First night: కాకినాడ: పెళ్లిళ్లు ఏదైనా ఫంక్షన్ హాలుల్లో అంగరంగ వైభవంగా జరిగినప్పటికీ శోభనం మాత్రం సొంత గృహాల్లోనే ఏర్పాటు చేస్తారు. కానీ ఇదెక్కడి విచిత్రమో ఏకంగా జేఎన్టియు కాకినాడ విశ్వవిద్యాలయంలోని అతిథి గృహంలో ఓ జంట శోభనానికి(First night) ఏర్పాట్లు జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలు ఇటువంటి కార్యక్రమాలకు కూడా అతిథిగృహాన్ని అద్దెలకు ఇస్తారా? అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందరూ చదువుకునే నిలయమైన యూనివర్శిటీలోని గదులను శోభనానికి వినియోగించడంపై ఇప్పుడు చర్చ నడుస్తోంది.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జెఎన్టియు విశ్వవిద్యాలయంలోని అతిథి గృహంలో నూతన వధూవరుల శోభనానికి జరిగిన ఏర్పాట్ల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా విశ్వవిద్యాలయంలోని అతిథి గృహాన్ని యూనివర్శిటీకి చెందిన వారికి మాత్రమే కేటాయిస్తారు.
కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ స్వర్ణకుమారి పేరిట ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు అతిథిగృమాన్ని అద్దెకు తీసుకున్నారు. ఈ క్రమంలో వివాహ వేడుక అనంతరం ఒక గదిలో శోభన ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఇలాంటి వాటిని అనుమతించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంపై యూనివర్శిటీ అధికారులు విచారణ చేపట్టారు. ఐదుగురితో కమిటీని ఏర్పాటు చేశారు.
శోభనానికి ఏర్పాటు చేసిన గదిలో అలంకరణలు వీడియో!
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?