finger nail: కాళ్లు, చేతుల గోళ్లు మన ఆరోగ్యం గురించిన ఎన్నో విషయాలను వెల్లడి చేస్తాయి. కాబట్టి గోళ్లు కత్తిరించుకునే ముందు లేదా Nail Polish చేసుకునే ముందు ఒకసారి గమనించుకుంటే చాలా మంచిది.
finger nail | గోర్లు చెబుతాయి ఇలా!
చేతి వేళ్ల గోళ్లపై చివరన నల్లని గీత సన్నగా గీసినట్టు ఉంటే అది మీలో డయాబెటిస్, లివర్ సమస్యలు లేదా Heart ఫెయిల్యూర్ వంటి సమస్యలకు చిహ్నం కావచ్చు. వెంటనే ఒక సారి పరీక్షలు చేయించు కుంటే మంచిది. గోళ్లు తెల్లగా పాలిపోయి ఉంటే అది Liver లో సమస్య లేదా హెపటైటిస్ వంటి ఇన్‌ఫెక్షన్లకు గుర్తు కావచ్చు. చేతి వేళ్ల గోళ్లు ఉబ్బినట్టుగా పైకి తేలి ఉంటే అది ఊపిరితిత్తుల్లో సమస్య వల్ల కావచ్చు.

గోళ్లు లేత పసుపు రంగులో పాలిపోయినట్టుగా ఉంటే శరీరంలో ఏదైనా ఫంగల్ ఇన్‌ఫెక్షన్, Thyroid లేదా ఊపిరితిత్తుల్లో సమస్యకు చిహ్నం కావచ్చు. గోళ్ల(finger nail) చివరలు వంకర తిరిగి స్పూన్ మాదిరిగా మారిపోతే అది లివర్‌లో సమస్య లేదా హైపోథైరాయిడిజం వల్ల కావచ్చు. గోళ్లు పొరలుగా విడిపోతూ బలహీనంగా ఉంటే అది ఎల్లప్పుడు నెయిల్ పాలీష్‌లు వేసి ఉంచడం వల్ల ఇలా గోళ్లు బలహీన పడిపోతాయి.
కొంత కాలంపాటు ఎలాంటి పాలీష్ ఉపయోగించకుండా గోళ్లు(finger nail) శ్వాసించేందుకు వీలుగా వదిలెయ్యడం మంచిది. గోళ్లు మీద అడ్డంగా గుంటలు ఏర్పడితే అది ఎక్జిమా లేదా సోరియాసిస్ వల్ల కావచ్చు. లేదా అర్థరైటిస్ వల్ల కూడా కావచ్చు. గోళ్లు వదులుగా ఉండి సులభంగా ఊడిపోయ్యే విధంగా ఉన్నాయంటే హైపర్‌థైరాయిడిజమ్ వల్ల కావచ్చు.

finger nail: గోళ్లు నీలం రంగులో ఉంటే శరీరంలో ఆక్సిజన్ తగ్గుతుందనడానికి సంకేతం. అందుకే సర్జరీకి ముందు నేయిల్ పాలీష్ తేసీయాల్సిందగిగా డాక్టర్లు సూచిస్తారు. గోళ్ల మీద అడ్డంగా గీతలు ఏర్పడితే అది జింక్ లోపాన్ని సూచిస్తుంది. లేదా Diabetes వల్ల కూడా కావచ్చు. కొంత మందిలో గోళ్లు చూడటానికి ఆరోగ్యంగానే ఉంటాయి. కానీ కొద్దిగా నొప్పిగా ఉంటాయి. ఇలా నొప్పిగా ఉండటం పైన చెప్పుకున్న ఏ సమస్య వల్లైనా వచ్చు. కాబట్టి నొప్పి ఉంటే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించడం మేలు.