family Murder: సొంత బాబాయ్ కుటుంబంపై ఎంత కిరాత‌కం?

  • మూఢ న‌మ్మ‌కాల పేరుతో ప‌గ‌
  • రాళ్ల‌తో కొట్టి హ‌త్య‌
  • మృతుల్లో ఆర్నెళ్ల గ‌ర్భిణీ

family Murder: మూఢ న‌మ్మ‌కాలు మ‌నుషుల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడుతున్నాయి. మ‌రో సంద‌ర్భంలో కుటుంబాల‌కు కుటుంబాలేనే హంతం చేసే స్థితి వ‌చ్చింది. మూఢ న‌మ్మ‌కంతో ఒకు కుటుంబానికి చెందిన ముగ్గురును అతి దారుణంగా రాళ్ల కొట్టి(family Murder) చంపారు. అందులో గ‌ర్భిణీ స్త్రీ కూడా ఉండ‌టం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. ఏపీలోని ప్ర‌కాశం(Prakasam) జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘ‌ట‌న పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ప్ర‌కాశం జిల్లాలో దారుణం వెలుగు చూసింది. మూఢ న‌మ్మ‌కాలు మూడు నిండు ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. క్షుద్ర పూజ‌లు(Superstitions) చేస్తున్నార‌నే అనుమానంతో సొంత ఆత్మీయులే దారుణంగా కొట్టి చంప‌డం క‌ల‌క‌లం రేపింది. గిద్ద‌లూరు మండ‌లం కొత్త‌ప‌ల్లికి చెందిన కుక్క మ‌ల్లికార్జున అనే యువ‌కుడు సొంత బాబాయ్ అయిన తిరుమ‌ల‌య్య క్షుద్ర పూజ‌లు చేస్తున్నార‌ని అనుమానించాడు. దీంతో వారిపై ప‌గ పెంచుకున్న మ‌ల్లికార్జున ఈ నెల 12న తిరుమ‌ల‌య్య కుటుంబంలో రాళ్ల‌తో దాడి(family Murder) చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో పిన్ని ఈశ్వ‌ర‌మ్మ తీవ్రంగా గాయ‌ప‌డి అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయింది. బాబాయ్ తిరుమ‌ల‌య్య‌, చెల్లెలు స్వ‌ప్న తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

చికిత్స పొందుతూ మృతి

తీవ్రంగా గాయ‌ప‌డ్డ తిరుమ‌ల‌య్య‌, చెల్లెలు స్వ‌ప్న‌ను నంద్యాల‌లోని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. కానీ తిరుమ‌ల‌య్య ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో మెరుగైన వైద్యం కోసం క‌ర్నూలు త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరి కుమార్తె స్వ‌ప్న ప‌రిస్థితి కూడా విష‌మంగా ఉండ‌టంలో మెరుగైన వైద్యం కోసం Gunturకు త‌ర‌లించారు. అక్క‌డ 9 రోజుల పాటు వైద్యులు చికిత్స అందించారు. ఆమె కూడా బుధ‌వారం క‌న్ను మూశారు.

స్వ‌ప్న ఆరు నెల‌ల గ‌ర్భిణీ!

స్వ‌ప్న ఆరు నెల‌ల గ‌ర్భ‌వ‌తి అని కుటుంబ స‌భ్యులు చెబుతున్నారు. ఈ దాడిలో స్వ‌ప్న గ‌ర్భంలోని పిండం చ‌నిపోయింద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘ‌ట‌న త‌ర్వాత నిందితుడు కుక్క మ‌ల్లికార్జున ప‌రార‌య్యాడు. అప్ప‌టి నుండి పోలీసులు ప‌లు బృందాలుగా విడిపోయి గాలిస్తూనే ఉన్నారు. ఓ స్వామీజీ చెప్పిన మాట‌లు న‌మ్మి క్షుద్ర పూజ‌ల అనుమానంతో సొంత బాబాయి కుటుంబంపై దాడి చేసి చంపిన‌ట్టు పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. త‌న ఎదుగుద‌ల‌కు అడ్డుగా వ‌స్తున్నార‌నే దారుణంగా హ‌త్య చేసిన‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో తెలుస్తోంది.

Leave a Comment