Farmer family commits suicide

Farmer family commits suicide: ఓ రైతు కుటుంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి ప్ర‌య‌త్నం!

Spread the love

Farmer family commits suicide: భూపాల‌ప‌ల్లి: వ్య‌వ‌సాయం చేసుకునేందుకు రైతు ఎరువు బస్తాలు తీసుకుంటే. ఆ బ‌స్తాల బాకీ కింద ఓ ఫ‌ర్టిలైజ‌ర్ షాపు య‌జ‌మాని మూడు ఎక‌రాల భూమిని ప‌ట్టా చేసుకున్నాడ‌నే మ‌న‌స్థాపంతో ఓ రైతు కుటుంబం ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డింది. ఈ సంఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రం భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌ల్హ‌ర్ మండ‌లం తాడిచ‌ర్ల‌లో ఆదివారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబం తెలిపిన వివ‌రాల ప్ర‌కారం గ్రామానికి చెందిన రైతు రాగం స‌తీష్ ఓ ఫ‌ర్టిలైజ‌ర్ వ్యాపారి వ‌ద్ద ఎరువుల‌ను తీసుకున్నాడు. ఆ ఎరువుల విలువ రూ.83,000/- ఉంటుంది. అయితే స‌ద‌రు వ్యాపారి దీనిపై వ‌డ్డీకి వ‌డ్డీ వేసి అక్ర‌మంగా త‌మ మూడెక‌రాల వ్య‌వ‌సాయ భూమిని ప‌ట్టా చేసుకున్నాడ‌ని వాపోయాడు. ఈ విష‌యం తెలుసుకు న్న రైతు రాగం స‌తీష్‌, తల్లి రాజ‌మ్మ‌, కుటుంబ స‌భ్యులు వ్యాపారి (మ‌ల‌క రాజేశ్వ‌ర‌రావు) ఇంటి ఎదుట పురుగు మందు డ‌బ్బాతో ఆత్మ‌హ‌త్యా య‌త్నానికి పాల్ప‌డ్డారు. అయితే ఎరువుల వ్యాపారి ఇంట్లో లేక‌పోవ‌డంతో ఇంటి ముందే భైఠాయించి వారు ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపుతోంది. ఈ విష‌యం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు హుటాహుటిన సంఘ‌ట‌న స్థ‌లానికి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది.

Maha Annadanam: ఖ‌మ్మం న‌గ‌రంలో Saibaba mandirలో మ‌హా అన్న‌దాన కార్య‌క్ర‌మం

Maha Annadanam | ఖ‌మ్మం న‌గ‌రంలో గురువారం Khanapuram హ‌వేలి విజ‌య‌న‌గ‌ర్ కాల‌నీ లో షిరిడీ Sai Baba మందిరం 15వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ఉద‌యం నుండి Read more

Accreditation apply date: తెలంగాణ‌లో జ‌ర్న‌లిస్టుల అక్రిడేష‌న్ల‌కు గ‌డువు పొడిగింపు

Accreditation apply date | తెలంగాణ రాష్ట్రంలో జ‌ర్న‌లిస్టుల అక్రిడేష‌న్ ద‌ర‌ఖాస్తుల గ‌డువును మ‌రోసారి పొడిగించారు. ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌ణ విష‌యంలో ఆన్‌లైన్ లో త‌లెత్తిన ఇబ్బందుల‌ను దృష్టిలో Read more

Ettari Antayya: వ‌డ్డెర సంఘం కోసం నేను అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తా!

Ettari Antayya | వ‌డ్డెర సంఘం అభివృద్ధి కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మిస్తాన‌ని రాష్ట్ర Shrama Sakthi అవార్డు గ్ర‌హీత‌, వ‌డ్డెర సంఘం రాష్ట్ర అధ్య‌క్షులు ఎత్త‌రి అంత‌య్య Read more

Hyundai Company: తెలంగాణ‌లో భారీ పెట్టుబ‌డి పెట్ట‌నున్న పెద్ద కంపెనీ!

Hyundai Company | తెలంగాణ రాష్ట్రానికి మ‌రో భారీ పెట్టుబ‌డి వ‌చ్చింది. World Economic Forum స‌మావేశాల నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్తో స‌మావేశ‌మైన హ్యుండై గ్రూప్ గురువారం Read more

Leave a Comment

Your email address will not be published.