father Murders son: పీలేరు: చిత్తూరు జిల్లా పీలేరు మండలం తలుపుల పంచాయతీ అబ్బిరెడ్డిగారిపల్లె కు చెందిన గణేష్ అనే యువకుడిని కన్నతండ్రి రామకృష్ణ హత్యచేసి ఇంటి ఆవరణంలో పూడ్చి పెట్టాడు. మృతుని తల్లి ఎల్లమ్మ పీలురు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హత్య (father Murders son)విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
భర్త వేధింపులు భరించలేక 12 సంవత్సరాల క్రితం ఎల్లమ్మ భర్త రామకృష్ణను వదిలేసి తిరుపతికి వెళ్లింది. తిరుపతిలో ఓ హోటల్లో పనిచేస్తూ జీవిస్తోంది. ఎల్లమ్మ, రామకృష్ణ దంపతులకు ఇద్దరు కుమారులు కలరు. పెద్ద కుమారుడు పీలేరులో తల్లిదండ్రులతో సంబంధం లేకుండా ఉంటున్నాడు.
చిన్నకుమారుడు గణేష్ అమర రాజా కంపెనీలో డ్రైవర్గా ఉద్యోగం చేస్తూ తిరుపతిలోనే తల్లి వద్ద ఉండేవాడు. అప్పుడప్పుడు సొంత వూరికి వచ్చి వెళ్లేవాడు. నెలక్రితం తలపులకు వచ్చిన గణేష్ తిరిగి తిరుపతికి వెళ్లకపోవడంతో అనుమానం వచ్చిన తల్లి గ్రామంలో విచారించింది.
తండ్రే గణేష్ ను హతమార్చి ఇంటి పెరటిలోని పూడ్చి పెట్టినట్టు తెలుసుకున్న తల్లి పీలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్సై తిప్పేస్వామి కేసు నమోదు చేసుకుని తలపుల పంచాయతీ అబ్బిరెడ్డిగారిపల్లెలో సంఘటన స్థలాన్ని పరిశీలించారు.


మృతదేహాన్ని పీలేరు తహశీల్దారు పుల్లా రెడ్డి పరిశీలించారు. గణేష్ మృతికి గల కారణాలపై స్థానికులను ఆరా తీశారు. పోలీసు విచారణలో అసలు విషయాలు వెలుగు చూడునున్నాయి. పెద్ద సంఖ్యలో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అయితే రామకృష్ణ మాత్రం తన కుమారుడ్ని హత్య చేయలేదని, అనారోగ్యంతో మృతి చెందాడనంతో శవాన్ని ఇంటి ఆవరణంలోనే పూడ్చి పెట్టినట్టు చెబుతున్నాడు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?