Fake Police : నకిలీ పోలీసులు హల్చల్! గొర్రెలు అపహరణ!
Fake Police : కృష్ణా జిల్లా గుడివాడ పరిధిలోని నందివాడ మండలం నందివాడ గ్రామంలో డిఎస్పీ, సిఐలమని నకిలీ పోలీసులు సోమవారం రాత్రి హల్చల్ సృష్టించారు. అంతటితో ఆగకుండా గొర్రెల కాపరులను బెదిరించి 4 గొర్రెలను అపహరించారు. జొన్నపాడు వద్ద నైట్ బీట్లో ఉన్న పోలీసులకు ఈ విషయాన్ని గొర్రెల కాపరులు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం నకిలీ పోలీసులు ఒక గొర్రెను కోసుకున్నారు.
ప్రస్తుతం నందివాడ పోలీస్స్టేషన్ లో మండల నాయకులు పంచాయతీ చేసినట్టు, దొంగతనం చేసిన వ్యక్తులను మండల నాయకులు సపోర్టు చేస్తున్నారని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం బయటకు పొక్కడంతో తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court