Family Health Optima Plan

Family Health Optima Plan: ఫ్యామిలీ హెల్త్ ఆఫ్టిమా ఇన్సూరెన్స్ ప్లాన్ పూర్తి వివ‌రాలు తెలుసుకోండి!

Spread the love

Family Health Optima Plan: కోవిడ్ ఎఫెక్ట్ వ‌ల్ల ప్ర‌పంచ జ‌నాభా ఎక్కువ శాతం Health Insurance పాల‌సీల‌పైనే ఎక్కువ దృష్టి పెట్టారు. కరోనా సృష్టించిన విల‌య తాండ‌వం వ‌ల్ల ఎంతో మంది చ‌నిపోగా, మ‌రికొంత మంది కోలుకున్నారు. ఇప్పుడు ఇండియాలో కోవిడ్ ప్ర‌భాతం చాలా వ‌ర‌కు త‌గ్గింది. ఇప్పుడు ఏ చిన్న ఆరోగ్య స‌మ‌స్య వ‌చ్చినా ప్ర‌జ‌లు వెంట‌నే వైద్య ప‌రీక్ష‌లు చేయించుకుంటున్నారు. ఇందులో భాగంగా హెల్త్ ఇన్సూరెన్స్‌ల పాల‌సీలు తీసుకొని ఆసుప‌త్రి ఖ‌ర్చుల నుండి కాస్త ఉప‌శ‌మ‌నం పొందుతున్నార‌ని చెప్ప‌వ‌చ్చు. ఇప్పుడు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి Family Health Optima Plan (ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా ఇన్సూరెన్స్ ప్లాన్) గురించి వివ‌రంగా తెలుసుకుందాం!

ఫ్యామిలీ హెల్త్ ఆఫ్టిమా ఇన్సూరెన్స్ ప్లాన్ పూర్తి వివ‌రాలు

ఈ Family Health హెల్త్ ఆప్టిమా ఇన్సూరెన్స్ ప్లాన్ ద్వారా రెగ్యుల‌ర్ హాస్ప‌ట‌లైజేష‌న్ ప్ర‌యోజ‌నాల‌ను ప్రాతిప‌దిక‌న క‌వర్ చేస్తుంది. Floater స‌మ్ ఇన్సూర్డ్ అన‌గా ఈ పాల‌సీలో ఆరుగురు పెద్ద‌లు, వారిపై ఆధార‌ప‌డిన ముగ్గురు పిల్ల‌లు మొత్తం ఫ్యామిలీకి ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ ఫ్యామిలీ హెల్త్ Optima Plan తీసుకోవాల‌నుకునే వారికి క‌నీసం 18 సంవ‌త్స‌రాలు నిండి 65 సంవ‌త్స‌రాలు మించి ఉండ‌కూడ‌దు. Policy తీసుకున్న వారి త‌ర‌పున వారిపై ఆధార‌ప‌డ్డ త‌ల్లిదండ్రులు / అత్తా మామ‌ల‌ను కూడా చేర్చ‌వ‌చ్చు. ఇంకా 16 రోజుల నుంచి 25 సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఉన్న పిల్ల‌ల‌ను కూడా చేర్చ‌వ‌చ్చు ఈ పాల‌సీలో.

ఈ Family Health Optima Plan మీరు గ‌నుక తీసుకుంటే జీవిత కాలం రెన్యువ‌ల్ కంటిన్యూ చేసుకోవ‌చ్చు. ఆ వెసులుబాటు Star హెల్త్ ఇన్సూరెన్స్ క‌ల్పించింది. పాల‌సీ ప్రారంభ‌మ‌య్యే స‌మ‌యానికి బీమా తీసుకున్న వారి వ‌య‌సు 61 సంవ‌త్స‌రాలు మ‌రియు అంత‌కంటే ఎక్కువ ఉన్న‌ట్ట‌యితే 20% స‌హా చెల్లింపు వ‌ర్తిస్తుంది. ఈ పాల‌సీ ట‌ర్మ్‌ 1 సంవ‌త్స‌రం ఉంటుంది. 50 సంవ‌త్స‌రాల కంటే ఎక్కువ వ‌య‌స్సుండి, sum assured రూ.3 ల‌క్ష‌లు ఉన్న‌ట్లైతే ఉన్న‌వాళ్లంద‌రూ కంపెనీ నియ‌మించ‌బ‌డిన కేంద్రాల‌లో ఫ్రీ-యాక్సెస్ట్స్ medical screening టెస్టులు చేయించుకోవాలి.

