
రూ.12 లక్షల నగదు స్వాధీనం
Fake IPS officer arrested in Tirupathi | నకిలీ ఐపిఎస్ అధికారి అరెస్టు Tirupathi: 2020 లో కొద్ది గంటల్లో ముగిసిపోతుండగా ఓ నకిలీ ఐపిఎస్ అధికారి పోలీ సులకు పట్టుబడ్డాడు. తాను ఐపిఎస్ అధికారినని, హైదరాబాద్‌కు పోలీసు కమిషనర్‌గా పనిచేస్తున్నానని చెబుతూ అధికారం చెలాయిస్తున్నాడు. తనకు ప్రభుత్వంలో, రాజ కీయ నాయకులతో బాగా పరిచయాలున్నాయని, తాను ఎవరికైనా ఇసుక క్వారీలు, పిల్లలకు టిటిడి లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నమ్మిస్తూ రూ.39 లక్షలు వసూలు చేశాడు నకిలీ ఐపిఎస్ అధికారి. హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ముస్తాక్ అనే వ్యక్తి గురువారం తిరుపతి సిసిఎస్ పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.12 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
నమ్మిచ్చి లక్షల్లో వసూలు చేసిన వైనం
హైదరాబాద్ కు చెందిన మహమ్మద్ ముస్తాక్ అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ పనులు చేసుకుంటూ ఉండేవాడు. అతను 2013లో శ్రీకాళహస్తికి చెందిన వహీదా అనే ఆమెను రెండో పెళ్లి చేసుకుని ఆమె కోసం హైదరాబాద్ నుంచి శ్రీకాళహస్తికి పోతూ వస్తూ తిరుపతి రైల్వే స్టేషన్ లో విజయడైరీ మిల్క్ షాపును నడిపే శివలీలా దేవితో పరిచయం పెంచకున్నాడు.
ఆమెకు తాను ఐపిఎస్ అధికారినని, హైదరాబాద్‌కు పోలీసు కమిషనర్‌గా పని చేస్తున్నానని చెబుతూ ఆమె ద్వారా డ్వాక్రా సభ్యులైన మునీరాజమ్మ, భాను, యశోద, జయలక్ష్మీ, హేమలత, నాగరాజు, మధులతో పరిచయం పెంచుకుని తనకు ప్రభు త్వంలో, రాజకీయ నాయకులతో బాగా పరిచయాలున్నాయని వారి పిల్లలకు టిటిడి ఉద్యోగాలు ఇప్పిస్తామని, డ్వాక్రా మహిళలకు ఇసుక క్వారీలు ఏర్పాటు చేయిస్తామని నమ్మించాడు. వారి నుంచి రూ.39 లక్షలు వసూలు చేసుకుని తర్వాత ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పరార్ అయ్యాడు.


విషయం తెలుసుకున్న హేమలత ఇచ్చిన ఫిర్యాదుపై జిల్లా ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన తిరుపతి సిసిఎస్ పోలీసులు కేసును ప్రతిష్టా త్మకంగా తీసుకున్నారు. క్రైమ్ అడిషినల్ ఎస్పీ మునిరామయ్య, డిఎస్పీ మురళీ ధర్ సూచనలు పాటిస్తూ దర్యాప్తును ముమ్మరం చేసి గురువారం ముద్దాయి మహమ్మద్ ముస్తాక్ ను తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.12 లక్షల నగదును స్వాధీనం చేసుకుని ముద్దాయిని రిమాండ్‌కు పంపుతున్నారు.
కేసు దర్యాప్తు చేయడంలో, ముద్దాయిని అరెస్టు చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన సిసిఎస్, సిఐ మోహన్‌ను వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందిస్తూ వారికి రివార్డులు మంజూరు చేయనున్నట్టు తెలిపారు.
ఇది చదవండి: నందం సుబ్బయ్య అంతిమ యాత్రలో పాల్గొన్న నారా లోకేష్