Fake DSP | ఓ వ్యక్తి డిఎస్పీ అవతారం ఎత్తాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. ఈ నకిలీ డిఎస్పీ(Fake DSP) మోసాలను పసిగట్టిన రాజమండ్రి అర్భన్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామానికి చెందిన బత్తుల శ్రీను(32) తాను పోలీసు శాఖలో డీఎస్పీనని ప్రజల ముందు నమ్మపలికాడు.
ఇది ఆసరాగా చేసుకొని అమాయక నిరుద్యోగులకు నకిలీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ లెటర్ హెడ్లను వినియోగించి డబ్బులు వసూలు చేస్తున్నాడని తెలిపారు. అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాల మేరకు ఎఎస్పీలతా మాధురి పర్యవేక్షణలో సౌత్ జోన్ డీఎస్పీ ఎమ్.శ్రీలత, రెండో పట్టణ సిఐ ఆర్.విజయ్ కుమార్, సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి రూ.10 లక్షల 90 వేల రూపాయలు, 3 జతల పోలీసు యూనిఫాం, నకిలీ లెటర్ హెడ్స్, 3 సెల్ఫోన్స్, లాప్ ట్యాప్, ఏపీ 16బిబి2345 ఇన్నోవా కారు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఎస్పీ ఐశ్వర్య రస్తోగి వెల్లడించారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