Fake Documents Case

Fake Documents Case : న‌కిలీ ద‌స్తావేజుల‌తో స్థ‌లాలు అమ్మార‌ట‌!

Spread the love

Fake Documents Case: న‌కిలీ లింక్ ద‌స్తావేజుల‌తో స్థ‌లాల‌ను అమ్మిన సంఘ‌ట‌న గుంటూరు జిల్లా మంగ‌ళగిరి లో వెలుగు చూసింది. స్థ‌లాల‌ను అమ్మిన న‌లుగురిని పోలీసులు అరెస్టు చేశారు.


Fake Documents Case : మంగ‌ళ‌గిరి: గుంటూరు ఎస్పీ కార్యాల‌యంలో అర్బ‌న్ ఎస్పీ హ‌ఫీజ్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం మంగ‌ళ‌గిరి ప‌ట్ట‌ణంలో ర‌త్నాల చెరువు స‌ర్వే నెంబ‌ర్ 134లో ఉన్న‌టువంటి స్థ‌లాల‌ను న‌కిలీ దస్తావేజులు(Fake Documents) త‌యారు చేసి మంగ‌ళ‌గిరి ప‌రిస‌ర ప్రాంతాల్లో గ‌ల అమాయ‌క ప్ర‌జ‌ల‌కు వాటిని మోస పూరితంగా అమ్మ‌డంపై 13 ఫిర్యాదులు వ‌చ్చాయ‌న్నారు. పాత మంగ‌ళ‌గిరికి చెందిన ఉద్దంటి శ్రీ‌నివాస‌రావు, పంచుమ‌ర్తి నాగ‌రాజు, బార్గ‌వ పేట‌కు చెందిన జొన్నాదుల శ్రీ‌ను అనే వారికి డ‌బ్బులు అవ‌స‌రం అయిన‌ప్పుడు ర‌త్నాల చెరువు ఏరియాలో గ‌ల ఖాళీ స్థ‌లాల‌ను గుర్తించి అమ్మేవార‌ని తెలిపారు.

ఉద్దంటి శ్రీ‌నివాస‌రావు, పంచుమ‌ర్తి నాగ‌రాజులు ఇద్ద‌రు క‌లిసి విజ‌య‌వాడ‌, గాంధీ న‌గ‌ర్ స‌బ్ రిజిస్ట‌ర్ ఏరియాలో గ‌ల వ‌క్క‌ల‌గ‌డ్డ విట‌ల్ రావు ద‌గ్గ‌ర డాక్యుమెంట్స్ కొనుగోలు చేసేవారు. వాటిపై విట‌ల్ రావు ద్వారా న‌కిలీ వెండ‌ర్ స్టాంప్‌లు తేదీల‌తో స‌హా వేయించి స‌ద‌రు స్థ‌లాల‌కు సంబంధించిన న‌కిలీ లింక్ డాక్యుమెంట్ త‌యారు చేయించేవార‌న్నారు. వాటిని ఆధారంగా చూపి జొన్నందుల శ్రీ‌ను అనే వ్య‌క్తి ద్వారా డ‌బ్బులు ఉన్న వారిని, మ‌ధ్య త‌ర‌గ‌తి వారిని గుర్తించి వారికి వంకం వెంక‌ట సుబ్బ‌య్య మ‌రియు మిగిలిన ముద్దాయిల‌ను స్థ‌ల య‌జ‌మానులుగా చూపించి స‌ద‌రు స్థలాల‌ను అమ్మి మోసం చేస్తూ ఉంటారు.

ఆత్మ‌కూరు గ్రామానికి చెందిన పులివ‌ర్తి మ‌రియ‌దాసు మ‌రియు 12 మంది బాధితులు ఫిర్యాదు చేయ‌గా ప‌ట్ట‌ణ సిఐ అంక‌మ్మ‌రావు ద‌ర్యాప్తు చేప‌ట్టార‌న్నారు.పాత మంగ‌ళ‌గిరికి చెందిన ఉద్దంటి శ్రీ‌నివాస‌రావు, పంచుమ‌ర్తి నాగ‌రాజు, మంగ‌ళగిరి బార్గ‌వ పేట‌కు చెందిన వెంక‌ట సుబ్బయ్య, విజ‌య‌వాడ గాంధీ న‌గ‌ర్‌కు చెందిన వ‌క్క‌ల‌గ‌డ్డ విట‌ల్ రావును అరెస్టు చేసిన‌ట్టు తెలిపారు. ఇదే కేసులో మిగిలిన 17 మంది ముద్దాయిల కోసం గాలింపు చేప‌ట్టిన‌ట్టు నార్త్ స‌బ్ డివిజ‌న్ డిఎస్పీ దుర్గా ప్ర‌సాద్ తెలిపారు.

