family health optima insurance plan: తెలుగులో తెలుసుకోండి! | star health insurance
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్(star health insurance) వారు అందిస్తున్న family health optima insurance plan ఈ ఒక్క పాలసీతో మీ కుటుంబానికి ఆరోగ్య బీమా పొందవచ్చు.స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పరిధిలో దేశవ్యాప్తంగా 9900+ నెటవర్క్ హాస్పిటల్స్ లో అత్యాధునిక వైద్యం చేపించకునేందుకు star health insurance ఎందో దోహదపడుతుంది.
వయోపరిమితి
family health optima insurance plan తీసుకునే వారు సుమారు 18 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి. 16 రోజుల పసిపిల్లలకు కూడా తీసుకోవచ్చు. కాకపోతే వారికి కొంత మొత్తాన్ని చెల్లించాలి.
Sum insured
రూ.1,00,000/-
రూ.2,00,000/-
రూ.3,00,000/-
రూ.4.00,000/-
రూ.5.00,000/-
రూ.10.00,000/-
రూ.15.00,000/-
రూ.20.00,000/-
రూ.25.00,000/-

పాలసీ ప్రయోజనాలు
పాలసీ కవరేజ్:
గది అద్దె, భోజనం, నర్సింగ్ ఖర్చుల కోసం ఒక రోజుకు
రూ.3 లక్షల మరియు రూ.4 లక్షల బీమాపై గరిష్టంగా రూ.5,000/- లవరకు
రూ.5 లక్షల ఆపై బీమా పాలసీకి సింగల్ స్టాండర్డ్ A/c Room సౌలభ్యం కొరకు.
సర్జన్, మత్తుమందించే డాక్టర్లు, కన్సల్టెంట్ డాక్టర్, నిపుణుల ఫీజు.
మత్తు, రక్తం, ఆక్సీజన్, ఆపరేషన్ థియోటర్ ఛార్జీలు, శస్త్ర చికిత్స ఉపకరణాలు, మందులు మరియ రోగ నిర్థారణ పరీక్షలు.
డయాలసిస్,కీమో థెరపీ, రేడియో థెరపీ, పేస్ మేకర్, స్టంట్ మరియు ఇతర ఖర్చులు.
అంబులెన్స్ ఛార్జీలు, ఒక హాస్పిటలైజేన్ కు రూ.750/- గరిష్టంగా రూ.1500/- ఇవ్వబడును.
డేకేర్ విధానానికి కవరేజ్
అన్ని డే కేర్ సదుపాయాలను పొందవచ్చును.
నో క్లెయిమ్ బోనస్
క్లెయిమ్ చేయని సంవత్సరాలకు గరిష్టంగా బీమా మొత్తంలో 100% బోనస్ పొందవచ్చు.
రీఛార్జ్ ప్రయోజనం
పాలసీ బీమా రూ.3,4 లక్షలకు పై 25% సౌకర్యం కలదు.
రూ.5 లక్షలు మరియు ఆపైన గరిష్టంగా రూ.1,50,000 వరకు సౌకర్యం కలదు.
ఆటోమెటిక్ రిస్టోరేషన్
పాలసీ సంవత్సరంలో బీమా మొత్తం అయిపోతే, మళ్లీ పూర్తి (100%) బీమా మొత్తం అందుబాటులోకి తెచ్చే సౌకర్యం సంవత్సరంలో 3 సార్లు పొందవచ్చును.
ప్రీ మరియు పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు
ఆసుపత్రిలో చేరకముందు 60 రోజుల్లోపు భరించిన ఖర్చులు మరియు డిశ్చార్జి తర్వాత 90 రోజుల్లో భరించిన ఖర్చులు కూడా చెల్లించబడతాయి.
ఆరోగ్య తనిఖీ (హెల్త్ చెకప్) సౌకర్యం
ఎలాంటి క్లెయిమ్ లేని సంవత్సరంలో ఫ్రీ హెల్త్ చెకప్ కొరకు గరిష్టంగా రూ.3,500 వరకు ఇవ్వబడును.
డోమిసిలియరి ట్రీట్ మెంట్ నివాస స్థానం వద్దనే చికిత్స 3 రోజులకు మించినట్లయితే వైద్య ఖర్చులు చెల్లించబడతాయి.
