fire in Sri Sri Holistic Hospital హైదరాబాద్ నగరంలోని కేపీహెచ్బీ నిజాంపేట రోడ్డులో ఉన్న ప్రముఖ శ్రీశ్రీ హోలీస్టిక్ ఆస్పత్రి లో సోమవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్పత్రి మొదటి అంతస్థులో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో రోగులు, సిబ్బంది ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది సమీపంలో ఉన్న అగ్ని మాపక కేంద్రానికి సమాచారం(fire in Sri Sri Holistic Hospital) అందించారు.
శ్రీశ్రీ హోలీస్టిక్ ఆస్పత్రికి నాలుగు అగ్నిమాపక ఫైరింజన్లు చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆస్పత్రి మొదటి అంతస్థులో 30 మంది రోగులు ఉన్నట్టు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రి సెక్యురిటీ గార్డులు రోగులను, బాధితులను బయటకు భుజాలపై మోసుకొని వచ్చారు. హఠాత్తుగా మంటలు చెలరేగడంతో ఆస్పత్రిలో రోగులు హాహాకారాలు చేస్తూ ప్రాణ భయంతో పరుగులు పెట్టారు.
షార్ట్ సర్యూటే కారణమా?
శ్రీశ్రీ హోలీస్టిక్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్యూట్ కారణంగా అనుమానిస్తున్నారు అధికారులు. మొదటి అంతస్థులో ప్రమాదం జరగడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమవ్వడంతో ప్రాణ నష్టం వాటిల్లకుండా నివారించారు. ఘటనా స్థలానికి శేరిలింగంపల్లి mla ఆరెకపూడి గాంధీ, మాధాపూర్ DCP శిల్పవల్లి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకొని విచారిస్తున్నారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