Female Sexual Problems | మొదటి సారి శారీరక కలయిక జరిగిన తర్వాత చాలా మందిలో రక్తస్రావం(bleeding) అవుతుంది. అలాని అందరి లోనూ అలాగే జరగాలని లేదు. నిజానికి ఆ రక్తస్రావం ఎందుకు జరుగుతుందంటే స్త్రీల యోని మార్గంలో హైమన్ అనే పల్చని పొర లాంటి నిర్మాణం ఉంటుంది. తొలిసారి కలయిక జరిగినప్పుడు ఈ పొర విచ్ఛినమై నొప్పి కలుగుతుంది. రక్తస్రావం అవుతుంది. ఈ హైమన్ పొర కొన్నిసార్లు ముందుగానే చిరిగిపోతుంది.
Female Sexual Problems | అది ఎలాగంటే?
ఆడ పిల్లలు సైకిల్ నేర్చుకునేప్పుడూ, వేగంగా పరుగులు పెట్టేటప్పుడు, వాలీబాల్, ఫుట్బాల్ వంటి ఆడలు ఆడేటప్పుడు, తెలియక ఏమైనా వస్తువులు ఆ ప్రాంతంలో గుచ్చుకున్నప్పుడూ, ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసుకునే క్రమంలో వేళ్లు తగిలినా ఈ పొర విచ్చిన్నం అవుతుంది. అసలు కొంత మంది అమ్మాయిలకు పుట్టుకతోనే ఈ పొర ఉండక పోవచ్చు కూడా. దాని వల్ల కూడా రక్తస్రావం జరుగదు. రక్తస్రావం జరగనంత మాత్రాన అదే అనారోగ్య సమస్యకైనా దారి తీస్తుందేమోనని అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు హాయిగా పెళ్లి చేసుకుని దాంపత్య జీవితాన్ని కొనసాగించ వచ్చు.
good couple | ఇద్దరి మనుసులు ఒకటైతే!
చుక్కలాంటి అమ్మాయినీ చక్కనైన అబ్బాయినీ ఊహించుకోండి. వాళ్లిద్దరి అభిరుచులూ ఒకటే అనుకోండి. వారు అన్యోన్య దంపతులు గానే కాదు, మంచి తల్లిదండ్రులుగా కూడా పేరు తెచ్చుకుంటారు. ఇది పాశ్చాత్య పరిశోధకులు చెబుతున్న మాట. విరుద్ధ భావాలున్న వ్యక్తులు ఒకటైతే ప్రణయ కలహాలతో చిలిపి తగాదాలతో వారి కాపురం కాస్తంత చైతన్యవంతంగా ఉండొచ్చేమో గానీ, తరచూ వారిద్దరి మధ్య రేగే కలహాలు పిల్లలపై ప్రభావం చూపుతాయట. అదే భార్యభర్తలిద్దరూ ఒకే మనస్తత్వం ఉన్నవారైతే ఇల్లు ప్రశాంతంగా ఉంటుందట. పిల్లల గురించి ఇద్దరి ఆలోచనలూ ఒకే విధంగా ఉండటం వల్ల వారు కూడా చక్కగా వృద్ధిలోకి వస్తారనీ పరిశోధనలో తేలింది.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