సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
Forest Officer Attacked : నాగర్ కర్నూలు జిల్లాలో అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని 2 గ్రామాల నుండి 3 రోజుల క్రితం అడవిలో రాలిన విప్పపూల సేకరణకు వెళ్లిన గిరిజనులపై 20 మందిపై ఫారెస్టు అధికారులు దాడిచేసి తీవ్రంగా గాయపర్చారని, వారిపైన దాడికి పాల్పడ్డ ఫారెస్టు అధికారులపైన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం పార్టీ మండల కార్యదర్శులు, మండల ఆర్గనైజర్ల సమావేశం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనులు అటవీ ఉత్పత్తుల సేకరణ ద్వారా పొట్ట గడుపుకుంటారని, ఇది భారత రాజ్యంగం వారికి కల్పించిన హక్కు అని తెలిపారు. అటవీ ఉత్పత్తుల సేకరణకు అడవిలోకి వెళ్లిన గిరిజనులపై పాశవికంగా దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు.
గిరిజనులపై దాడులు పెరిగాయి : నున్నా
గత కొంతకాలంగా గిరిజనులపై దాడులు పెరిగాయని, పోడు భూములు, అటవీ భూముల్లో దీర్ఘకాలం నుండి సేద్యం చేసుకుంటున్న గిరిజనులకు అటవీ హక్కుల చట్టం ద్వారా వారికి హక్కులు కల్పించాల్సిందిపోయి, తాత తండ్రుల నుండి అడవులపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులపై దాడులు చేయడం సర్వ సాధారణమైందని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ భూముల సమస్యను తానే స్వయంగా పరిష్కరిస్తానని అసెంబ్లీలో ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మరో ప్రక్క ఫారెస్ట్ అధికారులు గిరిజనులపై దాడులు చేస్తుండటం గిరిజనులను పారద్రోలడానికి పులులను వదిలి పెట్టారని ప్రచారం కూడా జరుగుతుందన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులపై జరిగే దాడులను ఆపాలని ఆయన కోరారు.
ఉమ్మడి జిల్లాలోనూ దాడులు!
ఖమ్మం ఉమ్మడి జిల్లాలో జిల్లా వ్యాప్తంగా నిరంతరం పోడు సాగుచేస్తున్న గిరిజన పేదలపై అటవీశాఖాధికారులు దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులుతో పాటు భూముల్లో పొక్లైన్లు, యంత్రాలతో కందకాలు తీసి భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వామపక్షాల పోరాట ఫలితంగా పార్లమెంట్లో సాధించుకున్న అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాల్సిన ప్రభుత్వాలు రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కులను కాలరాసే విధంగా చర్యలకు పాల్పడటం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని అన్నారు.

తక్షణం అటవీశాఖ, రెవెన్యూ , గిరిజన శాఖ సమన్వయంతో పోడు భూముల సర్వే నిర్వహించే తక్షణమే పట్టాలు, హక్కు పత్రాలు అందించాలని డిమాండ్ చేశారు. కౌలు, పోడు రైతులకు కూడా రైతు బంధు అందించాలని సిపిఎం ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాల నుండి డిమాండ్ చేస్తుంటే, పోడు, కౌలు రైతుల నుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవడంతో ముఖ్యమంత్రి రైతు బంధు అందజేస్తామని ప్రకటించారు. దీనిని వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కళ్యాణం వెంకటేశ్వరరావు, భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు వై. విక్రమ్ శ్రీనివాసరావు, మెరుగు సత్యనారాయణ, కౌండబోయిన నాగేశ్వరరావు రంపూడి పాండురంగారావు, టి. లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
- Online class : చెట్టు కింద చదువులు ఆ ఉపాధ్యాయురాలి ఆలోచనకు జేజేలు!
- Guntur జిల్లాలో అమానుషం! వృద్ధురాలిపై అత్యాచారం!
- Myanmar Capital : ఆ రాజధానిని దెయ్యాల నగరంగా ఎందుకు పిలుస్తారు?
- khammam Municipal Election 2021: ముగిసిన నామినేషన్ల ప్రక్రియ ఇక ప్రచారానికి రెఢీ!
- Covid 19 ను తరమాలంటే! మాస్కే మార్గం! సామాజిక దూరమే శరణ్యం!