Fertilizer shop | వ్యవసాయ సీజన్ ఆరంభం అవుతున్న నేపథ్యంలో రైతులు మోసపోకుండా తీసుకునే చర్యల్లో భాగంగా Suryapeta పట్టణ పోలీసులు విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ ఆంజనేయులు ఆధ్వర్యంలోని పట్టణంలోని పాత వ్యవసాయ మార్కెట్ వద్ద గల పలు SEED SHOPల్లో తనిఖీలు చేపట్టారు. మండల వ్యవసాయ అధికారులు కూడా తనిఖీల్లో పాల్గొన్నారు. విత్తనాల నాణ్యత, లేబుల్, బిల్స్, బ్రాండ్ మార్క్ ఇలా పలు అంశాలను పరిశీలించారు.
అనంతరం సూర్యపేట పట్టణ CI ఆంజనేయులు మాట్లాడుతూ వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్న సందర్భంగా రైతులు విత్తనాల కొనుగోలుకు సిద్ధం అవుతున్నారన్నారు. ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన విత్తానాలను అందించాలని సూచించారు. రైతులు మోసపోవద్దని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు వ్యవసాయ అధికారులతో కలిసి Fertilizer shop తనిఖీలు చేసినట్టు పేర్కొన్నారు.


రైతులు జాగ్రత్తగా ఉండాలని, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు అన్ని తనిఖీ చేసుకోవాలని సూచించారు. అవసరమైతే Agriculture అధికారుల సలహాలు తీసుకోవాలని సీఐ కోరారు. ఈ తనిఖీల్లో పట్టణ SI శ్రీనివాస్, వ్యవసాయ అధికారి జానిమియా, సిబ్బంది పాల్గొన్నారు.