wine shop: సిద్ధిపేట: వైన్‌షాపులో మద్యం కల్తీ చేస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఎక్సైజ్ సూపరిండెంట్ విజయ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఆదివారం సిద్ధిపేట ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
సిద్ధిపేట ముస్తఫా చౌరస్తాలోని దుర్గ భవాని వైన్స్ లో పనిచేస్తున్న తోట వేణుగోపాల్, ఆసన్న గారి రాజు, మల్కాపూర్ రాజులు ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో వైన్స్ షాపు(wine shop)లోకి వెళ్లి షట్టర్ వేసుకున్నారు. మద్యం కల్తీ చేస్తున్నారన్న పక్కా సమాచారం అందడంతో టాస్క్‌పోర్స్ సీఐ మధుకర్ శర్మ, ఎస్సై మాధవ రెడ్డి ఆధ్వర్యంలో షాపుపై దాడి చేశారు.
ఈ దాడిలో బెండర్ స్ప్రైట్, రాయల్ స్టాక్, ఆఫీసర్ ఛాయిస్ హాఫ్ బాటిల్ లో యునైటెడ్ గోల్డ్ చీప్ లిక్కర్, వాటర్ ను మిక్స్ చేస్తూ ముగ్గురు ఉన్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మూడు నెలలుగా కల్తీ చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. కల్తీ చేసిన 10 ఇయర్స్ బాయ్స్ , ఆఫీస్ చాయిస్, 18 బెండర్ స్రైట్ 6 చీప్ లిక్కర్ లీటర్ బాటిల్ అను స్వాధీనం చేసుకున్నామన్నారు.


వైన్‌షాపు ఓనర్ కు షోకాజ్ నోటీసు అందజేశామన్నారు. 5 లక్షల జరిమానా తో పాటు 20 వేల రూపాయలు సమయానికి మందు షాపును తీసినందుకు రూ.20 వేలు ఫైన్ విధించారు. మద్యం కల్తీ చేయడంపై పూర్తి విచారణ చేపట్టి చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌ఫోర్ట్ సీఐ మధుకర్ వర్మ, ఎస్ఐ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!