facts in telugu : టాస్ వేయ‌డానికి కాయిన్ లేన్న‌ప్పుడు ఏం చేస్తారు?

facts in telugu : జీవితంలో అంద‌రికీ అన్నీ తెలియ‌వు. కొన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాంటివి మ‌న‌కు తెలియ‌ని నిజాలు ఇక్క‌డ తెలియ‌జేస్తున్నాము. మీకు క‌చ్చితంగా ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఇక్క‌డ తెలిపిన అన్ని facts in telugu విష‌యాల‌ను ప‌రిశీలించండి.

facts in telugu : మ‌నకు తెలియ‌ని నిజాలు

  • యాల‌కుల‌కు ఒత్తిడి త‌గ్గించే గుణం ఉంటుంది. కాబ‌ట్టి మీరు ఒత్తిడిలో ఉన్న‌ప్పుడు యాల‌కుల‌ను టీలో కానీ, నీటిలో కానీ వేసుకుని తాగితే ఒత్తిడి త‌గ్గిపోతుంది.
  • గ‌న్‌కు సైలెంసెర్ యాడ్ చేస్తే దానికి త‌క్కువ సౌండ్ వస్తుంది. అదే విధంగా యుద్ధ ట్యాంక‌ర్‌లో కూడా సైలెంస‌ర్ ఉంటుంది.
  • మార్కెట్‌లో వ‌స్తువుల‌ను తేదీల ప్ర‌కారం స్టాక్‌ను ఏర్పాటు చేస్తారు. కాబ‌ట్టి పాత స్టాక్ సేల్స్ అవ్వ‌డం కోసం ముందు వుంచుతారు. మీరు మార్కెట్‌కు వెళ్లిన‌ప్పుడు ఒక్క‌సారి వెనుక ఉన్న స్టాక్‌ను ప‌రిశీలించి కొనండి.
  • కార్ డాష్ బోర్డుపై కాళ్లు పెట్టి ఉంచ‌డం చాలా ప్ర‌మాద‌ర‌కం. ఎందుకంటే ఎయిర్ బ్యాగ్స్ అక్క‌డే ఉంటాయి. ఏదైనా కారు డ్రైవింగ్ స‌మ‌యంలో ప్ర‌మాదం సంభ‌వించిన‌ప్పుడు ఎయిర్ బ్యాగ్స్ వేగంగా బ‌య‌ట‌కు వ‌స్తాయి. ఆ స‌మ‌యంలో కాళ్లు విరిగే ప‌రిస్థితి కూడా ఉంటుంది. ఇలాంటి ఘ‌ట‌న‌లు చాలా జ‌రిగాయి.
  • కొంత‌మంది బ‌రువు త‌గ్గ‌డం కోసం చాలా మంది భోజ‌నం తీసుకోవ‌డం త‌గ్గిస్తారు. కానీ అది ఆరోగ్య‌క‌రం కాదు. ఆరోగ్య‌క‌ర‌మైన బ‌రువు త‌గ్గాలంటే తినే ఆహారం త‌క్కువ త‌క్కువ తీసుకోవాలి. అస్స‌లు ఆహారం తిన‌కుండ ఉండ‌కూడ‌దు.
  • చీమ‌ల‌ను చీమ‌ల మందుతోనే చంపుతుంటారు. అలా కాకుండా ఇత‌ర ప‌ద్ధ‌తిలో కూడా చంప‌వ‌చ్చు. అదేలా అంటే ఉప్పు క‌లిపిన నీళ్ల‌ను, వెనికిగ‌ర్ క‌లిపిన నీళ్ల‌ను లేదా డిట‌ర్జంట్ పౌడ‌ర్ క‌లిపిన నీళ్ల‌ను స్ప్రే చేసి అయినా చంప‌వ‌చ్చు.
  • మ‌న మెద‌డు, క‌డుపు రెండూ కూడా నిరంత‌రం ఒక‌దానికితో ఒక‌టి సంప్ర‌దింపులు జ‌రుపుతూనే ఉంటాయి. అందుకే కొన్ని ఏమోష‌న్స్ మ‌న క‌డుపుపైన పిజిక‌ల్ ప్ర‌భావం చూపిస్తాయి. అందుక‌నే మ‌నం బాధ‌లో ఉన్న ఆందోళ‌న‌లో ఉన్న ఆరోగ్యం దెబ్బ‌తింటుంది.
  • సామ్‌సంగ్ కంపెనీ ఆయుధాల‌ను త‌యారు చేయ‌డం కూడా ప్రారంభించింది. సౌత్ కొరియా దేశానికి అత్య‌ధికంగా యుద్ధ ట్యాంక‌ర్ల‌ను, ఆయుధాల‌ను స‌ప్లై చేసేది సామ్‌సంగ్ కంపెనీనే.
