facebook : ఫేసుబుక్ స్నేహ‌మే అత‌న్ని కాపాడింది!

Spread the love

facebook : ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌ని భావించి, చివ‌రిసారిగా త‌న స్నేహితుల‌కు facebook లో పంపిన సందేశ‌మే ఆయ‌న పాలిట వ‌ర‌మైంది. రైలు ప‌ట్టాల‌పై ప‌డుకున్న ఆయ‌న్ను కాపాడేలా చేసింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. గ‌త 15 ఏళ్లుగా కృష్ణా జిల్లా జ‌గ్గ‌య్య‌పేట‌లోని వివిధ హోట‌ళ్లో ప‌నిచేస్తున్న స‌తీష్ అనే యువ‌కుడు లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప‌నుల్లేక త‌న స్వ‌స్థ‌ల‌మైన అనంత‌పురం వెళ్లిపోయారు. అయితే ఆయ‌న కొంత‌కాలంగా ఫేస్‌బుక్ ద్వారా ఇక్క‌డున్న మిత్రుల‌తో మాట్లాడుతూనే ఉన్నారు. జీవితంపై విర‌క్తితో ఈ లోకం నుంచి సెల‌వు తీసుకుంటున్నానంటూ ఆయ‌న శ‌నివారం మ‌ధ్యాహ్నం త‌న స్నేహితుల‌కు ఓ సందేశం పంపారు.

రైలు ప‌ట్టాల‌పై ప‌డుకున్న స‌తీష్

వారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయ‌న స్పందించ‌లేదు. దీంతో స్థానిక అన్న‌పూర్ణ సేవా స‌మితి వ్య‌వ‌స్థాప‌కుడు మ‌హంకాళి ప్ర‌కాష్ చొర‌వ‌చూపి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. వెంట‌నే 100, 112 నెంబ‌ర్ల‌కు ఫోన్ చేసి విష‌యం చెప్పారు. ఈ విష‌యం తెలుసుకున్న జ‌గ్గ‌య్య‌పేట మాజీ ఎమ్మెల్యే శ్రీ‌రాం రాజ‌గోపాల్ తాత‌య్య సైతం స‌తీష్ నివ‌సించే అనంత‌పురం పోలీసుల‌కు విష‌యాన్ని తెలియ‌జేశారు. అక్క‌డి పోలీసులు సాంకేతిక ప‌రిజ్ఞానం ద్వారా అనంత‌పురానికి 10 కి.మీ.ల దూరం నుంచి ఆయ‌న సందేశం పంపార‌ని తెలుసుకున్నారు. ఆ ప్రాంతాన్ని గుర్తించి, అక్క‌డికి పోలీసుల‌ను పంపారు. అక్క‌డ స‌తీష్ రైలు ప‌ట్టాల‌పై ప‌డుకొని వారికి క‌న్పించాడు. అటుగా వెళ్లాల్సిన రైలు మ‌రో 7 నిమిషాల‌కు రావాల్సి ఉంది. దీంతో వారు ఆయ‌న్ను కాపాడి తీసుకొచ్చారు.

Vasthavai Mandal: అభిమాని కోరిక తీర్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ | Lingala Village

వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన జ‌న‌సైనికులు Vasthavai Mandal: 'ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను చూడాలి. త‌న చిర‌కాల కోరిక‌గా మిగిలి ఉంది.' అని ఓ అభిమాని తెల‌ప‌డంతో స్పందించిన జ‌న‌సేన పార్టీ Read more

MPDO suicide attempt in Jakranpally | ఎంపిడిఓ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

MPDO suicide attempt in Jakranpally | ఎంపిడిఓ ఆత్మ‌హ‌త్యాయ‌త్నంNizamabad : ఎంపిడిఓ ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన సంఘ‌ట‌న నిజామాబాద్ జిల్లా జ‌క్రాన్‌ప‌ల్లి మండ‌లంలో శుక్ర‌వారం చోటుచేసుకుంది. జ‌క్రాన్‌ప‌ల్లి Read more

Virat-Anushka’s Daughter Vamika’s Pictures Go viral

Anushka Sharma and her daughter Vamika have accompanied Virat Kohli for the India vs South Africa ODI match. Previously when Read more

no cow milk: సార్ నా గేదె పాలు ఇవ్వ‌డం లేదు! కంప్లెంట్ తీసుకోండి!

no cow milk: త‌న గేదె పాలు ఇవ్వ‌డం లేద‌ని గేదెతో స‌హా పోలీసు స్టేష‌న్‌కు వ‌చ్చి ఫిర్యాదు చేశాడు ఓ రైతు. ఈ వింత సంఘ‌ట‌న Read more

Leave a Comment

Your email address will not be published.