Food Quality Test

Food Quality Test: వ‌స్తువు నాసిర‌క‌మా? నాణ్య‌మైన‌దా? అప్ప‌టిక‌ప్పుడు తెలుసుకోండిలా..!

Spread the love

Food Quality Testప్ర‌స్తుతం మ‌నం వాడే వ‌స్తువులు, తినే ఆహారం ఏమాత్ర‌మూ నాణ్య‌త లేద‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఒక ప్ర‌క్క అధిక ధ‌ర‌లు మ‌రో ప్ర‌క్క నాణ్యం లేని వ‌స్తువులు, ప‌దార్థాలు మ‌నిషి జీవితంపై తీవ్ర ప్ర‌భావం చూపుతున్నాయి. అదే విధంగా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏ వ‌స్తువు కొనాల‌న్నా భ‌య‌మేస్తోంది. అది నాణ్య‌మైన వ‌స్తువా; ల‌ఏక నాసిర‌క‌మా తెలియ‌క అయోమ‌య ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. నిత్యావ‌స‌ర స‌రుకుల నుంచి ఏ వ‌స్తువైనా కొనేముందు కాస్త జాగ్ర‌త్త‌లు పాటించ‌క త‌ప్ప‌దు. ఆ వ‌స్తువుల నాణ్య‌త విష‌యంలో కింది సూత్రాలు పాటిస్తే కొంత అవ‌గాహ‌న క‌లుగుతుంది. ఇంకెందుకు ఆల‌స్యం (Food Quality Test)తెలుసుకోండిలా!

పాలు(Milk): పాల‌ను స‌న్న‌ని సెగ‌పై పూర్తిగా మ‌రగించాలి. అడుగున మిగిలిన సాలిడ్‌ను ప‌రిశీలించండి. అది జిడ్డుగా ఉంటే ఆ పాలు మంచివి. మ‌రో ర‌కంగా కూడా పాల‌ను ప‌రిశీలించ‌వ‌చ్చు. ఏదైనా స‌మాంత‌రంగా ఉన్న ప‌ల‌క‌పై కొన్ని పాల‌ను పోయండి. అవి వెంట‌నే వాలుగా ఉన్న‌వైపు జారిపోతే దానిలో ఏదైనా ర‌సాయ‌నాలు క‌లిపిన‌ట్టుగా భావించాలి. అలాగే పాల‌ను కాస్తున్న‌ప్పుడు పైన నూనెలాగా క‌నిపించినా నాసిర‌కం పాలుగా గుర్తించొచ్చు.

కోడిగుడ్లు(Eggs): కోడి గుడ్డును నీటిలో వేయండి. పూర్తిగా మునిగిపోతే తాజాగా ఉన్న‌ట్టు. పూర్తిగా తేలిపోతే పాడైన‌ట్టు. గుడ్డును ఊపి చూసినా.. తెలిసిపోతుంది. గుడ్డును ఊపిన‌పుడు అందులో నుంచి నీళ్ల చ‌ప్పుడు వినిపిస్తే అది పాడైన‌ట్టు. నాటుకోడి గుడ్డును కూడా జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించాలి. ఈ మ‌ధ్య కొంద‌రు మామూలు గుడ్ల‌ను డికాక్ష‌న్‌లో ముంచుతున్నారు. అది రంగు మార‌గానే నాటు కోడిగుడ్డు గా న‌మ్మిస్తూ విక్రయిస్తున్నారు. వాటిని మంచినీళ్ల‌లో వేసి కొద్దిగా ఉడ‌క‌బెట్ట‌గానే రంగు వ‌స్తే నాటు కోడిగుడ్డు కాద‌ని గుర్తించాలి.

కారం, ప‌సువు: కారం, ప‌సుపు ప్యాకెట్ల‌ను ఊపి చూడండి. అది లోప‌ల వ‌దులుగా క‌దిలితే నాసిర‌క‌మ‌ని భావించాలి. కారాన్ని నీటిలో వేయండి. నీటిలో కారం క‌లిసిపోతే స‌రే లేక‌పోతే నాసిర‌కంగా గుర్తించొచ్చు.

కాఫీ, టీ పౌడ‌ర్లు(Coffee – Tea): నీటిలో వేసిన‌ప్పుడు ఇది తేలితే మంచిది. మునిగిపోతే నాసిర‌కం.

జీల‌క‌ర్ర(Jeelakarra): జీల‌క‌ర్ర‌ను అర‌చేతిలో వేసుకుని న‌ల‌పండి. చేయి న‌ల్ల‌గా మారితే అది నాసిర‌కం.

పంచ‌దార: పంచ‌దాను గుప్పిట్లోకి తీసుకోండి. మీ చేతికి తెల్ల‌ని పౌడ‌ర్ అంటుకుంటే అందులో బియ్య‌పు పిండి క‌లిపిన‌ట్టు.

కొబ్బ‌రి నూనె: కొబ్బ‌రి నూనెను ఫ్రిజ్‌లో పెట్టండి. అది రెండు లేయ‌ర్లుగా విడిపోతే క‌ల్తీ అన్న‌మాట‌.

Raagi Halwa: రాగి హ‌ల్వా ఎలా చేయాలి? కావాల్సిన ప‌దార్థాలేమిటి?

Raagi Halwa రాగి హ‌ల్వా ఇంటిలో చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ క్రింద తెలిపిన విధంగా నేర్చుకొని రాగి హ‌ల్వా ఎలా త‌యారు చేయాలో నేర్చుకోండి. కావాల్సిన ప‌దార్థాలు: Read more

asthma food: ఆస్థ‌మాకు పీచు బంధం! ప్ర‌యోగాత్మ‌కంగా వెల్ల‌డి!

asthma food: పండ్లు, కూర‌గాయ‌ల‌ను త‌రుచుగా తీసుకోవ‌డం ఆరోగ్యానికి మంచిద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. వీటిల్లోనూ పీచు మ‌ల‌బ‌ద్ధ‌కం, పెద్ద పేగు క్యాన్స‌ర్ వంటి స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా Read more

calculating building materials:2022లో ఇల్లు నిర్మాణం మెటీరియ‌ల్ ఖ‌ర్చు ఎంతో తెలుసా?

calculating building materials | ఇల్లు కట్టు చూడు పెళ్లి చేసి చూడు! అన్నారు పెద్ద‌లు. ఈ ప‌రిస్థితుల్లో ఇల్లు నిర్మించ‌డం అంటే సామాన్యుడు..ఇలా జీవిస్తే చాలులే Read more

Old Limca Ad(1986): గుర్తుందా మీ మొద‌టి బ‌హుమానం?

Old Limca Ad(1986) | టివి ఆన్ చేయ‌గానే సీరియ‌ల్ 5 నిమిషాలు అయితే యాడ్స్ మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లిపి 3 నిమిషాలు వ‌స్తున్నాయి. ఈ యాడ్స్‌ను Read more

Leave a Comment

Your email address will not be published.