Eye Beauty Tips : మన కళ్లపై ఆరోగ్యపరంగా, అందం పరంగా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ముఖ్యంగా స్త్రీలు ఈ విషయంలో మరింత జాగ్రత్తలు పాటిస్తుంటారు. ఆడవారికి అందం కళ్లు కూడా ఒక భాగమే. అలాంటి కళ్లపై వారు తీసుకునే జాగ్రత్తలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం!
Eye Beauty Tips : ప్రతి ఒక్కరి ముఖం ఆకర్షణీయంగా కనిపించాలంటే వారి కళ్లు బాగుండాలి. వారి కళ్లును బట్టే వారి అందం ఇనుమడిస్తుంది. అందానికే కాదు మనిషి ఆరోగ్యానికి కూడా కళ్ళే చిహ్నం. అందుకే జీవం లేకుండా మారే కళ్ళు ఉంటే వారి ముఖం చాలా జీవరహితంగా ఉండటం సహజమే. అయితే కళ్లను చక్కగా కాపాడుకుంటే అందంతో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. అందుకే చాలా మంది కళ్ల గురంచి ఆలోచిస్తుంటారు. అయితే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో? ఏమేమి వాడాలో తెలియక సతమతమవుతుంటారు. అలా వారి కోసమే ఈ గృహ చిట్కాలు.
కళ్లు కాంతివిహీనంగా కనిపిస్తుంటే?

చాలా మంది సౌందర్య పోషణకు తగినంత సమయాన్ని కేటాయిస్తారు. కానీ నిద్రపోవడానికి మాత్రం సమయం లేదంటుంటారు. ఇది ఎంతమాత్రమూ సరైన పద్ధతి కాదు. రోజుకు 8 గంటలు నిద్ర తప్పనిసరి. కొందరు ఉప్పంటే తెగ ఇష్టపడుతారు. కొందరైతే ప్రతి వంటకంలోనూ అదనంగా కొంత ఉప్పు వేసు కుంటారు కూడా. కానీ అధికంగా చేరే ఉప్పు శరీరంలోని నీటిని పీల్చేసు కుంటుంది. దాంతో కళ్లు ఎండిపోయినట్టు కనిపిస్తాయి. అలాకాకుండా ఉప్పు తక్కువుగా తినాలి. నీళ్లేక్కువుగా తాగాలి. రోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఉండే మలినాలు బయటకు పోతాయి. ఫలితంగా కళ్లకింద చేరిన ముడతలు నెమ్మదిగా తగ్గుతాయి. ఫ్రిజ్‌లో ఉంచిన గ్రీన్ టీ బ్యాగుల్ని పది పదిహేను నిమిషాల పాటు కళ్ల కింద ఉంచుకోవాలి. ఇలా చేస్తే వాపు తగ్గి, కళ్లు తాజాగా కనిపిస్తాయి. ముక్కలుగా కోసి కీరదోసనీ ఇలా వాడి చూడొచ్చు.
విటమిన్ ఎ, సిలు పుష్కలంగా ఉండే క్యారెట్, చిలగడ దుంపలు, పాలకూర, జామకాయలు, సిట్రస్తో కూడిన పండ్లు, పాలకూర వంటి ఆహార పదార్థాలు కంటికి మంచిది. డాక్టర్ సలహాతో ఒమేగా 3 క్యాప్సూల్స్ కూడా తీసుకోవచ్చు. రోజూ ఉదయాన్నే బీట్ రూట్ రసం తాగాలి. రుచి కోసం ఒక ముక్క నిమ్మకాయి పిండుకోవచ్చు. అలసిన కళ్లకు అప్పటికప్పుడు ఉపశమనం కలిగించాలంటే రెండు అరచేతులనీ గట్టిగా వేడి పుట్టే వరకు రుద్ది ఆ చేతులను కళ్ల మీద పెట్టుకోవాలి. కళ్ళు విశ్రాంతిని పొంది తాజాగా ఉంటాయి.
ఒక గిన్నెలో వేడి నీరు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న ఐస్ ముక్క తీసుకుని కనుగుడ్డుపై వృత్తాకారంలో రుద్దాలి. తర్వాత కొంత దూదిని తీసుకుని వేడినీటితో ముంచి కళ్లపై పెట్టుకోవాలి. ఈ విధంగా చన్నీటి, వేడినీటి ప్రక్రిమయను ఏడెనిమిది సార్లు చేయాలి. కళ్ళకు విశ్రాంతి దొరకడమే కాదు, తప్పకుండా కళ్లకు మెరుపు వస్తుంది కూడా.
ఒక టీ స్పూన్ టీ ఆకులు, పావు కప్పు నీటితో చిక్కగా బ్లాక్‌టీ డికాక్షన్ పెట్టుకుని, ఒక 5 నిమిషాలు దాన్ని ఫ్రిజ్‌లో ఉంచి చల్లారనివ్వాలి. తర్వాత బయటకు తీసి అందులో దూది ఉండలను ముంచి తీసి మూసిన కనురెప్పలపై పెట్టుకోవాలి. ఒక పదిహేను, ఇరవై నిమిషాలు అలా వదిలేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కంటి మీద ఉంచిన దూది ఉండల్లోని రసాన్ని కళ్లలోనికి వెళ్లేలా కళ్లను గట్టిగా పట్టి ఉంచాలి. ఇలా కళ్లు నుంచి నీరు కారేంత వరకు చేయాలి. ఇలా చేస్తే కళ్లు తాజాగా మెరుస్తూ ఉంటాయి. మెడిటేషన్, లేకా యోగా చేసి రిలాక్స్ అవచ్చు. దీర్ఘంగా శ్వాస తీసుకుని నెమ్మదిగా వదులుతూ సానుకూల ధృక్పథంతో ఉంటే ప్రశాంతంగా ఉంటుంది.

– కళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి బయట దుకాణాల్లో దొరకే ఈ క్రీం పడితే ఆ క్రీం రాయడం మంచిది కాదు. ఇలా చేస్తే మీ కళ్లు ఇన్ఫెక్షన్ బారినపడే ప్రమాదం ఉంది. అదీకాక మన కండ్లకు పడే క్రీములు కాకపోతే కళ్లు పోయే ప్రమాదమూ ఉంది. అందుకే వైద్యుని సలహాతోనే వాడాలి.
– అర టీ స్పూన్ కీరా రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని కళ్లకు రాసుకుని అరగంట సేపు ఉంచి ఆ తర్వాత కడుక్కుంటే కళ్లు ఆకర్షణీయంగా ఉంటాయి.
– కళ్లకు విశ్రాంతి ఎంతైనా అవసరం. తగినంత ఎక్కువ సేపు నిద్ర పోవడం వల్ల కళ్లకు రెస్ట్ దొరికితే తాజాగా కనపడతాయి.
– గ్లాస్ నీటిలో ఉసిరిపొడి నానబెట్టి ఉదయాన్నే ఈ మిశ్రమంతో కళ్లను కడుక్కుంటే తాజాగా మెరుస్తాయి. ఉసిరి అన్ని విధాలా ప్రయోజనకారే.
– కళ్ల చుట్టూ ఉండే ముడతలు పోవాలంటే పాల మీగడతో మసాజ్ చేసుకుంటే ముడతల నుండి విముక్తి పొందవచ్చు.
– కొందరికి నిద్రలేమి, అలసట, ఇతర సమస్యల కారణంగా కళ్లు ఉబ్బినట్టు కనిపిస్తుంటాయి. ఇలాంటి వారు గుడ్డులోని తెల్ల సొనను కండ్ల అడుగున రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ఆ సమస్య అదుపులోకి వస్తుంది.
ఐలైనర్ రాస్తే ఆ అందమే వేరు!
ముఖ అందాన్ని మెరుగుపరచడంలో కళ్ళే కీలకం. మరి వాటిని మెరిసేలా చేయాలంటే కొద్ది పాటి అలంకరణ తప్పనిసరిగా పాటించాలి. కళ్లు చిన్నవైనా, పెద్దవైనా, కాస్త ఐలైనర్(eyeliner) రాస్తే కొత్త అందం వస్తుంది. దాన్ని ఉపయోగించేటప్పుడు ముందుగా కంటి చుట్టూ జిడ్డును టిష్యూ లేదా కాటన్‌తో తుడిచేయాలి. ఆ తర్వాత నాణ్యమైన ఐలైనర్‌తో కళ్లకు అవుటర్లైన్ గీసుకోవాలి. అలాని మరీ దూరంగా కాకుండా వీలైనంత వరకు కనురెప్పలకు దగ్గరగా గీయడం వల్ల సహజంగా కనిపిస్తాయి. ఇలాంటప్పుడు కళ్లు పూర్తిగా తెరిచి నేరుగా అద్దంలోకి చూస్తూ గీయడం వల్ల చక్కని ఆకృతి వస్తుంది. ఐలైనర్‌ను ఎంచుకునేటప్పుడు ద్రవరూపంలో ఉండే ఐలైనర్(eyeliner) కంటే పెన్సిల్ లైనర్ను ఎంచుకోవడం వల్ల మీ పని సులభం అవుతుంది. మీ వయసు రంగుని బట్టి నల్లని ఐలైనర్నే కాదు కాస్త ముదురు రంగులో ఉండే బ్రౌన్, గ్రేలనూ ఎంచుకోవచ్చు.

మస్కారా రాసుకునేటప్పుడు కనురెప్పల కొనల నుంచే కాకుండా కుదుళ్ల నుంచి రాయాలి. దీనివల్ల రెప్పలు బరువుకి కిందకి వాలిపోకుండా ఉంటాయి. పూర్తిగా ఆరక ముందే ఐలాష్ (eye lashes) కర్లర్‌ను ఉపయోగించి వంపు తిప్పాలి. పూర్తిగా ఆరిన తర్వాతా అలా చేస్తే కనురెప్పలకున్న వెంట్రుకలు రాలిపోతాయి. కింద రెప్పలకు మస్కారా ఉపయోగిస్తున్నప్పుడు కింద భాగంలో టిష్యూ ఉంచుకోవడం వల్ల మీ మేకప్ పాడవకుండా ఉంటుంది.
అదనంగా అంటుకున్న ఐలైనర్ పాడవకుండా తుడిచేయడానికి బ్లాటింగ్ పేపర్‌ను ఉపయోగించవచ్చు. మేకప్ అంతా పూర్తయ్యాకనే ఐషాడో ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల మీ లుక్ తాజాగా కనిపిస్తుంది. కలువ రేకల్లా కళ్లు స్పష్టంగా తెలియాలంటే లేత రంగుల్లో ఉండే ఐషాడోని ఎంచుకోండి. ఇలా చేయడం వల్ల మీ కళ్లు అందంగానూ కనిపిస్తాయి.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి