Core Web Vitals Assessment: e-RUPI అంటే ఏమిటి? మొబైల్ ఫోన్ అవ‌స‌రం లేకుండా ప‌నిచేస్తుందా!

e-RUPI అంటే ఏమిటి? మొబైల్ ఫోన్ అవ‌స‌రం లేకుండా ప‌నిచేస్తుందా! నిజ‌మెంత‌?

e-RUPI: ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ ఆగ‌ష్ట్ 2వ తేదీన e-RUPI సేవ‌ల‌ను ప్రారంభించారు. దానికి ల‌క్ష్మి అని పేరు పెట్టారు. అస‌లు ఈ-రూపీ అంటే ఏమిటి? అది ఎలా ప‌నిచేస్తుంది? ఈ – రూపీ చెల్లింపులు ఎంత వ‌ర‌కు సుర‌క్షితం? bitcoin కి e-RUPI కి తేడా ఏమిటి? ఈ – రూపీ అనేది క్యాష్‌లెస్‌, కాంటాక్ట‌లెస్ అని చెప్ప‌వ‌చ్చు. రోజువారీ డిజిట‌ల్ చెల్లింపుల‌కు ఉప‌యోగించే ఈ ఈ-రూపీ వ్య‌వ‌స్థ‌ను National Payments Corporation of India(NPCI) అభివృద్ధి చేసింది.

భార‌త్ లో రిటైల్ చెల్లింపులు, సెటిలిమెంట్ వ్య‌వ‌స్థ నిర్వ‌హ‌ణను reserve bank of India ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప‌నిచేసే ఎన్‌పిసిఐ చూసుకుంటుంది. క్యాష్‌లెస్, కాంటాక్ట‌లెస్ వ్య‌వ‌స్థ‌యే ఈ-రూపీ ప‌నితీరు అని ఎన్‌పిసిఐ చెబుతుంది. ఇది క్యూ-ఆర్ కోడ్ మ‌రియు ఎస్‌మ్మెస్‌ల ఆధారంగా ప‌నిచేసే e voucher లాంటిది. అవ‌స‌రానికి స‌రిప‌డా డ‌బ్బు ముందే ఈ వోచ‌ర్‌లో ఉంటుంది కాబ‌ట్టి, ఈ-రూపీ లావాదేవీలు సుల‌భంగా, విశ్వ‌స‌నీయంగా ఉంటాయ‌ని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

ఈ-రూపీ సేవ‌ల్లో డ‌బ్బు చెల్లింపు దారులు, గ్ర‌హీత‌లు మ‌ధ్య end to end encrypted ఉంటుంది. అంటే ఇందులో మూడో వ్య‌క్తి జోక్యం ఉండ‌దు. ఈ-రూపీని భార‌త ఆర్థిక శాఖ‌, ఆరోగ్య శాఖ‌, నేష‌న‌ల్ హెల్త అథారిటీ భాగ‌స్వామ్యాల‌తో ఎన్‌పిసిఐ రూపొందించింది.

smart phone కూడా అవ‌స‌రం లేదు!

ఈ-రూపీ ప్ర‌త్యేక‌త ఏమిటింటే? ఇది ప్ర‌త్యేక‌మైన డిజిట‌ల్ ఫ్లాట్‌ఫాం కాదు. ఇది కొన్ని ప్ర‌త్యేక అవ‌సరాల కోసం వినియోంచే e voucher లాంటిది. దీనికి bank Account, google pay, phonepe వంటి డిజిటిల్ పేమెంట్ యాప్‌లు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు, ఆన్‌లైన్ బ్యాంకింగ్‌, ఇంట‌ర్నెట్ అవ‌స‌రం లేదు. దీనికి స్మార్ట్ ఫోన్ కూడా అవ‌స‌రం లేదు. voucher ఫ్రింట్ అవుట్‌లూ అవ‌స‌రం లేదు. ఇవేమీ లేక‌పోయినా క్యూ-ఆర్ కోడ్ రూపంలో వ‌చ్చే మెస్సేజ్‌తో ఈ-రూపీ ఓచ‌ర్‌ను యూజ‌ర్లు రిడిన్ చేసుకోవ‌చ్చు.

