ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

Food Poisoning: ఇద్ద‌రు పిల్ల‌ల‌కు అన్నంలో విషం పెట్టి…

Food Poisoning

Food Poisoning రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: మాన‌వ‌త్వం మంట‌క‌లిసేలా పేగుబంధం తెంచుకుని పుట్టిన క‌న్న బిడ్డ‌ల‌ను అతిదారుణంగా త‌న చేతుల‌తో విషం ఇచ్చి చంపింది ఓ క‌సాయి త‌ల్లి. ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌లోని రాజ‌మండ్రిలో సీతాన‌గ‌రానికి చెందిన ల‌క్ష్మీ అనూషకు తాడేప‌ల్లిగూడెంకు చెందిన రాముతో 11 సంవ‌త్స‌రాల క్రితం వివాహ‌మైంది. 5 సంవ‌త్స‌రాల క్రితం భ‌ర్త రాము ఉరివేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఆ త‌ర్వాత ఆమెకు తిరిగి పోల‌వ‌రంకు చెందిన రామ‌కృష్ణ‌తో రెండో వివాహం జ‌రిగింది.

కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల భార్య భ‌ర్త‌లు వేరువేరు కాపురాలు ఉంటున్నారు. ల‌క్ష్మీ అనూష పిల్ల‌ల‌తో క‌లిసి రాజ‌మ‌హేంద్ర‌వ‌రం మ‌ల్ల‌య‌పేట‌లో ఉంటోంది. ఈ నేప‌థ్యంలో ఆమె త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌కు అన్నంలో విషం క‌లిపి పెట్టింది. ఆ ఆహారం తిన్న ఇద్ద‌రు పిల్ల‌లు నుర‌గ కక్కిపడిపోవడంతో అమ్మ‌మ్మ వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా అప్పటికే పిల్ల‌లు కుమార్తె చిన్మ‌యి(8) కుమారుడు మోహిత్‌(6) మృతి(Food Poisoning) చెందారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. ల‌క్ష్మీ అనూష‌ను అదుపులోకి తీసుకొని విచారించ‌గా ఆమె పొంత‌న‌లేని స‌మాధానం చెప్ప‌డంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

See also  Suicide: Chaitanya Collegeలో విద్యార్థిని అనుమాన‌స్ప‌ద మృతి

Comment here