Eye Makeup: కాలేజీ ఫంక్షన్లూ, ఫ్రెషర్స్‌డే పార్టీలూ ఇలా ఏవైనా సరే, అమ్మాయిలు మెరిసిపోవాలని అనుకుంటారు. బయటకు వెళ్లడానికి అందంగా ముస్తాబైపోతారు. అయితే ముఖంలో కళ్లు బోలెడంత అందాన్నిస్తాయి కదా. కాబట్టి వాటికి Makeup వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది.
Eye Makeup: కళ్లకు మేకప్ వేసుకునే పద్ధతి!
అందాన్ని పెంచడానికి ఉపయోగించే వాటిల్లో Primer ఒకటి. దీన్ని మరీ దట్టంగా పూసుకుంటే ఉన్న చక్కదనం కూడా చెడిపోతుందట. కనుక మీ చర్మం రంగుకి బాగా నప్పేదాన్ని ఎంచుకోవాలంటున్నారు బ్యూటీషన్స్. కళ్లకి చుట్టూ ఎక్కువుగా రాయకుండా లైట్‌గా టచప్ ఇవ్వాలి. రెప్పలపై వేసే Eyeshadow ని కూడా మీ చర్మ రంగుకి తగ్గదే ఎంచుకోవాలి. వంకాయ రంగు, నలుపూ, పసుపూ లాంటి రంగుల జోలికి పోకుండా లేత గులాబీ, బూడిద రంగువి ఎంచుకోవాలి.
మీరు దేనిని ఎంచుకున్నా మరీ దట్టంగా వేయకూడదు. కాటుకని లైట్‌గా వేసుకున్నాక, కనురెప్పలకి కాస్త మస్కారాని పూసుకున్నా బాగుంటుంది. కొందరు కృత్రిమ కనురెప్పలు పెట్టుకోవడం, లేదా ఉన్న రెప్పలకే ఎక్కువుగా మస్కారాన్ని పూయడం చేస్తారు. దీనివల్ల ముఖంలో కళ్లు బాగా నల్లగా కనిపించే అవకాశం ఉంది. కనుబొమ్మలికి Eyeliner కూడా పల్చగా గీస్తే చాలా మంచిది. ఇలా తక్కువ మేకప్‌తోనే సహజంగా అందంగా కనిపించవచ్చు.
మేకప్ జాగ్రత్తలివే!
మేకప్ వేసుకునే ముందు చేతులను చక్కగా శుభ్రం చేసుకుని తీరాలి. మేకప్ వేసుకునే వారందరూ తప్పనిసరిగా పాటించాల్సిన ప్రాథమిక జాగ్రత్త ఇది. ఇతరుల మేకప్‌ని మనం వాడుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు ఎలర్జీలు వస్తాయి. అవతలి వారి చర్మంలోని క్రిములు మీ చర్మంలోకి చేరడమే అందుకు కారణం. కాబట్టి మేకప్ సామాగ్రి ఎంత ప్రాణ స్నేహితురాలైనా, వాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం చాలా మంచిది.


Eye Makeup: కళ్లకు మేకప్ వేసుకునే కొన్నిసార్లు పడక Infection వచ్చే అవకాశం ఉంది. కళ్లు మంట కూడా పుట్టడం, ఎర్రబడటం లాంటవి జరిగుతాయి. వెంటనే చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి. మేకప్ ఉత్పత్తులకీ ముగింపు తేదీ ఉంటుంది. ఆ తేదీ అయిపోయిన వాటిని వాడటం వల్ల Skin మంటపుట్టడం, దద్దుర్లు రావడం లాంటి సమస్యలు తప్పవు.