food shortages: కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి ఏడుగురు చనిపోతుండగా, ఆకలిని భరించలేక 11 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పేదరిక నిర్మూలనపై కృషి చేస్తున్న అంతర్జాతీయ సంస్థ ఆక్స్ఫామ్(oxfam) జూలై 9న ‘ది హంగర్ వైరస్ మల్టిప్లైస్'(the hunger virus multiplies) (ఆకలి వైరస్ వ్యాప్తి) పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న పేదరికం, ఆకలి (food shortages)చావులపై ఆక్స్ఫామ్ సంస్థ ఈ నివేదిక రూపొందించింది.
నివేదికలో ఏం చెప్పింది?


ప్రపంచ వ్యాప్తంగా 15.5 కోట్ల మంది ఆహార కొరత ఎదుర్కొంటున్నారు. గత ఏడాది (2020) తో పోలిస్తే వీరి సంఖ్య 2 కోట్లు పెరిగింది. ఆహార కొరతని ఎదుర్కొంటున్న వారిలో దాదాపుగా 66% మంది మిలటరీ సంక్షోభం నెలకొన్న దేశాల్లోనే ఉన్నారు. కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులతో 5,20,000 మంది ఆకలితో బాధపడుతున్నారు.
కోవిడ్-19 ప్రభావం, వాతావరణ మార్పులతో గతేడాది కాలంలోనే ఆహార ఉత్పత్తులు ధరల శాతం 80 శాతం వరకు పెరిగిఆయి. గతేడాది కాలంలో ప్రపంచ దేశాల్లో కరువు పరిస్థితులు ఆరు రెట్టు పెరిగిపోయాయి. ఇది కూడా అనేక మంది ఆకలి పరిస్థితులను ఓ కారణమవుతోందని నివేదిక తెలిపింది.
కరోనా(covid -19) సమయంలోనే ప్రపంచ వ్యాప్తంగా రక్షణ రంగంపై చేసే ఖర్చు 5,100 కోట్ల డాలర్లు పెరిగింది. ఆహార కొరత, పేదరిక నిర్మూలన ఆపేందుకు ఐక్యరాజ్య సమితి అంచనా వేసిన మొత్తం కంటే ఇది ఆరు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.


ఆఫ్గానిస్థాన్, ఇథియోఫియా, దక్షిణ సూడాన్, సిరియా, యెమెన్ తదితర దేశాల్లో ఆకలి చావులు ఎక్కువుగా ఉంటున్నాయని నివేదిక తెలిపింది. లాక్డౌన్లు, ఇతరత్రా ఆంక్షల కారణాల వల్ల ఆర్థిక కార్యకలాపాలు స్థంభించి ఆదాయాలు పడిపోవడంతో భారత్లో దాదాపు 70శాతం మంది ప్రజలు రోజువారీ తిండి బాగా పడిపోయినట్టు ఈ నివేదిక పేర్కొంది.
భారత్లో లక్షలాది మంది ప్రజలు తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. 2020లో సుమారు 19 కోట్ల మందికి కావాల్సినంత పౌష్టికాహారం దొరకలేదు. అయిదేళ్లలోపు పిల్లల్లో దాదాపు 1/3 వంతు మంది నిర్ధేశిత ప్రమాణాల కంటే తక్కువ ఎత్తు (స్టంటెడ్)లో ఉన్నారు. పప్పు దినుసుల్లాంటి అత్యవసర వస్తువుల వినియోగం 64% శాతం పడిపోయింది. కూరగాయల వినియోగం కూడా 73% శాతం తగ్గింది. మొత్తంగా 70% మంది రోజువారీ తీసుకునే ఆహారం తగ్గిపోయింది.


ప్రపంచ సంస్థల నివేదికల ఆధారంగా..!
ఐక్యరాజ్య సమితి విభాగాలు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ), అంతర్జాతీయ వ్యవసాయాభివృద్ధి నిధి (ఐఎఫ్ఏడీ), యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం (డబ్ల్యూఎఫ్పి) తదితర సంస్థలు సంయుక్తంగా రూపొందించిన వార్షిక ఆహార భద్రత, పౌష్టికాహారం నివేదికను జూలై 12న విడుదల చేశారు.
కోవిడ్ మహమ్మారి వల్ల భూగోళం మీద ఆకలితో అలమటించే వారి సంఖ్య 18 శాతం పెరిగారని ఈ నివేదిక బయటపెట్టింది. ప్రపంచంలో 2030 నాటికి ఎక్కడా ఆకలి కేకలు ఉండకూడదనే లక్ష్యాన్ని ఇది నీరుగార్చేలా ఉందని తెలియజేసింది.
మహమ్మారి పూర్తిస్థాయి ప్రభావాన్ని ఇప్పటికింకా పూర్తిగా అంచనా కట్టకపోయినప్పటికీ , 2019 తో పోలిస్తే 2020లో 11.8 కోట్ల మంది ఆకలితో అలమటించారని, ఇది 18 శాతం ఎక్కువ అని ఆ నివేదిక బట్టబయలు చేసింది. ఈ పెరుగుదల గత ఐదేళ్లకు కలిపి లెక్కించినా ఎక్కవే అని ఆ నివేదిక తెలియజేసింది.
2020లో దాదాపు ప్రతి ముగ్గురులో ఒకరి (270 కోట్లమంది) కి చాలినంతగా ఆహారం అందుబాటులో లేకపోయిందని, కేవలం ఒక ఏడాదిలోనే ఆకలితో అలమటించే వారి సంఖ్య 32 కోట్లకు పెరిగిందని ఆ నివేదిక పేర్కొంది.


ఆ నివేదిక ప్రకారం ప్రతి పది మందిలో ఒకరు పౌష్టికాహార లోపానికి గురయ్యారు. అల్ప, మధ్య ఆదాయ దేశాల్లో ఎక్కువ మంది ఆర్థికంగా దిగజారిపోవడంతో ఆకలి కేకలు పెరిగాయి. దీనికి తోడు ప్రకృతి విపత్తులు సంభవించిన దేశాల్లో తీవ్రమైన ప్రభావం పడింది.
కోవిడ్ -19 మహమ్మారి ప్రభావం సముద్రంలోకి పైకి కనిపించే మంచుపర్వతం అగ్రభాగంలా ఉందని నివేదిక చెప్పింది. అయితే కోవిడ్ వల్ల తలెత్తిన ఆహార సంక్షోభాన్ని అధిగమించేందుకు ఈ సంవత్సరం అరుదైన అవకాశం కన్పిస్తోందని, ఆహార భద్రత, పోషకాహారంపై జరిగే రెండు శిఖరాగ్ర సదస్సులు, వాతావరణ మార్పుపై ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగే సీఓపి 26వ సమావేశం మార్గం చూపించవచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!