face skin careముఖంపై మొటిమలు, వాటి తాలూకు మచ్చలు ఇబ్బంది పెడుతుంటాయి. ఒక్కోసారి సమస్య తీవ్రమై యాక్నెగా మారుతుంది. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా వంటింటి పదార్థాలతోనే కొన్ని నియమాలు పాటిస్తే మేని మెరుపు సొంతమమ్వడం ఖాయం.
దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనె కలిపి రాత్రి పడుకునే ముందు సమస్య ఉన్న చోట రాసుకోవాలి. మర్నాడు గోరువెచ్చటి నీళ్లతో కడిగేసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు దూరమవుతాయి. కమల లేదా నారింజ తొక్కలను మిక్సీలో వేసి మెత్తగా (face skin care)చేసి కాసిని పాలు కలపాలి. ఇరువై నిమిషాలయ్యాక కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది.

వేరు సెనగ నూనెలో నాలుగు చుక్కల నిమ్మరసం చేర్చి ముఖానికి మర్థన చేసుకోవాలి. కొద్దిసేపయ్యాక నలుగు పెట్టుకుని స్నానం చేస్తే నల్లమచ్చలు దూరమవుతాయి. అలానే పుదీనా ఆకులను మెత్తగా చేసి రసం తీసి రాసుకున్నా చక్కటి ఫలితముంటుంది.
మెంతి ఆకులను రుబ్బి యాక్నె సమస్య ఉన్న చోట పూతలా రాసుకోవాలి. మర్నాడు కడిగేస్తే సరిపోతుంది. ఇలా తరుచూ చేయడం వల్ల సమస్య త్వరగా తగ్గుముఖం పడుతుంది. వేపాకులను మెత్తగా నూరి అందులో చిటికెడు పసుపు కలిపి రాసుకుని అరగంటయ్యాక కడుక్కోవాలి. దీని వల్ల చర్మ సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి.

పచ్చిపాలలో నిమ్మరసం కలిపి తరుచూ మేనిపై తుడుచుకోవడం వల్ల తైల గ్రంథులు మూసుకుపోయి ఈ సమస్య ఇబ్బంది పెట్టదు. అలానే చందనం పొడిలో నాలుగు చుక్కల గులాబీ నీళ్లు కలిపి ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాలయ్యాక కడిగేస్తే ఈ సమస్య అదుపులో ఉండిమేని కళగా తయావుతుంది. మీరు కూడా వీటిని ట్రై చేయండి. జాగ్రత్తలు పాటిస్తూ..
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి