Father Suicide : అసలే కరోనా కాలం..ఎక్కడా పని దొరకని పరిస్థితి..చేసే పని కర్మాగారం కూడా మూత పడింది. ఇక అడ్డా మీద పనికి వ్చే వారికి పని ఉంటుందో ఉండదో తెలియని ఇబ్బంది.. కుటుంబాన్ని పోషించేకోలేని దయనీయ పరిస్థితి. ఇక రోగాలు వస్తే ఏం చేయాలి? లక్షలు లక్షలు ఖర్చు చేసి ఎలా బ్రతకాలి…సగటు సామాన్యుడి వేదన..రోదన ఇది. ఈ కష్టకాలంలో కనీసం కుమారుడికి చికిత్స చేయించుకోలేని స్థోమత లేక ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన ఇప్పుడు ప్రతి ఒక్కర్నీ కంట తడి పెట్టిస్తోంది.
తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలో జరిగిన విషాద సంఘటన ఇది. లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామానికి చెందిన ప్రభాకర్ తన కుమారుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. కుమారుడికి చికిత్స చేస్తేనే నయం అవుతాడు. కానీ చేతిలో అంత డబ్బు లేక ఆ తండ్రి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చేసేది ఏమీ లేక ఎవరి డబ్బు అడగాలో తెలియక చివరికి గ్రామ శివారులోని చింత చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు(Father Suicide) పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన ఆ గ్రామంలో ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.