Famous Failures నా దగ్గర అంత డబ్బు కానీ ఉంటేనా? నాకు తగినంత సమయం లేదు లేకపోతేనా, నా చుట్టు ప్రక్కల పరిస్థితులు ఏం బాగాలేవు.. ఇలా ఏవో కారణాలు మనం తరుచూ చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? వైఫల్య భయం. ఓటమి భారాన్ని మనం ఎక్కడ భరించాల్సి వస్తుందో అన్న భయంతో ఇలాంటి కారణాలను మనం తరుచూ చెబుతుంటాం. కానీ నిపుణులు ఏం చెబుతున్నారంటే, వైఫల్యానికి మరీ అంత భయపడాల్సిన అవసరం లేదట. అపజయం ఎదురవ్వడం సహజం అనుకుని, దాన్ని ఎలా అధిగమించాలా అని ఆలోచిస్తేంటే విజయం దరిచేరుతుందని అంటున్నారు. (Famous Failures)అదెలాగో చూద్దాం!

వైఫల్యాలు వెక్కిరిస్తే!
మనల్ని ఎంతగా వైఫల్యాలు వెక్కిరిస్తే అంత గొప్ప విజయాన్ని చేజిక్కించుకుంటారు. దీనికి ఎప్పుడూ చెప్పుకునే ఉదాహరణే అయినా చక్కగా నప్పే ఉదాహరణ థామస్ అల్వా ఎడిసన్దే. అతనికి ఎన్ని వైఫల్యాలు ఎదురయ్యాయనేది మనకిప్పుడు గుర్తు లేదు. కానీ అతను ఆవిష్కరించిన వెలుగు మాత్రం మన జీవితంలో భాగమైంది. కేవలం విజయాన్ని మాత్రమే కోరుకుంటూ పనులు చేయడం వల్ల తెలియకుండానే మనలో ఓటమి భయం(Famous Failures) పెరిగిపోతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత బాగా చేసినా ప్రతిసారీ విజయం ఖాయం అన్న హామీ ఉండదు. కొన్నిసార్లు వైఫల్యం తప్పదు. దాన్ని కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. వైఫల్యం తర్వాత ఎదురయ్యే విజయం మరింత తీయగా ఉంటుంది.

అసలు ఏమవుతుందో చూద్ధాం!
కేవలం విజయాల కోసమే పనిచేయడం, వైఫల్యం ఎదురవుతుందేమోననే అనుమానం రాగానే భయంతో ఆ ని జోలికే వెళ్లకపోవడం వల్ల జీవితంలో కొత్తదనం ఉండదు. ఒక్కోసారి ఏమవుతుందో చూద్ధాం అనే దిశంగా కూడా ప్రయత్నిం చాలట. దాని వల్ల జీవితం అనూహ్యమైన మలుపులు తిరుగుతుంది. మీరు ఊహించని విజయాలు దరిచేరతాయి. అపజయం అనేది ఎత్తు నుంచి ఈత కొలనులోకి దూకడం లాంటిది. మొదటిసారి భయం వేస్తుంది. కానీ దూకిన తరువాత పరవాలేదు అని తెలుస్తుంది. రెండోసారి సాహహిస్తారు. ఈ సారి విజయానికీ, ధైర్యానికీ చేరువగా వెళతారు. వైఫల్యంలో మాత్రమే ఈ మజా ఉంటుంది.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