  • ఏదైనా ఒక గ్లాస్ జాడీకి ఉన్న మూత ఎంత తిప్పినా రాక‌పోవ‌చ్చు. అలాంటి స‌మ‌యంలో దానిని 30 సెక‌న్ల వ‌ర‌కు వేడి నీటిలో ఉంచండి. ఆ వేడికి మూత లూస్ అయి తేలిక‌గా వ‌స్తుంది.
  • McDonald’s అంటే Mc అంటే కొడుకు అని అర్థం. Donald అంటే పేరు డోనాల్డ్ యొక్క కొడుకు అని అర్థం. దీనిని ఐర్లాండ్‌, స్కాంట్‌లాండ్‌లో ఎక్కువుగా వాడ‌తారు.
  • గూగుల్ మ్యాప్స్‌ (google maps) లో ఏ రూట్‌లో ట్రాఫిక్ ఎక్కువ‌గా ఉందో, ఏ రూట్‌లో ట్రాఫిక్ త‌క్కువుగా ఉంద‌నేది ఎలా చూపిస్తుందంటే ఆ రూట్‌లో GPS ట్రాక్ ఉన్న వాహ‌నాలు క‌దిలే వేగాన్ని బ‌ట్టి ఆ రూట్‌లో ఎంత ట్రాఫిక్ ఉందో గ‌మ‌నిస్తుంది.
  • మీ ద‌గ్గ‌ర టాస్ వేయ‌డానికి జేబులో కాయిన్ లేద‌నుకోండి. అప్పుడు మీరు గూగుల్‌లోకి వెళ్లి Flip a Coin సెర్చ్ చేసి టాస్ వేయ‌వ‌చ్చు.
  • ఇండియాలో అతి పొడ‌వైన ర‌హ‌దారి నేష‌న‌ల్ హైవే 44. ఇది ఇండియాకు ఉత్తార‌న ఉన్న శ్రీ‌న‌గ‌ర్ నుండి ద‌క్షిణాన ఉన్న క‌న్యాకుమారి వ‌ర‌కు వెళుతుంది. దీని పొడ‌వు 3,750 కి.మీ.
  • కొన్ని ప‌బ్లిక్ ప్లేస్‌ల‌లో ఫ్రీగా మొబైల్ ఛార్జింగ్ పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది. అలాంటి ప్లేస్‌లో మీ ఫోన్ ఛార్జింగ్ పెడితే మీరు రిస్క్‌లో ప‌డిన‌ట్టే. ఎందుకంటే మీరు పెట్టే ఛార్జింగ్ USB Cable నుండి మీ డేటా హ్యాక్ చేసేవారు ఉండి ఉంటారు. మీరు అది Charging కేబుల్ అని అనుకుంటారు. కానీ ఆ బోర్డు వెనుక‌, లోప‌ల హ్యాకింగ్ చేసే సిస్టం ఉంటుంది. అన్ని చోట్ల అలా ఉండ‌దు కానీ, అలా ఉండే అవ‌కాశం ఉంటుంది.
  • మ‌రికొన్ని facts in telugu వాటిని కింద చ‌ద‌వండి.
  • ప్ర‌పంచంలో అత్య‌ధికంగా పులులు క‌లిగిన దేశం ఇండియా. ప్ర‌పంచంలో ఉన్న పులుల సంఖ్య‌లో 80% ఇండియాలోనే ఉన్నాయి. 2018 నాటికి ఇండియాలో 3000 పులులు ఉన్న‌ట్టు అంచ‌నా.
  • గోవా రాష్ట్రం 1961 సంవ‌త్స‌రం త‌ర్వాత‌నే ఇండియాలో భాగ‌మైంది. అప్ప‌టి వ‌ర‌కు ఆ రాష్ట్రం Portuguese (పోర్చ్‌గీస్‌) వారి ఆధీనంలో ఉన్న‌ది. అందుకే గోవాలోని సంస్కృతి కానీ, జీవ‌న విధానం కానీ ఇండియాకు డిఫ‌రెంట్‌గా ఉంటుంది.
  • షార్క్ చేప‌లు జీవితాంతం ఎదుగుతూనే ఉంటాయి. వాటి ప‌ళ్లు కూడా ప్ర‌త్యేక‌మైన‌వి. షార్క్ చేప‌లు ప‌ళ్లు కోల్పోయినా మ‌ళ్లీ కొత్త ప‌ళ్ళు వ‌స్తాయి.
  • శ‌రీరానికి గాయం అయిన‌ప్పుడు మీరు ఎంత ఒత్తిడికి లోన‌వుతే గాయం మాన‌డం అంత నెమ్మ‌దిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *