Jaggayyapeta Government Hospital

Jaggayyapeta Government Hospital : జ‌గ్గ‌య్య‌పేట ప్ర‌భుత్వ ఆసుప‌త్రి వైద్యులపై కేసు న‌మోదు

Spread the love

Jaggayyapeta Government Hospital : జ‌గ్గ‌య్య‌పేట ప్ర‌భుత్వ ఆసుప‌త్రి వైద్యులపై కేసు న‌మోదు

Jaggayyapeta Government Hospital : జ‌గ్గ‌య్య‌పేట ప్ర‌భుత్వాసుప‌త్రి (పీపీయూనిట్ ) వైద్యుల నిర్ల‌క్ష్యంపై చేసిన ఫిర్యాదును లోకాయుక్త ఆంధ్ర‌ప్ర‌దేశ్ అధికారులు విచార‌ణ‌కు స్వీక‌రించారు. జ‌గ్గ‌య్య‌పేట‌లోని పీపీయూనిట్ వైద్యులు అలాగే కొంద‌రు పారామెడిక‌ల్ సిబ్బంది వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు అస్త‌వ్య‌స్తంగా ఉండ‌టంపై వారిని స‌రిచేయాల్సిన ప్ర‌భుత్వ ప్ర‌తినిధిగా ఉన్న త‌హ‌శీల్దార్ రామిశెట్టి రామ‌కృష్ణ నిర్ల‌క్ష్యంపై జ‌గ్గ‌య్య‌పేట‌కు చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు ఎమ్‌.సైదేశ్వ‌ర‌రావు ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోకాయుక్త వారికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీక‌రించి విచార‌ణ‌కు చేప‌ట్టి కేసు నెం.409/2021/ బి2 పై కేసు న‌మోదు చేశారు. అనంత‌రం కేసు వివ‌రాల‌ను ప‌త్రిక‌ల‌కు విడుద‌ల చేశారు.

ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్యాన్ని అందించేలా ముంద‌స్తుగా వైద్యుల‌కు, ఇత‌ర సిబ్బందికి విలువైన క‌రోనా వ్యాక్సిన్ ను ఉచితంగానే అంద‌జేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ క‌రోనా సోకిన ప్ర‌జ‌ల‌కు జ‌గ్గ‌య్య‌పేట‌లోని పీపీయూనిట్ వైద్యులు, అలాగే సిబ్బంది అంట‌రాని వారిగా ప‌రిగ‌ణించ‌డ‌మే కాకుండా స‌రైన వైద్యాన్ని అందించ‌క‌పోవ‌డం వ‌ల్ల అనేక‌మంది ప్రైవేటు ఆసుప‌త్రుల‌ను ఆశ్ర‌యిస్తున్నారు. దీంతో ల‌క్ష‌లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌భుత్వాసుప‌త్రి నిర్ల‌క్ష్యం వ‌ల్ల మార్చినెల‌లోనే రెండు మ‌ర‌ణాలు క‌రోనా ఖాతాలో చేర‌డం ప్ర‌జ‌ల‌ను మ‌రింత ఆందోళ‌న‌కు గురిచేసింది. క‌రోనా సోకిన వారికి వైద్యాన్ని అందించ‌కుండా నిర్ల‌క్ష్యం చేయ‌డం జ‌రిగింద‌ని విచార‌ణ‌లో తేల్చారు.

lok ayukta

క‌రోనా నియంత్ర‌ణ‌లో వైద్య ఆరోగ్య‌శాఖ‌పై ఎప్ప‌టిక‌ప్పుడు త‌హ‌శీల్దార్ ప‌ర్య‌వేక్షించాల్సి ఉండ‌గా తీవ్ర నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం వ‌ల్ల‌నే రెండు మ‌ర‌ణాలు జ‌రిగాయ‌ని లోకాయుక్త పేర్కొంది. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన వైద్యులు, వారికి స‌హ‌క‌రించిన త‌హ‌శీల్దార్‌పై శాఖాప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరిన‌ట్టు తెలిపారు.

Jaggayyapeta News Today: వైద్య‌బృందాల అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం

జ‌గ్గ‌య్య‌పేట ప్ర‌భుత్వాసుప‌త్రిని సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్ Jaggayyapeta News Today: కృష్ణా జిల్లా జగ్గ‌య్య‌పేట ప‌ట్ట‌ణంలోని కొన్ని రోజులుగా కోవిడ్ -19 కేసులు అధికంగా న‌మోద‌వుతున్న నేప‌థ్యంలో బుధ‌వారం Read more

Jaggayyapeta Covid Cases: జ‌గ్గ‌య్య‌పేట‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్న ఎస్సై చిన్న‌బాబు

Jaggayyapeta Covid Cases: కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట ప‌ట్ట‌ణంలో క‌రోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేప‌థ్యంలో రెవెన్యూ, పోలీసు, ఆరోగ్య సిబ్బంది అప్ర‌మ‌త్త‌మైంది. ఈ నేప‌థ్యంలో జ‌గ్గ‌య్య‌పేట‌లో Read more

SI Ch Chinna babu: మాన‌వ‌త్వం చాటిన ఎస్సై | Jaggaiahpet PS

జ‌గ్గ‌య్య‌పేట ఎస్సై చిన్న‌బాబుకు అభినంద‌న‌ల వెల్లువ‌ SI Ch Chinna babu: Jaggayyapeta : మ‌తిస్థిమితం లేని 15 సంవ‌త్స‌రాల వ‌య‌స్స ఉన్న యువ‌కుడు కృష్ణా జిల్లా Read more

LED Tv Chepest Price: రూ.500 కే టివీ అంట‌..ఆరా దీస్తే!

Jaggayyapeta : కృష్ణా జిల్లాలో విచిత్ర‌మైన దొంగ‌త‌నం బ‌య‌ట‌ప‌డింది. రూ.500 కే టీవీ అమ్ముతుంటే పోలీసుల‌కు అనుమానం వ‌చ్చింది. అదుపులోకి తీసుకుని ఆరా తీస్తే దిమ్మ తిరిగే Read more

Leave a Comment

Your email address will not be published.