సెకండ్ మెడికల్ ఒపీనియస్
star health insurance network వైద్యులు ద్వారా ఈ ప్రయోజనం పొందవచ్చు.
అవయవ మార్పిడిపై అవయవ దాత ఖర్చు చెల్లింపు
బీమా కలిగిన వ్యక్తి అవయవ గ్రహీత అయితే అవయవ దాత నుండి మార్పిడికి అయ్యే ఖర్చుల కోసం నిర్థిష్టమైన పరిమితికి లోబడి పరిహారం చెల్లించబడుతుంది.
కొత్తగా జన్మించిన శిశువు కవరేజ్
పాలసీ కాలంలో కొత్తగా జన్మించిన శిశువు యొక్క ఆసుపత్రి ఖర్చులకై నిర్థిష్టమైన పరిమితికి లోబడి పరిహారం చెల్లించబడుతుంది.
ఇన్ఫర్టిలిటి చికిత్స
పాలసీ తీసుకున్న 3 సంవత్సరాల తర్వాత దంపతులకు సంతానం కలగని పక్షంలో సంతాన సౌఫల్యం చికిత్సం పొందవచ్చును. ప్రతి మూడు సంవత్సరాల పాలసీ కాలానికి గరిష్టంగా
రూ.5 లక్షల బీమా మొత్తానికి రూ.1 లక్ష మరియు
10 లక్షల ఆపై బీమా మొత్తానికి రూ.2 లక్షల వరకు చెల్లించబడును.
మినహాయింపులు ముందుగానే ఉన్న రుగ్మతలు
పాలసీని క్రమం తప్పకుండా పునరుద్ధరణ చేసినట్టయితే 48 నెలల తర్వాత, ముందుగానే ఉన్న రుగ్మతలు కూడా కవర్ చేయబడతాయి.
30 రోజుల మినహాయింపు
పాలసీ క్రింద మొదటి సంవత్సరంలో కవర్ తేదీ నుండి మొదటి 30 రోజుల సమయంలో సుస్తీ/ వ్యాధికి చేసే ఏదైనా క్లెయిమ్ ఇవ్వబడదు. యాక్సిడెంట్ కారణంగా కలిగిన గాయాలకు సంబంధించిన క్లెయిమ్‌లకు ఈ మినహాయింపు వర్తించదు.
మొదటి రెండు సంవత్సరాల మినహాయింపులు
కంటి శుక్లం, హిస్తోరెక్టమీ, మోకాలిచిప్ప లేక కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స (ప్రమాదం వల్ల అవసరం అయ్యేది కాకుండా), వెరికోస్ వెయిన్స్, ఫిస్తులా – ఇన్ఏనో, సైనసైటిస్, పిత్తాశయ, మూత్ర పిండాళ్లోని రాళ్ల తొలగింపు, హెర్నియా మరియు పాలసీ లో పొందుపరిచిన మొదలగు వ్యాధులు.
సహా చెల్లింపు
61 సంవత్సరాల నుండి 65 సంవత్సరాల వయస్సు ఉన్న వారు కొత్తగా పాలసీ తీసుకున్న యెడల ప్రతి క్లెయిమ్నకు 20% సహా చెల్లింపు నిబంధన వర్తిస్తుంది.

ఇది చదవండి:నిఘా నీడన పంచాయతీ ఎన్నికలు!
ఇది చదవండి:జగ్గయ్యపేటలో కొనసాగుతున్న పోలింగ్
ఇది చదవండి:అటవీ శాఖకు బాలుడు ఫిర్యాదు,రూ.67వేలు జరిమానా!
ఇది చదవండి:ఎన్నికల వేళ ఏపీలో భారీగా మద్యం స్వాధీనం!
ఇది చదవండి: మంత్రి పువ్వాడపైన నిప్పులు చెరిగిన భట్టి విక్రమార్క
ఇది చదవండి:పదేళ్లు నేనే సీఎంను! ఇది పక్కా!
ఇది చదవండి:మరో పవన్ కళ్యాణ్ లా వస్తున్న ఉప్పెన వైష్టవ్ తేజ్
ఇది చదవండి:కార్పొరేట్ సంస్థల సేవకుడు మోడీ!
ఇది చదవండి:ఇంక్యూబేషన్ సెంటర్లతో ఉద్యోగావకాశాలు: గవర్నర్
ఇది చదవండి:నిగ్గదీసి అడగటానికి నీకెందుకు భయం?