ఈ-రూపీ ఓచ‌ర్ల‌ను ముందుగా ఆరోగ్య రంగంలో ఎక్కువుగా వినియోగించే అవ‌కాశం ఉంది. కార్పొరేట్ సంస్థ‌లు త‌మ ఉద్యోగుల‌కు వీటిని జారీ చేయ‌వ‌చ్చు. కేంద్ర ప్ర‌భుత్వం కూడా వ్యాక్సిన్ e voucher ల‌ను ప్ర‌వేశ పెడ‌తామ‌ని చెబుతోంది. వ్యాక్సినేష‌న్ కోసం ప్ర‌వేశ పెట్టిన ఈ ఓచ‌ర్ల‌ను ఎవ‌రైనా కొని వేరే వాళ్ల‌కు గిఫ్ట్ గా కూడా ఇవ్వ‌వ‌చ్చు. ఇలా గిఫ్ట్ గా ఇచ్చిన ఓచ‌ర్‌ను తీసుకున్న వారు ఉప‌యోగించారో లేదో కూడా ట్రాక్ చేయ‌వ‌చ్చు.

ఇక న‌గ‌దు బదీలు సుల‌భంగా..!

ప్ర‌భుత్వం వివిధ ప‌థ‌కాల కింద పేద‌ల‌కు, రైతుల‌కు న‌గ‌దును నేరుగా వారి బ్యాంక్ ఖాతాలోకి బ‌దిలీ చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనిలో ప్ర‌భుత్వ ఉద్యోగుల జోక్యంతో కొన్ని సార్లు ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డుతున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటున్నారే ఆరోప‌ణ‌లూ ఉన్నాయి. ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు ఈ-రూపీ వ్య‌వ‌స్థ ప‌రిష్కారం చూపుతుంద‌ని, ఎలాంటి ఇబ్బంది లేకుండా ల‌బ్ధిదారునికి ప్ర‌యోజ‌నం చేకూరాల‌నే చేస్తుంద‌ని ప్ర‌ధాని మంత్రి కార్యాల‌యం తెలిపింది. దీనిని ప్ర‌భుత్వ ప్ర‌త్యేక న‌గ‌దు స‌హాయ‌కంగానూ చూడ‌వ‌చ్చు. ప్రైవేటు సంస్థ‌లు త‌మ ఉద్యోగుల కోసం దీనిని ఉప‌యోగించు కోవ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు..ఏదైనా కంపెనీ త‌న ఉద్యోగుల‌కు జీతంతో పాటు నెల‌కు అద‌నంగా రూ.500 ఇవ్వాల‌నుకుంటే దానిని ఈ రూపీ ఓచ‌ర్లుగా ఇవ్వ‌వ‌చ్చు. ఉద్యోగుల‌కు మొబైల్ ఫోన్‌కు కోడ్ లేదా ఎమ్మెస్ రూపంలో ఈ ఓచ‌ర్ వ‌చ్చేస్తుంది.

బిట్ కాయిన్ కు ఈ-రూపీకి తేడా ఏమిటి?

స్మార్ట్ ఫోన్ల వాడ‌కం పెరిగే కొద్ది డిజిల్ వాల్యూం వాడకం పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. క‌రోనా కార‌ణంగా కాంటాక్ట్ లెస్ పేమెంట్ల‌కు ఇలాంటి వాలెట్ల‌తో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. 2016 సంవ‌త్స‌రంలో పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత భార‌త్ లో డిజిట‌ల్ చెల్లింపుల సంఖ్య పెరిగింది. అయిన‌ప్ప‌టికీ 2020లో దేశంలో 89 శాతం లావాదేవీలు న‌గ‌దు రూపంలోనే చెల్లింపులు పెరిగాయి. ఈ-రూపీ రాక‌తో డిజిట‌ల్ చెల్లింపులు మ‌రింత పెరుగుతుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. మ‌రో వైపు ప్ర‌పంచ వ్యాప్తంగా డిజిట‌ల్ క‌రెన్సీ వాడ‌కం పెరుగుతుంది. ప్ర‌స్తుతం ప్రైవేటు రంగంలో చలామ‌ణి అవుతున్న అతిపెద్ద క్రిప్టో క‌రెన్సీ బిట్ కాయిన్ లాంటి వాటిపై ప్ర‌భుత్వ నియంత్ర‌ణ ఉండ‌దు. కానీ ఈ-రూపీ ప్ర‌భుత్వ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. నేష‌న‌ల్ హెల్త్ అథారిటీ వివ‌రాల ప్ర‌కారం ప్ర‌స్తుతం ఈ-రూపీతో SBI, HDFC, AXIS BANK, Punjob National Bank, Bank of Baroda, canara bank, Indusland Bank, ICIC Bank లు అనుసంధాన‌మ‌య్యాయి.

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *