FASTag News : ఫాస్టాగ్ పై కేంద్రం కొత్త నిబంధనలు..ఇక జరిమానానే!
FASTag News : New Delhi: మీ వాహనానికి ఫాస్టాగ్(FASTag) లేదా? లేకపోతే తర్వగా తీసుకోండి. లేకుంటే టోల్ ప్లాజాల వద్ద రెట్టింపు వసూలు చేసేందుకు కేంద్రప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 16 నుంచి టోల్ ప్లాజాల వద్ద ఇక నాన్ ఫాస్టాగ్ లైన్లను తొలగించనుంది. ఫాస్టాగ్ లేకపోతే జరిమానా విధించనున్నట్టు సమాచారం. కేంద్రం నిబంధనల మేరకు ఇక నుంచి అన్ని లైన్లు ఫాస్టాగ్ లైన్లుగా మార్చనున్నట్టు తెలుస్తోంది.
టోల్ ప్లాజాల వద్ద వాహనాలు అధిక సమయం వేచి చూసే అవసరం లేకుండా ఉండేందుకే తీసుకువచ్చినది ఫాస్టాగ్(FASTag). బార్ కోడ్ తరహాలోని ఓ ఎలక్రానిక్ స్టిక్కర్ నే ఫాస్టాగ్ అంటారు. అయితే ఫాస్టాగ్ వినియోగాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఇప్పటికే పలుమార్లు కేంద్రం ప్రభుత్వం గడువు పెంచుతూ వచ్చింది. ఇకపై ఫాస్టాగ్ లేకపోతే జరిమానా వడ్డనకు రంగం సిద్ధమైంది. ఫాస్టాగ్ లేని వాహనాలను ఫిబ్రవరి 16 నుంచి దేశంలో అన్ని టోల్ ప్లాజాల వద్ద రెట్టింపు ఫీజు వసూలు చేయనున్నారు.

ఇప్పటి వరకు టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ లేని వాహనాలకు ఓ లైన్ కేటాయించారు. అయితే, ఫిబ్రవరి 16 నుంచి ఈ వెసులుబాటు తొలగిస్తున్నామని, దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న అన్ని టోల్ ఫ్లాజాల్లో మొత్తం ఫాస్టాగ్ లైన్లు మాత్రమే ఉంటాయని కేంద్రం రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇది చదవండి: నాగచైతన్య ఖాతాలో మరో కొత్త లవ్‌స్టోరీ సాంగ్!
ఇది చదవండి:బాలయ్యపై అందుకే అమితమైన ప్రేమ!
ఇది చదవండి:ఇల్లందు మైన్స్‌లో ఆచార్య షూటింగ్!
ఇది చదవండి:మంత్రి కొడాలి నాని స్వగ్రామంలో వైసీపీకి షాక్!
ఇది చదవండి:ఇనిమెళ్ల గ్రామంలో కొట్టుకున్న టిడిపి-వైసీపీ వర్గీయులు
ఇది చదవండి:ఎస్సైలనే బెదిరించిన కిలాడీ లేడి..చివరకు!
ఇది చదవండి:కొత్త పార్టీపై షర్మిల బిజీ! ఖమ్మం నేతలపై ఫోకస్!
ఇది చదవండి: ఆ చేప మహా డేంజర్! తగిలితే అంతే సంగతులు!