Fake Gold: కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అదోని బ్రాంచ్లో 2019 సంవత్సరం డిసెంబర్ నెల 11వ తేదీన ప్రమోద్ 35 తులాల బంగారం కుదవ పెట్టి రూ.5 లక్షలు రుణం తీసుకున్నాడు.
ఈ మధ్య కాలంలో బ్యాంక్ నుండి బంగారం విడిపించుకోక పోతే వేలం వేస్తామని బ్యాంక్ నుండి పదే పదే ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ నెల 26న బ్యాంకు లో రుణం కట్టి బంగారాన్ని విడిపించుకున్నాడు. ఎందుకైనా మంచిదని బంగారం చెక్ చేసి ఇవ్వాలని బాధితుడు ప్రమోద్ బ్యాంకు అధికారులను అడిగాడు.
అయితే బంగారానికి సీల్ వేసి ఉంటాయి కాబట్టి చెక్ చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అయినా అనుమానంతో ప్రమోద్ బంగారాన్ని బజారులో చెక్ చేయించగా అది నకిలీ అని(Fake Gold) తేలింది. దీంతో బెంబేలెత్తిన బాధితుడు బ్యాంక్ కు వెళ్లి విషయం చెప్పారు.
బ్యాంక్ సిబ్బంది మాకు సంబంధం లేదని బంగారాన్ని వెంటనే తీసుకు రావాలి కానీ రెండు గంటల తర్వాత తేవడంతో మాకు సంబంధం లేదని బ్యాంకు మేనేజర్ వాధించాడని బాధితుడు లబోదిబో మంటున్నాడు. తనకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?