Best Beard Tips : గడ్డం, మీసాలు పెరగాలంటే ఇలా చేయండి!
Best Beard Tips : మగవారికి అందం జుట్టు. అందులో ముఖ్యంగా అమ్మాయిలు కూడా మగవారిని ఇష్టపడే కారణాల్లో కోర మీసం, గడ్డం(beard). ఒక్కప్పుడు అంటే 40 ఏళ్ల తరంలో చూసుకుంటే మగవారు పూర్తిగా సేవింగ్ చేసుకొని, మీసాలు సన్నగా కట్ చేసుకొని కనిపించే వారు. అంటే అప్పుడు అది వారికి ఒక ఫ్యాషన్‌గా చెప్పవచ్చు. కానీ ఇప్పుడు పొడవాటి గడ్డం, కోర మీసం, బ్లాక్ కళ్లజోడు, కండలు తిరిగిన బాడీ, స్కిన్ టైట్ షర్డ్, ప్యాంట్లు ఫ్యాషన్‌గా మారిపోయింది. 15 సంవత్సరాల నూనూగు మీసాల మొదలు 65 సంవత్సరాల ముసలివారు వరకూ ఇప్పుడు గడ్డాన్ని పెంచేందుకు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రస్తుతం మన ఇండియన్ సినిమాల్లో హీరో కంటే విలన్లే ఎక్కువ అందంగా కనిపిస్తున్నారు. సినిమాల్లోని విలన్లు ఫుల్‌గా గడ్డం, కోర మీసంతో అచ్చం హీరోకి ధీటుగా కనిపిస్తూ అభిమానుల ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్నారు.
ఇక పోతే అసలు విషయం ఏమిటంటే గడ్డం గురించి.. అసలు గడ్డం, మీసాలు పెరగడానికి మనం ఏం చేస్తున్నాం. ఏం చేస్తే గడ్డాలు, మీసాలు పెరుగుతాయి అనేది తెలుసుకుందాం!
వాస్తవంగా ఒక తరం నుండి మరో తరానికి ఈ గడ్డాలు, మీసాలు వస్తుంటాయి. కొంత మందికి ఫుల్‌గా గడ్డం, మీసాలు ఉంటాయి. మరికొంత మందికి పిల్లిగడ్డం వచ్చి పలచటి మీసాలు వచ్చి ఉంటాయి. దేవుడు ఇచ్చిన ఎవరి అందం వారిది అయినప్పటికీ, ఎక్కువుగా మగవారు, యూత్ గడ్డాన్ని, మీసాలను ఫుల్‌గా పెంచాలనే చూస్తున్నారు ఇప్పుడున్న కాలంలో. ఈ గడ్డాలు మీసాలు పెరగడానికి బెస్ట్ టెక్నిక్ ప్రముఖ ఆయర్వేద డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు చెప్పినవి గమనిద్ధాం!
గడ్డం పెరగాలంటే మగవారిలో టెస్టోస్టిరాన్(testosterone) అనే హార్మోన్ ఉండాలి. అది కొంత మందిలో ఉన్నప్పటికీ గడ్డాలు, మీసాలు పెరగవు. కారణం అది బలమైన హార్మోన్‌గా ఉండకపోవడమే. మరికొంత మందిలో ఒత్తిడి వల్ల, ఆలోచనల వల్ల, లావు పెరగడం వల్ల కూడా గడ్డాలు, మీసాలు రాకపోవచ్చు. లావు పెరగడం వల్ల హార్మోన్ల ఉత్పత్తి మందగిస్తుంది. దీని వల్ల వారికి మీసాలు, గడ్డాలు రాకపోవడానికి టెస్టోస్టిరాన్ లోపం ఏర్పడి ఉంటుంది. సాధారణంగా కొంత మంది ఆడవారిలో కూడా మీసాలు, చెంపలపై వెంట్రుకలు రావడం గమనిస్తూనే ఉంటాం. వారికి ఈస్ట్రోజన్ (estrogen)హార్మోన్ తక్కువ అయి, మగవారికి ఉండాల్సిన టెస్టోస్టిరాన్(testosterone) హార్మోన్ ఆడవారిలో ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల వారికి మీసాలు వచ్చినట్టు కనిపిస్తాయి.
Best Beard Tips :తీసుకోవాల్సిన జాగ్రత్తలు!
