Eyes On Target: భారత క్రికెట్ మాజీ సారథి ఎం.ఎస్ ధోని నెట్టింట్లో ఇప్పుడు సందడి చేస్తున్నారు. క్రికెట్ నుంచి రిటైర్డ్ అయినప్పటికీ ధోనీ క్రేజ్ ఏమాత్రమూ తగ్గలేదని చెప్పవచ్చు. IPL మాత్రం cskగా ఆకట్టుకుంటూనే ఉన్నారు. అదేవిధంగా పలు టివీల్లో యాడ్స్‌ల్లో కనిపిస్తూ ఫ్యాన్స్‌కు అతి దగ్గరగా చేరవుతున్నారు. తాజాగా ఓ యాడ్‌లో నటించిన ధోనీ సన్నివేశంపై నెటిజన్లు తెగ అభ్యంతరం(Eyes On Target) వ్యక్తం చేస్తున్నారట.
ఆ యాడ్ చూసిన వారు ఇదేమి యాడ్రా.. బాబోయ్ అంటూ చిరాకు పడుతున్నారు. అయితే ఆ యాడ్‌లో మెరిసిన ఎం.ఎస్ ధోని చివరకు నెటిజన్ల ఆగ్రహానికి గురవ్వక తప్పడం లేదు. యాడ్ సారంశం ఏమిటంటే.. ధోని వెనుక నుంచి స్పీడ్‌గా రైలు వస్తుంది. అదే పట్టాలపై ధోనీ పరిగెడుతుంటాడు. పట్టాలపై ఎదురుగా ఉన్న గోడలను చీల్చుకుంటూ ధోని వేగంగా వెళుతుంటాడు. అయితే మన ముందు ఉన్న ఎన్నో సమస్యలను అడ్డుకుని మన గమ్యానికి చేరుకోవాలనేది ఈ యాడ్ యొక్క సారంశం అని చెబుతున్నారు యాడ్ నిర్వాహకులు. గమ్యం వైపు చూపు ఎదురుగా ఎన్ని అడ్డంకులు ఉన్నా దాటితేనే విజయం సమకూరుతుంది.

ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సందర్భంగా విప్కతర సమయాల్లో లెస్సన్-7ను గుర్తు చేసుకోండి అనే క్యాప్షన్‌తో ఈ యాడ్‌ను సోషల్ మీడియాలోకి వదిలారు. అయితే యాడ్ చూసిన కొంత మంది నెటిజన్లు మాత్రం ఈ యాడ్ చాలా చెత్తగా ఉందని, ధోని ఎందుకు నటించాడంటూ కామెంట్లు చేస్తున్నారట.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!