ఈ పాల‌సీని రూ.3 ల‌క్ష‌లు, రూ.4 ల‌క్ష‌లు, రూ.5 ల‌క్ష‌లు, రూ.10 ల‌క్ష‌లు, రూ.15ల‌క్ష‌లు రూ.20 ల‌క్ష‌లు రూ.25 లక్ష‌ల్లో మీకు వెసులుబాటును బ‌ట్టి ఎంచుకోవ‌చ్చు. ధ‌ర నిర్ణ‌యం జోన్ ఆధారితన బ‌ట్టి ఉంటుంది. జోన్ 1- గురుగ్రామ్‌, ఘ‌జియాబాద్‌, నోయిడా మ‌రియు ఫ‌రీదాబాద్‌తో స‌హా ఢిల్లీ, థానే స‌హా ముంబై, అహ్మ‌దా బాద్‌, సూర‌త్ మ‌రియు బ‌రోడా. జోన్ 1 ఎ- నాసిక్ స‌హా పూణే, త్రివేండ్ర‌మ్‌, ఎర్నాకుళం, చెన్నై, బెంగ‌ళూరు, మిగిలిన గుజ‌రాత్ అంతా. జోన్ 2- కోయంబ‌త్తూర్‌, ఇండోర్‌, హైద‌రాబాద్‌, సికింద్రాబాద్‌, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, మిగిలిన కేర‌ళా అంతా. జోన్ 3- జోన్ 1, జోన్ 1ఎ మ‌రియు జోన్ 2ల్లో క‌వ‌ర్ అవ్వ‌ని ఇండియా అంతా.

హాస్ప‌ట‌లైజేష‌న్ ఖ‌ర్చుల వివ‌రాలు వ‌ర్తింపు!

ఈ Family Health Optima Plan తీసుకున్న త‌ర్వాత రూ.3 ల‌క్ష‌లు & రూ.4 ల‌క్ష‌లు కు రూ.5000/-, రూ. 5 ల‌క్ష‌లు మ‌రియు అంత‌కంటే ఎక్కువ స‌మ్ ఇన్సూర్డ్ కి సింగ‌ల్ స్టాండ‌ర్డ్ AC గ‌దితో హాస్పిట‌లైజేష‌న్ రూమ్ అద్దె రోజుకు ఉంటుంది. పాల‌సీ సంవ‌త్స‌రానికి స‌మ్ ఇన్సూర్డ్‌లో 1% (అత్య‌ధిక ప‌రిమితి రూ.5 వేలు) రూ.3 ల‌క్ష‌లు & అంత‌కంటే ఎక్కువ స‌మ్ ఇన్సూర్డ్‌కి వ‌ర్తిస్తుంది. షేర్డ్ అకామిడేష‌న్ (రోజుకు) రూ. 3 ల‌క్ష‌ల నుంచి రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు పాల‌సీ తీసుకున్న వారికి రూ.800, రూ.20 ల‌క్ష‌లు & రూ.25 ల‌క్ష‌లు వారికి రూ.1000 ఉంటుంది.ఏదైనా రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డితే emergency road ambulance కింద ఒక్క‌సారి హాస్పిట‌లైజేన్‌కు రూ.750, ఒక్క పాల‌సీ కాలానికి రూ.1500 వ‌ర్తిస్తుంది. ఎయిర్ అంబులెన్స్‌కు అయితే స‌మ్ ఇన్సూర్డ్‌లో 10%, రూ.5 ల‌క్ష‌లు మ‌రియు పైన ఇన్సూర్ చేసిన మొత్తానికి ల‌భిస్తుంది.

సంబంధిత ప్రీ & పోస్ట్ హాస్పిట‌లైజేష‌న్ 60 రోజుల నుండి 90 రోజులు ఉంటుంది. అవ‌య‌వ దాత ఖ‌ర్చులు విష‌యానికి వ‌స్తే ఇన్సూరెన్స్ తీసుకున్న వ్య‌క్తే గ్ర‌హీత అయితే స‌మ్ ఇన్సూర్డ్‌లో 10% లేదా రూ.1 ల‌క్ష‌, ఏది త‌క్కువ అయితే అది చెల్లింప‌బ‌డుతుంది. పాల‌సీలో వాస్త‌వ ఖ‌ర్చుల‌తో కూడిన అన్ని day care విధానాలు క‌వ‌ర్ అవుతాయి. ayush చికిత్స‌లో స‌మ్ ఇన్సూర్డ్ రూ.4 ల‌క్ష‌లు వ‌ర‌కు రూ.10 వేలు, సమ ఇన్సూర్డ్ రూ.5 ల‌క్ష ల నుంచి రూ.15 ల‌క్ష‌లు ఉంటే రూ.15 వేలు, రూ.20 ల‌క్ష‌లు మ‌రియు రూ.25 ల‌క్ష‌లు వారికి రూ.20 వేలు వ‌ర‌కు చికిత్స చేసుకోవ‌చ్చు.