నిందితులు ఇప్ప‌టి వ‌ర‌కు అమాయ‌క ప్ర‌జ‌ల‌కు న‌కిలీ డాక్యుమెంట్స్‌తో స్థ‌లాలు అమ్మి రూ.92 ల‌క్ష‌ల 90,000 వేలు దోచుకోవ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ మోసాల‌కు సంబంధించి 13 కేసులు న‌మోదు చేసి స‌ద‌రు కేసుల‌లో రూ.56 ల‌క్షల 60,000 వేలు వ‌ర‌కు మోసం చేసిన అమౌంట్‌గా గుర్తించామ‌న్నారు. ఇంకా కేసులు న‌మోదు చేయాల్సి ఉంద‌న్నారు. వీరిలో విట‌ల్‌రావు అనే స్టాంప్ వెండ‌ర్ నుంచి రూ.40 వేలు న‌గ‌దు, 6 బంగారు ఉంగ‌రాలు, ఖాళీ నాన్ జ్యుడిషియ‌ల్ డాక్యుమెంట్స్‌, ర‌బ్బ‌ర్ స్టాంప్స్‌, స్వాధీనం చేసుకున్నామ‌న్నారు.

మిగ‌తావారి ద‌గ్గ‌ర నుంచి వారు త‌యారు చేయించిన న‌కిలీ డాక్యుమెంట్స్ లో ఉన్న‌టువంటి వ్య‌క్తుల యొక్క ఆధార్ కార్డు కాపీల‌ను స్వాధీనం చేసుకున్నామ‌న్నారు. ఈ కేసులో ప్ర‌త‌భ క‌న‌బ‌రిచిన మంగ‌ళ‌గిరి ప‌ట్ట‌ణ సీఐ అంక‌మ్మ‌రావు, ప‌ట్ట‌ణ ఎస్ఐ నారాయ‌ణ‌, సిబ్బంది ఏ నాగంజ‌నేయులు, కె.శ్రీ‌నివాస్‌, సిహెచ్ కిరణ్ కుమార్‌, పి.శ్రీ‌నివాస్‌, వేణుల‌కు ఎస్పీ రివార్డు ప్ర‌క‌టించారు.

Janasena news today: జ‌న‌సేన ఎప్ప‌టికీ ప్ర‌జ‌ల త‌ర‌పునే!

Janasena news today: జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ బుధ‌వారం గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌ యానికి వ‌చ్చారు. అక్క‌డ నుంచి నేరుగా మంగ‌ళ‌గిరి లో ఉన్న పార్టీ Read more

NRI Hospital : పేర్లు పొర‌పాటు మాత్ర‌మే! ఆరోప‌ణ‌లు అవాస్త‌వాలు!

NRI Hospital : మంగ‌ళ‌గిరిలో ఉన్న ఎన్నారై ఆసుప‌త్రిపై వచ్చిన ఆరోప‌ణ‌లు అవాస్త‌వాల‌ని ఆసుప‌త్రి క‌మిటీ తేల్చి చెప్పింది. ఎంతో క‌ష్ట‌ప‌డి క‌రోనా పేషెంట్ల‌కు వైద్య చికిత్స Read more

Guntur news: గుంటూరులో ఘ‌రానా మోసం పెళ్లి పేరుతో కోటి స్వాహా!

Guntur news గుంటూరు: social media లో సాఫ్ట్ వేర్ ఉద్యోగికి వ‌ల‌వేసిన స‌త్తెన‌ప‌ల్లి కి చెందిన దంప‌తులు అత‌ని వ‌ద్ద నుంచి పెళ్లి పేరుతో కోటి Read more

grama volunteer suicide: కృష్ణా న‌దిలో దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న వాలంటీర్‌

grama volunteer suicide గుంటూరు: స‌చివాల‌యం అడ్మిన్ వేధింపులకు తాళ‌లేక వాలంటీర్ కృష్ణా న‌దిలో దూకి ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్న సంఘ‌ట‌న గుంటూరు జిల్లా మ‌హానాడులో చోటు చేసుకుంది. Read more

Leave a Comment

Your email address will not be published.