fake babas నాగర్ కర్నూలు: ఆర్థిక ఇబ్బందులను పూజలతో తొలగిస్తామంటూ బంగారాన్ని రెట్టింపు చేస్తామని అనుమానస్పదంగా తిరిగే దొంగ బాబాలను కల్వకుర్తి పట్టణ పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలో ఒక వ్యాపారి వద్దకు వచ్చిన ఇద్దరు దొంగ బాబాలు మీకు గ్రహదోశం వల్ల ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పారు. దీనితో ఉత్పన్నమయ్యే సమస్యలన్నింటిని గ్రహపూజతో తొలగిస్తామంటూ మభ్య పెట్టారు.
వ్యాపారి వద్ద రెండు తులాల బంగారం, రూ.25,000 వేలతో పాటు గృహోపకరణాలకు సంబంధించిన వస్తువులను పూజ పేరుతో పూజ గదిలో ఒక కుండలో పెట్టించారు. ఇంటి వారి దృష్టి మరల్చి దొంగలించిన సొమ్ముతో ఉడాయించారు. దొంగ బాబా(fake babas)ల ఆదేశానుసారం రెండు రోజుల తర్వాత పూజా గదిలో ఉంచిన కుండను తెరిచి చూడగా ఖాళీ కుండ కనిపించడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.
దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు కల్వకుర్తి పోలీసులను ఆశ్రయించారు. ఒక ప్రక్క రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తుండగా, మోసపోయిన బాధితులు తమ సొంత పనిపై హైదరాబాద్ వెళ్లగా నాగోల్ మెట్రో స్టేషన్, పిల్లర్ నెంబర్ 818 దగ్గర ఇద్దరు దొంగ బాబాలు కనిపించారు. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు బాధితుల సహాయంతో దొంగ బాబాలను పట్టుకొని కల్వకుర్తికి తీసుకువచ్చి పోలీసులకు అప్పగించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించారు. అనంతరం నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. నిందితుల నుంచి రెండు తులాల బంగారంతో పాటు రూ.25 వేలు నగదు, గృహపకరణాల వస్తువులు పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను జైలుకు పంపించారు.


ఇలాంటి వారు కనిపిస్తే సమాచారం ఇవ్వండి: ఎస్సై
ఇలాంటి దొంగ బాబాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై మహేందర్ సూచించారు. అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గమనించినట్లయితే పోలీసువారికి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.
- MLA Seethakka: తెలంగాణలో నీళ్లేవూ..నిధులూ లేవూ!
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!