ఈ పాల‌సీలో న‌వ‌జాత శిశువుకు కూడా క‌వ‌ర్ అవుతుంది. స‌మ్ ఇన్సూర్డ్‌లో 10% (అత్య‌ధికంగా రూ.50వేలు) త‌ల్లి క‌నీసం 1 సంవ‌త్స‌రం పాటు పాల‌సీ ప‌రిధిలోకి వ‌స్తేనే మ‌రియు పుట్టిన త‌ర్వాత 16వ రోజు నుండి పాల‌సీ గ‌డువు ముగిసే వ‌ర‌కు క‌వ‌ర్ అవుతంది. ఇన్సూరెన్స్ చేయ‌బ‌డిన వ్య‌క్తి త‌దుప‌రి చికిత్స కోసం ప్ర‌స్తుతం చికిత్స పొందుతున్న ఆసుప‌త్రి నుండి మ‌రొక ఆసుప‌త్రికి Insurance చేసిన వ్య‌క్తిని ర‌వాణా చేయ‌డానికి అయ్యే ఖ‌ర్చులు స‌మ్ ఇన్సూర్డ్ రూ.4 ల‌క్ష‌లు వ‌ర‌కు ఉంటే రూ.5 వేలు, రూ. 5 ల‌క్ష‌లు నుండి రూ.15 ల‌క్ష‌లు ఉన్న‌వారికి రూ.7500 వేలు, రూ.20 ల‌క్ష‌లు నుండి రూ.25 ల‌క్ష‌లు ఉన్న‌వారికి రూ.10 వేలు ఎమ‌ర్జీన్సీ డొమెస్టిక్ మెడిక‌ల్ ఎవాక్యుయేష‌న్ వ‌ర్తిస్తుంది.

ఇక రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్ అయితే స‌బ్ ఇన్సూర్డ్‌లో 25%, అత్య‌ధికంగా రూ.5 ల‌క్ష‌లు (క‌వ‌రేజ్ ప‌రిమితి ముగిసిన త‌ర్వాత అద‌న‌పు స‌మ్ ఇన్సూర్డ్ అంద‌బాటులో ఉంటుంది). కంపెనీ చెల్లిస్తుంది. ఒక వేళ పాల‌సీ తీసుకున్న వ్య‌క్తి చ‌నిపోతే మృత‌దేహాన్ని స్వ‌స్థ‌లానికి పంప‌డానికి రూ.5 వేలు వ‌ర‌కు తిరిగి చెల్లించ‌బ డుతుంది. ఈ పాల‌సీ క్వార్ట‌ర్లీ, హాఫ్ ఇయ‌ర్లీ, ఇయ‌ర్లీ ప‌ద్ధ‌తిన చెల్లించుకోవ‌చ్చు. పాల‌సీ తీసుకునే వారికి నిర్థిష్ట వ్యాధుల‌కు 2 సంవ‌త్స‌రాలు, ముందుగా ఉన్న వ్యాధుల‌కు 4 సంవ‌త్స‌రాలు ఆగాల్సి ఉంటుంది. పాల‌సీ పీరియ‌డ్ లో ప్ర‌తిసారీ 100% చొప్పున 3 సార్లు ఆటోమెటిక్ రిస్టోరేష‌న్ అందుబాటులో ఉంటుంది. క‌వ‌రేజ్ ప‌రిమితి అయిపోయిన వెంట‌నే అందుబాటులో ఉంటుంది.

Star Women Care Health Policy: స్టార్ విమెన్ కేర్ ఇన్సూరెన్స్ పాలసీ వివ‌రాలు

Star Women Care Health Policy | భార‌త ఆరోగ్య బీమా రంగంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు రాని వినూత్న ప‌థ‌కాన్ని స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వారు ఆవిష్క‌రించార‌ని Read more

young star insurance policy: స్టార్ హెల్త్ అందించే యంగ్ స్టార్ ఇన్సూరెన్స్ పాల‌సీ గురించి తెలుసుకోండి!

young star insurance policy హెల్త్ ఇన్సూరెన్స్‌ల‌లో దేశంలో అగ్ర‌గామిగా ఉన్న స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మునుపెన్న‌డూ లేని అద్వితీయ ఉత్పాద‌న‌తో young star insurance Read more

alternatives to personal loans: ప‌ర్స‌న‌ల్ లోన్స్‌తో ప‌రేష‌న్ ఎందుకు? ప్ర‌త్యామ్నాయాలు ఇవిగో..!

alternatives to personal loansఅత్య‌వ‌స‌రంగా డ‌బ్బు అవ‌స‌రం ఏర్ప‌డిన ప‌రిస్థితుల్లో ఎవ‌రికైనా వెంట‌నే గుర్తొచ్చేది వ్య‌క్తిగ‌త రుణాలే. అయితే వీటిపై వ‌డ్డీ రేటు 15 నుంచి 20 Read more

Best car Insurance: Which Insurance is best for Cars?

Which Insurance is best for Cars: Car Insurance helps you get mitigate financial obligations that may arise due to an Read more

Leave a Comment

Your email address will not be published.