కొంత మంది మనకు తెలిసిన మిత్రుల్లో ఎవరైనా షేవింగ్ ఎక్కువుగా చేసుకుంటే గడ్డం, మీసాలు వస్తాయని చెబుతుంటారు. షేవింగ్ చేసుకోవడం వల్ల కొత్త వెంట్రుకలు వస్తాయనేది పూర్తి అపోహ మాత్రమే. షేవింగ్ ఇలా నూనూగు మీసాలు వచ్చినప్పటి నుంచే చేస్తుంటే చర్మం మొద్దుబారుతుంది. ముఖం సహజత్వాన్ని కోల్పోయి అందవికారంగా మారుతుంది. కాబట్టి ఎవ్వరూ షేవింగ్ చేసుకుంటే కొత్త గడ్డం, మీసాలు వస్తాయనేది అవాస్తవం. శాస్త్రీయంగా కూడా ఇది నిరూపణ కాలేదు.
టెస్టోస్టిరాన్ (testosterone)తో పాటు హార్మోన్లు పెరగాలంటే డైట్ కచ్చితంగా పాటించాలి. కాబట్టి గడ్డాలు, మీసాలు రావాలంటే ఉదయాన్నే ఆహారంలో మొలక విత్తిన విత్తనాలు, నట్స్, కిస్మిస్లు కలిపి ప్రతి రోజూ అల్పాహారంగా తీసుకోవాలి. సాయంత్రం వేళ బాదం, పిస్తా, వాల్నట్స్, ఖర్జూరం నానబెట్టుకొని తింటుంటే కచ్చితంగా హార్మోన్లు పెరుగుతాయి. ఏ మందులూ వాడకుండా ఉండేవారికి ఈ డైలీ డైట్ ఆహారం పాటిస్తే గడ్డాలు, మీసాలు కచ్చితంగా పెరుగుతాయి.
మరికొన్ని చిట్కాలు!
ఆరోగ్యకరమైన చర్మ ఉంటేనే గడ్డం పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి చర్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకునేందుకు మాయిశ్చరైజర్లను వాడాలి. దాని వల్ల ముఖం శుభ్రపడటంతో పాటు మృతకణాలు పోయి, చర్మ కణాలు తెరుచుకోబడతాయి. తద్వారా గడ్డం పెరుగుదల వేగవంతం అవుతుంది.
ప్రతి రోజూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.
వ్యాయామం వల్ల రక్త ప్రసరణ పెరగడంతో పాటు టెస్టోస్టిరాన్ లెవల్స్ కూడా పెరుగుతాయి. దీని వల్ల గడ్డం పెరుగుతుది. జుట్టుకూడా బలంగా తయారు అవుతుంది.
సాధ్యమైనంత వరకు మనస్సులో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఈ ఒత్తిడి వల్ల హార్మోన్లు కూడా సరిగ్గా పనిచేయవు. ఎక్కువ ఆలోచన, చిరాకు వల్ల కూడా గడ్డం పెరగడానికి ఆటకం ఏర్పడుతుంది.
ప్రతి ఒక్కరూ రాత్రిపూట కనీసం 8 గంటలు నిద్రపోవాలి. కొంత మంది ఫోన్లు చూసుకుంటూ, చాటింగ్ లు చేసుకుంటూ నిద్రను అశ్రద్ధ చేస్తుంటారు. దీనివల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి కాదు. నిద్ర లేమితో అనేక శరీర ఇబ్బందులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎక్కువ సేపు నిద్ర పోవడానికి సమయం కేటాయించాలి.
మనం తినే ఆహారంలో ఉన్నదానిలో ప్రొటీన్లు వచ్చే ఆహారం ఎక్కువుగా తీసుకోవాలి. చికెన్, మటన్, గుడ్డు వారం వారం తీసుకోవాలి. అంతే కాకుండా ఆకుకూరలు మధ్యాహ్న ఆహారంలో తీసుకోవాలి. కాలానుకనుగుణంగా ఉన్న సీజనల్ పండ్లను తింటుండాలి.
తలస్నానం చేసేటప్పుడు కండిషనర్ వాడాలి. ఆ కండీషనర్ కూడా గడ్డానికి పెట్టాలి. సాధ్యమైనంత వరకు గడ్డానికి సబ్బు రాయడం మానుకోవాలి. సబ్బు వెంట్రులకను మొద్దు బారేలా చేస్తాయి. మీరు ఎప్పుడైనా సబ్బుతో తలస్నానం చేసినప్పుడు ఈ అనుభవం తెలిసే ఉంటుంది. కాబట్టి గడ్డానికి సబ్బు ఎక్కువుగా పెట్టకుండా, గడ్డానికి రాసుకునే ఆయిల్స్ బయట మార్కెట్లో చాలా ఉన్నాయి. వాటిలో నాణ్యమైనది ఒకటి తీసుకొని గడ్డానికి రాస్తూ ఉండాలి.
ఇది చదవండి: Medi Classic Insurance Policy గురించి తెలుసుకోండి !