Football Japanese fans: సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లు జరిగినప్పుడు అభిమానులు చేసే రచ్చ అంతా ఇంతా కాదు. మ్యాచ్ చూసుకుంటూ ఎక్కడ వస్తువులు అక్కడ చిందర వందరగా పడవేస్తారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కనీసం తిన్న ప్యాకెట్లను, చెత్తను కూడా తీసివేయరు. ఇదే విధంగా ప్రపంచ కప్ ఫిఫా ఫుట్ బాల్ (fifa world cup 2022) మ్యాచ్‌లో చోటు చేసుకుంది.
ఫిఫా పుట్ బాల్ మ్యాచ్‌కు ప్రపంచం నుండి 32 దేశాలు పాల్గొన్నాయి. అదే విధంగా 32 దేశాల నుంచి మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు రచ్చ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. స్టేడియంలో పోస్టర్లు, వారు తిన్న తినుబండరాలు, చెత్త కాగితాలు ఇలా మ్యాచ్ అయిపోయే లోపు అంతా చెత్తతో నిండిపోతుంది. ఖతర్ వేదికగా జరుగుతున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో అచ్చం ఇదే చోటు చేసుకుంది.
Football Japanese fans: చెత్తను ఎత్తి పారేసిన జపానీయులు
నవంబర్ 20,2022న ఖతర్‌లో ఫిఫా ప్రారంభమైనది. చివరి మ్యాచ్ ఖతర్- ఈక్వెడార్ (qatar vs ecuador) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ చివరి రోజున ప్రారంభోత్సవ వేడుకల్లో కొందరు జపాన్‌కు చెందిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్ స్టేడియం అంతా తిరుగుతూ చెత్తనంతా సంచుల్లోకి ఎత్తుతూ మీడియాకు కనిపించారు.
ఈ దృశ్యాలను ఖతర్‌కు చెందిన యూట్యూబర్ షూట్ చేశారు. వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జపాన్ కు చెందిన ఫుట్‌బాల్ ఫ్యాన్స్ పరిసర ప్రాంతాల్లో చెత్తను ఎత్తుతూ పరిశుభ్రం చేయడం కనిపించారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా జపానీయులు శుభ్రానికి ప్రాధాన్యత ఇస్తుంటారు.
జపాన్ దేశంలో చిన్న చాక్లెట్ తిన్నా ఆ ప్యాకెట్‌ను జేబులో వేసుకుని రోడ్డు మీద ఏర్పాటు చేసిన చెత్త డబ్బాల్లో వేసి పరిశుభ్రత నియమాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ఖతార్ స్టేడియంలో చెత్తను ఎత్తుతున్న జపానీయులను యూట్యూబర్ ప్రశ్నించారు. ఇందుకు వారు సమాధానం.. మాకు చెత్త కనిపిస్తే తీసివేస్తాం. మా చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రం చేస్తాం. మేము ఉంటున్న ప్రదేశాన్ని గౌరవిస్తాం. అని తెలిపారు.
అయితే ఖతార్ లో జరిగిన చివరి మ్యాచ్ ఖతర్-ఈక్వెడర్ మ్యాచ్‌లో గేమ్ చూడటానికి వచ్చిన వారు జాతీయ జెండాలను ప్రదర్శించారు. కానీ వాటిని ఆట ముగిసిన తర్వాత అక్కడే పడవేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. జపాన్ ఫ్యాన్స్(Football Japanese fans) ఆ జాతీయ జెండాలను చూసి ప్రతి దేశం వారి జాతీయ జెండాలను గౌరవించాలని, ఎక్కడ పడితే అక్కడ పడవేయరాదని హితువు పలికారు. మొత్తంగా జపానీయులు చేసిన ఇంత మంచి పనికి నెటిజన్లు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు.