపతి లోక్‌సభ అభ్యర్థిగా రత్నప్రభా ?Tirupathi : తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికలలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రత్నప్రభా(Ratna Prabha IAS) పేరు ప్రచారంలోకి వస్తుంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఈమె కర్ణాటక ప్రభుత్వంలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. అక్కడ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. ఉద్యోగ విరమణ తర్వాత వృత్తి నైపుణ్య అథారిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈమె కొంత కాలం పాటు డెప్యూటేషన్ పై ఆంధ్రప్రదేశ్ లో పనిచేశారు.


రత్నప్రభా (Ratna Prabha IAS) తండ్రి కత్తి చంద్రయ్య, భర్త విద్యాసాగర్, సోదరుడు ప్రదీప్ చంద్ర(ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారులు). వీరికి ప్రస్తుత రాజకీయ నాయకులతో మంచి అనుబంధం ఉంది. దళిత ఐఎఎస్ అధికారి అయిన రత్న ప్రభా(Ratna Prabha IAS) 1981 బ్యాచ్‌కు చెందిన అధికారిణి. 2017లో కర్ణాటక ప్రభుత్వానికి సీఎం సిద్ధిరామయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించారు.
ఇది చదవండి:నలుగురు తమిళ స్మగర్లు అరెస్టు
ఇది చదవండి: మళ్లీ రాజకీయాల్లో రాబోతున్న మెగాస్టార్!
ఇది చదవండి:స్థానిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న బీజేపీ-జనసేన పార్టీలు
ఇది చదవండి:హత్యకు గురైన స్వామీజీ? వివాదమే కారణమా?
ఇది చదవండి:ఈ ఎన్నికలకు మీరు దూరంగా ఉండాలి: ఎస్ఈసీ